వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశం నుంచి గోధుమ ఎగుమతులను పెంచే అవకాశాలు అన్వేషించడానికి మొరాకో, ట్యునీషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా , లెబనాన్‌లకు వాణిజ్య ప్రతినిధులను పంపనున్న ప్రభుత్వం.
ప్రధానంగా గోధుమలు పండించే రాష్ట్రాలతో ఎగుమతులపై వరుస సమావేశాలు నిర్వహించేందుకు వాణిజ్య శాఖ సన్నాహాలు
హర్యానాలోని కర్నాల్‌లో గోధుమ ఎగుమతి ప్రమోషన్ కోసం భాగస్వాముల సమావేశాన్ని నిర్వహించిన వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ - APEDA
Posted On:
12 MAY 2022 4:50PM by PIB Hyderabad
భారతదేశం నుంచి గోధుమ ఎగుమతులను పెంచే అవకాశాలు అన్వేషించడానికి కేంద్రం మొరాకో, ట్యునీషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా , లెబనాన్‌లకు వాణిజ్య ప్రతినిధులను పంపనుంది. 2022-23లో విశ్వవ్యాప్తంగా ధాన్యానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ రికార్డు స్థాయిలో 10 మిలియన్ టన్నుల గోధుమలను లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్యం, షిప్పింగ్ , రైల్వేలు , వ్యవసాయ , ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ఆధ్వర్యంలో ఎగుమతిదారులతో సహా వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే గోధుమ ఎగుమతులపై టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ వంటి గోధుమలను ప్రధానంగా పండించే రాష్ట్రాలతో ఎగుమతులపై ఇటువంటి అనుకూల సమావేశాలు నిర్వహించాలని వాణిజ్య శాఖ ప్రణాళిక వేసింది. APEDA గోధుమ ఎగుమతి ప్రోత్సహించడం, నాణ్యమైన ఉత్పత్తుల రవాణా నిర్ధారించడం కోసం హర్యానాలోని కర్నాల్‌లో రైతులు, వ్యాపారులు , ఎగుమతిదారులతో సహా వివిధ భాగస్వాములతో అటువంటి పరస్పర సమావేశాన్ని నిర్వహించింది. కర్నాల్ లోని ICAR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్, సహకారంతో భాగస్వాముల సమావేశం నిర్వహించారు, ఇందులో నిపుణులు గోధుమ ఎగుమతి రంగంలో ఉన్న అవకాశాలు , సవాళ్లు చర్చించారు.
-
గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ గోధుమలకు డిమాండ్ పెరుగుతోంది, రైతులు, వ్యాపారులు , ఎగుమతిదారులు దిగుమతి చేసుకునే దేశాల అన్ని నాణ్యత నిబంధనలు అనుసరించాలని సూచించారు, తద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గోధుమల నమ్మకమైన సరఫరాదారుగా ఉద్భవించింది. "దేశం నుంచి రవాణాను పెంచడానికి గోధుమ ఎగుమతుల విలువ గొలుసులోని వాటాదారులందరికీ మేము మా మద్దతును అందిస్తున్నాము" అని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) చైర్మన్ శ్రీ ఎం. అంగముత్తు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అంచనాల ప్రకారం, భారతదేశం 2021-22లో రికార్డు స్థాయిలో 7 మిలియన్ టన్నుల (MT) గోధుమలు ఎగుమతి చేసింది, దీని విలువ 2.05 బిలియన్ డాలర్లు. మొత్తం రవాణాలో 50% గోధుమలు గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యాయి.
ఇటీవల, ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమలను దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటిగా ఉన్న ఈజిప్ట్, భారతదేశం నుంచి గోధుమలను సేకరించేందుకు అంగీకరించింది. ఈజిప్టు అధికారులు భారతదేశాన్ని ఈ వ్యూహాత్మక వస్తువుకు మూలాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఈజిప్ట్ 2021లో 6.1 మెట్రిక్ టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంది , ఈజిప్టుకు గోధుమలు ఎగుమతి చేయగల గుర్తింపు పొందిన దేశాల జాబితాలో భారతదేశం భాగం కాదు. ఈజిప్టు గోధుమ దిగుమతుల్లో 80% కంటే ఎక్కువగా రష్యా , ఉక్రెయిన్ నుంచి 2021లో 2 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంటుందని అంచనా. ఉత్తర ఆఫ్రికా దేశానికి గోధుమలు, చక్కెర దిగుమతులను నిర్వహించే ఈజిప్ట్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీ - జనరల్ అథారిటీ ఆఫ్ సప్లైస్ అండ్ కమోడిటీస్‌లో నమోదు చేసుకోవాలని APEDA ఇప్పటికే ఎగుమతిదారులకు తెలియజేసింది.
***
(Release ID: 1825081)
Visitor Counter : 231