ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టెలీ కన్సల్టేషన్.తోనే ఆరోగ్యరంగ భవితవ్యం!


టెలీ కన్సల్టేషన్ ప్రక్రియకు
భారీ ప్రోత్సాహం అవసరం...

3 రోజుల “స్వాస్థ్యచింతన్ శిబిరం”లో
కేంద్రమంత్రి మాండవీయ స్పష్టీకరణ..

గుజరాత్.లోని కెవాడియాలో ముగిసిన
సి.సి.హెచ్.ఎఫ్.డబ్ల్యు సమ్మేళనం

త్వరలో ప్రారంభం కానున్న
"టి.బి. రోగి/గ్రామం దత్తత" పథకంలో
అందరూ చేరాలని డాక్టర్ మాండవీయ పిలుపు...

“ఆరోగ్య రంగంలో దేశాన్ని డిజిటల్ విప్లవం దిశగా నడిపించేది
ఆయుష్మాన్ భారత్ జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం”

“ఆయుష్మాన్ భారత్ ఐ.డి.కోసం
యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలి”

“మేరా అస్పతాల్ పోర్టల్.పై
రాష్ట్రాలు అవగాహన కల్పించాలి”

Posted On: 07 MAY 2022 5:27PM by PIB Hyderabad

గుజరాత్ లోని కెవాడియాలో 2022 మే 5నుంచి 7వ తేదీవరకూ మూడు రోజులపాటు జరిగిన స్వాస్థ్య చింతన్ శిబిరం ముగింపు కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్.సుఖ్ మాండవీయ ప్రసంగించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కేంద్రీయ మండలి (సి.సి.హెచ్.ఎఫ్.డబ్ల్యు) 14వ సమ్మేళనం సందర్భంగా ఈ శిబిరం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, నీతీ ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్, వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ఆరోగ్య శాఖల కార్యదర్శులు, ఆరోగ్య శాఖ ప్రతినిధులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ,  నీతీ ఆయోగ్, భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ శిబిరంలో పాల్గొన్నారు.

https://ci6.googleusercontent.com/proxy/fKXHNaLWnobjkx_tzaVuWW1p0bbvoNPCn33CRtpa1drl5O6mJ8N7EbKkzoXj1ngKnYjUkhBRxdk0HsdwSzWcXtH873Te4H3KE8cN2TAaW0QoqA7iGPNrEOagjA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QO45.jpg

  కేంద్రమంత్రి డాక్టర్ మాండవీయ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, మూడు రోజులపాటు జరిగిన స్వాస్థ్య చింతన్ శిబిరంలో దాదాపు 25మంది ఆరోగ్య, వైద్యవిద్యా శాఖ మంత్రులు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఏదైనా లక్ష్యాన్ని పరిపూర్ణంగా సాధించడమే (సిద్ధిని పొందడమే) సంకల్పానికి ఛోదకశక్తిగా పనిచేయగలదని అన్నారు. , "రాష్ట్రాలన్నీ అత్యుత్తమమైన విధానాలను చేపట్టడం వల్లనే ఆరోగ్య రంగంపై మేం కూలంకష పరిజ్ఞానాన్ని సముపార్జించగలిగాం. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది దోహదపడంది." అని ఆయన అన్నారు.అన్ని రాష్ట్రాలు తమతమ ఉత్తమ విధానాలను ఈ సమ్మేళనంలో పంచుకున్నాయి. దీనితో ఇపుడు మా వద్ద 25కుపైగా ఉత్తమ విధానాలు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం లక్ష్యాలు, రాష్ట్రాల లక్ష్యాలు పరిపూర్ణత్వానికి ఎంతో అవసరం. కేంద్ర స్థాయిలో విధాన రూపకల్పనకు దోహదపడేది రాష్ట్రాల లక్ష్యాలే. అని కేంద్రమంత్రి అన్నారు.

https://ci5.googleusercontent.com/proxy/CuqWOScqsqwUuYKsfjmnXpmWsXx3jKpoZtqbfQYYSIUyt-xUepR2y-uzEWoDttMpa0qfG_3XnFfePZLRkX9teHqbOwjfiyRoLXm9yVsoU0YdAUBWEzT5RvCrOg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003JEDY.jpg

  రాష్ట్రాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాల్సిన ఆవశ్యకతను గురించి డాక్టర్ మాండవీయ ఈ సందర్భంగా  వివరించారు. "రాష్ట్ర లక్ష్యాలే మాకు జాతీయ స్థాయి లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. వివిధ రకాల విధానాలకు సంబంధించి రాష్ట్రాలే మాకు రోడ్ మ్యాప్.ను, కార్యాచరణ ప్రణాళికను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో –ఆరోగ్యవంతమైన కుటుంబం- రూపొందించేందుకు స్వాస్థ్య శిబిరం ఒక పునాదిగా దోహదపడింది. అంత్యోదయ పథక లక్ష్యం పూర్తి చేసేందుకు మన పౌరుల సంక్షేమం లక్ష్యంగా ఆరోగ్య విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని మనమంతా ప్రతిన బూనుదాం. చివరి పౌరుడికి ఆరోగ్య సేవల బట్వాడా ద్వారా పూర్తి ప్రయోజనం కలగించడమే మన ప్రధాన లక్ష్యం కావాలి." అని కేంద్రమంత్రి అన్నారు.

