శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జీవ నమూనాలలో ఎలక్ట్రాన్ టోమోగ్రఫీపై జాతీయ వర్క్‌షాప్

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2022 11:36AM by PIB Hyderabad

జీవ  నమూనాలలో ఎలక్ట్రాన్ టోమోగ్రఫీపై అనే అంశంపై  ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూ ఢిల్లీలో ఐదు రోజుల జాతీయ వర్క్‌షాప్ మరియు శిక్షణ కార్యక్రమం   (ఆఫ్‌లైన్)  ప్రారంభమయింది. 2022 మే 9న ప్రారంభమైన సదస్సు 13వ తేదీ వరకు జరుగుతుంది. సామర్థ్య పెంపుదల కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ  స్టూటి ,శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ    సాఫీ  మరియు బయో టెక్నాలజీ మంత్రిత్వ  సహజ్  కార్యక్రమాల కింద నిర్వహిస్తున్నారు.  

 ఎలక్ట్రాన్ టోమోగ్రఫీ (ఆర్ టీ  మరియు క్రియో), ప్లంజ్ ఫ్రీజింగ్ వినియోగించి నమూనాలు సిద్ధం చేయడం, , క్రయో-అల్ట్రామైక్రోటమీ లేదా క్రయో ఫోకస్డ్- అయాన్-బీమ్, గ్లో డిశ్చార్జ్, గ్రిడ్‌లపై కణాలను పెంచడం, గ్రిడ్‌ను బదిలీ చేయడం వంటి వాటిని ఉపయోగించి నమూనా తయారీ, ఈఎం  , మరియు హ్యాండ్లింగ్, టిల్ట్ సిరీస్ డేటా సేకరణ మరియు ఇమోడ్  మరియు ఇటమో  సాఫ్ట్‌వేర్‌తో ప్రాసెస్ చేయడం ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో వర్క్‌షాప్ ను నిర్వహిస్తున్నారు.  వర్క్‌షాప్ సైద్ధాంతిక/మెథడాలాజికల్ ప్రసంగాలు  మరియు ప్రయోగాత్మక సదస్సులతో వర్క్‌షాప్ ను నిర్వహిస్తున్నారు.  

 న్యూ ఢిల్లీ డీన్ రీసెర్చ్ ఎయిమ్స్ ప్రొఫెసర్ సుబ్రతా సిన్హా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డాక్టర్ గరిమా గుప్తా సమక్షంలో ఎయిమ్స్ న్యూ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా ఈ వర్క్‌షాప్‌ను నిన్న ప్రారంభించారు.  

  ఐఐటీ  ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ మండిపా బెనర్జీ, జెఎన్ యూ కి  ప్రొఫెసర్ సునీల్ కాటేరియా,  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్, న్యూఢిల్లీ డాక్టర్ గోపాల్ ఝా,  సిఎస్ఆర్ఐ  సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ కే  ప్రసన్న, న్యూ ఢిల్లీ ఆర్సీబీ కి చెందిన డాక్టర్ సి.వి.  శ్రీకాంత్, ఎయిమ్స్ కి చెందిన   ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ సింగ్ ,  డాక్టర్ ప్రణయ్ తన్వర్,  ప్రొఫెసర్ టి.సి.  నాగ్,  డాక్టర్. సుభాష్ చంద్ర యాదవ్,  డాక్టర్ రవి ప్రకాష్, తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ సుభాష్ చంద్ర యాదవ్ వందన సమర్పణ చేశారు. 

 

***


(రిలీజ్ ఐడి: 1824201) సందర్శకుల సూచీ సంఖ్య : : 191
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil