గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

"ప్లంబెక్స్ ఇండియా ఎగ్జిబిషన్‌"లో ‘భారత్ ట్యాప్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు - పెట్రోలియం , సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి


భారత్ ట్యాప్ ప్రయత్నం : తక్కువ నీటి వాడకంతో పనిచేసే శానిటరీ-వేర్‌ను అందించడం , తద్వారా మూలంలోనే నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం లక్ష్యం .



తగినంత పారిశుధ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందదు; స్వచ్ఛత ప్రయాణాన్ని సులభతరం చేయడంలో అమృత్ కీలకం: శ్రీ పూరి



ప్లంబింగ్, నీరు , పారిశుద్ధ్య పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు , సేవలను ప్రదర్శించడానికి ప్లంబెక్స్ ఇండియా ఎగ్జిబిషన్ ఏర్పాటు

Posted On: 12 MAY 2022 2:51PM by PIB Hyderabad

గృహనిర్మాణం , పట్టణ వ్యవహారాలు -  పెట్రోలియం ,   సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి ఇక్కడ జరిగిన ‘ప్లంబెక్స్ ఇండియా’ ఎగ్జిబిషన్‌లో భారత్ ట్యాప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రదర్శన ప్లంబింగ్, నీరు,   పారిశుద్ధ్య పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు ,   సేవలు కోసం ఉద్దేశించింది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UXS7.jpg

ఈ ఎగ్జిబిషన్ దేశ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సేవను అందిస్తుంది - నీరు ,   పారిశుధ్యం ,   తగినంత పారిశుధ్యం లేకుండా పురోగతి లేదా పెరుగుదల లేదని, ఇది పౌరులు ఆశించే ప్రాథమిక సేవల సోపానక్రమంలో పునాది అని శ్రీ పూరి అన్నారు. భారతదేశ అభివృద్ధికి స్వచ్ఛత కీలకమని ప్రధాని ప్రకటించిన తర్వాత భారతదేశ సామాజిక అభివృద్ధిలో ఒక నమూనా మార్పు వచ్చిందని ఆయన అన్నారు. ప్రధాని బహిరంగ మలవిసర్జన సమస్యను పరిష్కరించడానికి ,   స్వచ్ఛత పట్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ్ భారత్ మిషన్‌ను ప్రారంభించడమే కాకుండా, భారతదేశంలోని 60% పట్టణ జనాభాకు సురక్షితమైన నీరు ,   మురుగు నీటి వ్యవస్థలను అందించడానికి అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్)ను కూడా రూపొందించారు. మొత్తంగా, ఈ పథకాలు దేశంలోని పారిశుద్ధ్య పరిస్థితి పై విపరీతమైన ప్రభావాన్ని చూపాయి అని ఆయన అన్నారు.

భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో 38% టాయిలెట్ కవరేజీ నుండి 100% కవరేజీకి చేరుకుందని, అలాగే పట్టణ ప్రాంతాల్లో 73.32 లక్షల గృహ ,   కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మించిందని, స్వచ్ఛ భారత్ మిషన్ దేశాన్ని సురక్షితంగా ,   సరైన దిశలో ప్రేరేపించే జన ఆందోళనగా మారిందని శ్రీ పూరి అన్నారు. పారిశుధ్యం. స్వచ్ఛత ప్రయాణాన్ని సులభతరం చేయడంలో అమృత్ మహోత్సవ్  కీలకం, ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్ కీలకపాత్ర పోషించింది - నీటి సరఫరా ,   మురుగు నీరు/సెప్టేజీకి ప్రధాన కేటాయింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