    ఆరోగ్యం అంటే మాకు వాణిజ్యం కాదు. సేవ మాత్రమే. వైద్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి మేం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. -భారతదేశం ద్వారా ఆరోగ్యాన్ని అందించడం, భారతదేశంలో ఆరోగ్యాన్ని అందించడం- రాబోయే రోజుల్లో మన ఆరోగ్య వ్యవస్థకు ఇవే మూల స్తంబాలు కానున్నాయి. దీనితో భారతదేశం ప్రపంచం యావత్తుకూ ఆరోగ్య సారథిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అని డాక్టర్ మాండవీయ అన్నారు.

  క్షయరోగి/గ్రామం దత్తత పేరిట త్వరలో ప్రారంభం కానున్న పథకంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని డాక్టర్ మాండవీయ పిలుపునిచ్చారు. ఈ పథకం కింద ప్రతి ఒక్కరూ క్షయరోగి సంక్షేమం లక్ష్యంగా వారిని దత్తత తీసుకుని, సకాలంలో వ్యాధి నిర్ధారణ, సరైన చికిత్స అందేలా చూస్తారు. 2025 సంవత్సరానికల్లా దేశాన్ని క్షయరహితంగా చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

https://ci5.googleusercontent.com/proxy/jq3pSWSm4r18GnHcG9XIB1MUWm5E7oaH6nIYZsI_T3rGXn64TU6yrNBnPy-FqRF3x8I_isEFVMIGACwtnWqD7QLRRITC2Rl5gnB8cy7_fVPWu17gCQ8zwpgHnw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0040ZQE.jpg

   కంటికి సంబంధించి కాటరాక్ట్ శస్త్ర చికిత్స లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలన్న జాతీయ పథకం అమలుకోసం తగిన సహకారం అందించవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయమై ఈ-సంజీవని పథకం ద్వారా టెలికన్సల్టేషన్ ప్రక్రియకు మరింత ప్రజాదరణ కల్పించేందుకు రాష్ట్రాల మంత్రులు కృషి చేయాలని ఆయన సూచించారు.మంత్రులంతా వారి వారి జిల్లాల్లోని ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన హెల్త్ వెల్ నెస్ కేంద్రాలను (హెచ్.డబ్ల్యు.సి.లను) సందర్శించాలని, పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ వైరస్ వ్యాప్తి సంక్షోభ సమయంలో ఈ పథకం ద్వారానే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందాయి. మన ఆరోగ్య వ్యవస్థ భవితవ్యం టెలీ కన్సల్టేషన్ ప్రక్రియపైనే ఆధారపడింది. చివరి లబ్ధిదారుకు కూడా సిసలైన ఆరోగ్య సేవలందించేందుకు టెలికన్సల్టేషన్ పరిపూర్ణ వేదికను అందిస్తుంది కాబట్టి, ఈ ప్రక్రియను భారీ స్థాయిలో అమలు చేసేందుకు మనం కృషి చేయాల్సి ఉంది అని కేంద్రమంత్రి అన్నారు.

  ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాకు ప్రజాదరణ కల్పించేందుకు ఆయా రాష్ట్రాల మంత్రులు కృషి చేయాలని కేంద్రమంత్రి డాక్టర్ మాండవీయ విజ్ఞప్తి చేశారు.ఆరోగ్య రంగంలో భారతదేశాన్ని డిజిటల్ విప్లవం వైపు నడిపించేందుకు ఆయుష్మాన్ భారత్ జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం ప్రముఖంగా పనిచేస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గుర్తింపు సంఖ్యను ఏర్పాటు చేసేందుకు మనమంతా యుద్ధప్రాతిపదికన పనిచేయాల్సి ఉంది.  సేవల బట్వాడాకు, గోప్యతకు ఈ పథకం పూచీగా నిలుస్తుంది. అని ఆయన అన్నారు.

   ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల బట్వాడాకు సంబంధించి లబ్ధిదారుల, రోగుల అభిప్రాయం తెలుసుకోవడం కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'మేరా అస్పతాల్ (నా ఆసుపత్రి)' పేరిట ఏర్పాటు చేసిన వెబ్ పోర్టల్ గురించి డాక్టర్ మాండవీయ తెలియజేశారు. "మనం జీవన శైలి, ఆహారపు అలవాట్లపై కూడా ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది.," అని అన్నారు.

