వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కెఎంఎస్ 2020-21 మరియు కెఎంఎస్ 2021-22 మిగిలిన వరిలో 6.05 ఎల్ఎంటీ ల ఉప్పుడు బియ్యాన్ని(పారాబాయిల్డ్ రైస్) ఎఫ్ సి ఐ లో డిపాజిట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన కేంద్రం

Posted On: 14 MAY 2022 10:02AM by PIB Hyderabad

కెఎంఎస్ 2020-21 మరియు కెఎంఎస్ 2021-22 మిగిలిన వరిలో 6.05 ఎల్ఎంటీ ల ఉప్పుడు పొట్టు బియ్యాన్ని ఎఫ్ సి ఐ లో డిపాజిట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి అనుమతి ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి అందిన అభ్యర్థన మేరకు కేంద్రం దీనికి సంబంధించి 11.05.2022న లేఖ జారీ చేసింది. 

 

  కెఎంఎస్ 2020-21 (రబీ) కాలంలో కస్టమ్డ్ మిల్ల్డ్ రైస్ మిల్లింగ్/ సరఫరా కోసం తొలుత 2021 సెప్టెంబర్ వరకు గడువు గా నిర్ణయించారు. అయితే, తెలంగాణ నుంచి అందిన అభ్యర్థన మేరకు 04.05.2022న విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు గడువును 2022 మే వరకు పొడిగించడం జరిగింది. 

 

 కెఎంఎస్ (రబీ పంటలు) 2021-22 లో తెలంగాణలో 40.20 ఎంటీల వరిని 2022 జూన్ నాటికి సేకరించేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం దీని మిల్లింగ్ గడువును 2022 సెప్టెంబర్ గా నిర్ణయించింది. తెలంగాణ నుంచి 13.04.2022 తేదీన అందిన అభ్యర్థన మేరకు సేకరణ అంచనాలను 18.04.2022 నాటి లేఖలో కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ ఆమోదించింది. 

 

 తెలంగాణ తో సహా అన్ని రాష్ట్రాల్లో సేకరణ కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వరి సేకరణ గణనీయంగా పెరిగింది. కెఎంఎస్ 2015-16 కాలంలో 5,35,007 మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ 3,417.15 కోట్ల రూపాయల విలువ చేసే 15.79 ఎల్ఎంటీ వరి సేకరణ జరిగింది. దీనితో పోల్చి చూస్తే తెలంగాణలో కెఎంఎస్ 2020-21 కాలంలో 21,64,354 మంది రైతుల నుంచి 26,637.39 కోట్ల రూపాయల విలువ చేసే 94.53 ఎల్ఎంటీ వరి సేకరణ జరిగింది. 

 

 కొనసాగుతున్న కెఎంఎస్ 2021-22 కాలంలో 11.05.2022 నాటికి తెలంగాణలో 72.71 ఎల్ఎంటీ వరి (48.72 ఎల్ఎంటీ సమానమైన బియ్యం) కొనుగోలు చేయడం ద్వారా 11,14,833 మంది రైతులకు కనీస మద్దతు ధర రూపంలో 14251.59 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. 

 

***



(Release ID: 1825321) Visitor Counter : 150