1,336 నీటి సరఫరా ప్రాజెక్టుల ద్వారా రూ. 42,224 కోట్లు ,   860 మురుగునీటి పారుదల ,   సెప్టేజీ నిర్వహణ ప్రాజెక్టులు రూ. 33,840 కోట్లు, AMRUT భారతదేశం అంతటా 127 లక్షల గృహ నీటి కుళాయి కనెక్షన్‌లు ,   95 లక్షల మురుగునీటి కనెక్షన్‌లను అందించడం అసమాన్యమని . అదేవిధంగా, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) -AMRUT కింద మురుగునీటి ప్రాజెక్టులు, STPల,   సుమారు 6,000 MLD ట్రీట్‌మెంట్ కెపాసిటీ అభివృద్ధికి దారితీస్తాయని అంచనా వేస్తున్నారు, దీనితో మెగాలీటర్లలో 2,360 రోజువారీ వినియోగ సామర్థ్యం MLD ఇప్పటికే ఏర్పాటు అయ్యింది.    దాదాపు 3,650 MLD మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (STP) పురోగతిలో ఉన్నాయి.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0027KW3.jpg

అమృత్ విజయవంతమైన తర్వాత, అమృత్ నగరాల్లో నీరు ,   పారిశుద్ధ్య సేవలు పటిష్టపరచడం కొనసాగిస్తూనే, దేశంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు (ULB) కవర్ చేయడం తదుపరి లక్ష్యం అని శ్రీ పూరి చెప్పారు. 1 అక్టోబర్ 2021న ప్రధానమంత్రి ప్రారంభించిన అమృత్ 2.0కి ఇదే ఆధారమని ఆయన అన్నారు. అమృత్ 2.0, రూ. 2,77,000 కోట్ల ఖర్చుతో , మన నగరం న్నింటినీ ‘వాటర్ సెక్యూర్’గా మార్చడం ద్వారా ‘న్యూ అర్బన్ ఇండియా’ ఆకాంక్షలను సాకారం చేసేందుకు రూపొందించింది.

అమృత్ 2.0 2.68 కోట్ల కుళాయి కనెక్షన్‌ల ద్వారా దాదాపు 4,700 పట్టణ స్థానిక సంస్థలలోని అన్ని గృహాలకు నీటి సరఫరాను 100% కవరేజీని అందజేస్తుందని ,   500 నగరాల్లో 2.64 కోట్ల మురుగునీటి కనెక్షన్‌ల ద్వారా 100% మురుగునీరు ,   సేప్టేజీని అందజేస్తుందని శ్రీ పూరి చెప్పారు. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లోని 10.5 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003E42I.jpg

రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రాష్ట్రాలు ప్రాజెక్టులను ప్రతిపాదించే ప్రక్రియలో ఉన్నాయని, దీని ఫలితంగా ఇప్పటికే రూ. 41,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు. ఈ మిషన్ ద్వారా పూర్తయ్యాయని ,   విజయవంతమైన అమలు నుండి ఉద్భవించిన ఒక ప్రధాన ప్రయోజనం పూర్తయిందని, ప్రత్యేకించి, అమృత్ వల్ల దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో పైప్‌లైన్‌లు వేశారని  ఆయన అన్నారు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004K2MO.jpg

దేశంలో పారిశుద్ధ్యం ,   ఇతర ప్రాథమిక సేవల అభివృద్ధికి తోడ్పాటునందించడం గణనీయమైన పాత్ర పోషిస్తూనే, ప్లంబింగ్ పరిశ్రమ వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోందని మంత్రి అన్నారు. భారత్ ట్యాప్ ప్రయత్నం  తక్కువ-నీటి అవసరాలతో అనుసంధానించిన  శానిటరీ-వేర్‌ను అందించగలదని, నీటి సంరక్షణ ప్రయత్నాలు, తద్వారా   నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.   ఈ ప్రయత్నం  దేశ ప్రజలు ఆమోదిస్తారని, ఇది    కొత్త దృష్టికి, దృక్పధానికి  దారితీస్తుందని తాను విశ్వసిస్తున్నాను అని మంత్రి అన్నారు.

శ్రీ పూరి స్త్రీలకూ ప్రత్యేకించిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NAREDCO)- NARDECO MAHI ,   ‘నిర్మల్ జల్ ప్రయాస్’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు, ఇది సంవత్సరానికి 500 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేయడానికి పని చేస్తుంది.

  గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ గుర్మిత్ సింగ్ అరోరా తో పాటు  ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్,   వాటర్ మేనేజ్‌మెంట్ ,   ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్ నుండి ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

****



(Release ID: 1825102) Visitor Counter : 168