   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రంగాలవారీగా లక్ష్యాలను కూడా ఈ సమ్మేళనం నిర్దేశించినట్టు డాక్టర్ మాండవీయ చెప్పారు. క్షయ రహిత భారతదేశం, కాటరాక్ట్ శస్త్రచికిత్సల లక్ష్యాన్ని పూర్తి చేయడం వంటి అంశాలతో పాటు వివిధ రంగాలకు సంబంధించి  పలు లక్ష్యాలను ఈ స్వాస్థ్య చింతన్ శిబిరం నిర్దేశించిందని అన్నారు. "ఆరోగ్య రంగంలో నిర్దేశించుకున్న ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రజలకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించవలసిన అవసరం ఉంది." అని ఆయన అన్నారు. జూన్ నెల 1వ తేదీనుంచి కాటరాక్ట్ శస్త్రిచికిత్సలను చేపట్టేందుకు అంకిత భావంతో కూడిన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు.

  ఆరోగ్యశాఖల సిబ్బంది కలసికట్టుగా బృంద స్ఫూర్తితో పనిచేసినందునే స్వాస్థ్య చింతన్ శిబిరం విజయవంతమైందని పేర్కొంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. కెవాడియాలో మూడు రోజులపాటు జరిగిన స్వాస్థ్య చింతన్ శిబిరంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా సైకిల్ తొక్కడం, పర్వతారోహణ, యోగా వంటి కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించిన వారందరికీ నాయకత్వం వహిస్తూ డాక్టర్ మాండవీయ తగిన ప్రోత్సాహాన్ని అందించారు. కేంద్రీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి (సి.సి.హెచ్.ఎఫ్.డబ్ల్యు) ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్ సైట్.ను కూడా కేంద్రమంత్రి ఆవిష్కరించారు.

   కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ సమ్మేళనంలో మాట్లాడుతూ. ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక అంశాలపై, నాణ్యమైన వైద్య సేవల బట్వాడాపై సమైక్యంగా మేధోమధనం జరిపేందుకు స్వాస్థ్య చింతన్ శిబరం తగిన వేదికను అందించిందని ఆయన అన్నారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తితో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శించిన సహకార దృక్పథం అభినందనీయమని ఆమె అన్నారు. కోవిడ్ నిరోధం లక్ష్యంగా దేశంలో 190కోట్ల టీకా డోసులను అందించడంలో రాష్ట్రాల కృషి ప్రశంసనీయమని అన్నారు. ఆరోగ్యరంగంలో భారతదేశాన్ని -విశ్వగురువు-గా తీర్చిదిద్దేందుకు మేం కట్టుబడి ఉన్నాం ఆమె ప్రకటించారు.

https://ci3.googleusercontent.com/proxy/IfcZ0sDU4yLC09fhu5oBEpNh0lPeUntJliOv0e55KqZG6Cvhr2P1u8wuqEGejweQFaW-7ioyx6oAG2xiKfiORkuXUyiMFxV94sgAibaym5uwOwVP9Hh8f0j_Bg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005HJFP.jpg

   నీతీ ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ, భారతదేశం భావి ఆరోగ్య వ్యవస్థ బ్లూప్రింటును రూపొందించేందుకు ఈ చింతన్ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చింతన్ శిబిరం నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బృందాలు చేసిన కృషి అభినందనీయమని అన్నారు.

  స్వాస్థ్య చింతన్ శిబిరం మూడవ రోజున ఆరోగ్య రంగంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, భారతదేశపు ఆరోగ్య ప్రజా ప్రతిస్పందన, కోవిడ్ వ్యాప్తిపై అధ్యయనం, భవష్యత్తు ఆరోగ్య అత్యయిక పరిస్థితులను ఎదుర్కొనేలా భారతదేశాన్ని తీర్చిదిద్దడం, ఆరోగ్యవంతమైన భారతదేశం లక్ష్యంగా రోడ్ మ్యాప్ తదితర అంశాలు, ఇతివృత్తాలపై సదస్సులను నిర్వహించారు. ప్రతి రాష్ట్రం ఎదుర్కొన్న అనుభవాలనుంచి, వివిధ రాష్ట్రాల ఆరోగ్యకార్యకలాపాల నిర్వహణనుంచి విషయాలను అధ్యయనం చేయడానికి ఈ సదస్సులో తగిన అవకాశం కల్పించారు. వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ఆరోగ్య శాఖల ప్రతినిధులు తమతమ అనుభవాలను ఈ సమ్మేళనంలో పంచుకున్నారు.

   దీనికి తోడుగా, ఆరోగ్య రంగం, సంక్షేమంపై వివిధ అంశాలను గురించిన చర్చను కూడా చేపట్టారు. అందరికీ అందుబాటులో, అందుబాటు ధరల్లో, సమాన ప్రాతిపదికతో ఆరోగ్యం కల్పించాలన్న లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నట్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమ్మేళనంలో పునరుద్ఘాటించాయి. మూడు రోజులపాటు సమర్థవంతంగా స్వాస్థ్య చింతన్ శిబిరం నిర్వహించిన తీరుపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర ఆరోగ్యమంత్రికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

   దేశంలో ఆరోగ్య వ్యవస్థ భవితవ్యానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించేందుకు 3రోజుల ఈ చింతన్ శిబిరం తగిన వేదికను కల్పించింది. ఆరోగ్యరంగంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సమీక్షించుకునేందుకు కూడా ఈ శిబిరం దోహదపడింది.

 

***



(Release ID: 1823582) Visitor Counter : 154