హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌తిష్టాత్మ‌క 'పద్మ అవార్డులు-2023'ల‌కు నామినేషన్లు ఆహ్వానం


నామినేషన్లు/ సిఫారసు దరఖాస్తులకు సెప్టెంబర్ 15,2022 వరకు గ‌డువు

Posted On: 05 MAY 2022 3:26PM by PIB Hyderabad

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం-2023 సందర్భంగా ప్రకటించబడే పద్మ అవార్డుల కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/ సిఫారసు దరఖాస్తులు మే 1, 2022 న ప్రారంభింపబడ్డాయి. పద్మ అవార్డుల నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 15, 2022. జాతీయ స్థాయిలో అందించే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/ సిఫారసు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో  https://padmaawards.gov.in  పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.

పద్మ విభూషణ్పద్మ భూషణ్పద్మశ్రీ  అవార్డులు మ‌న దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954 లో స్థాపించబడిన ఈ అవార్డులు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడతాయి. ఈ అవార్డు 'వర్క్ ఆఫ్ డిస్టింక్షన్ను గుర్తించటానికి ప్ర‌తీక‌గా నిలుస్తున్నాయి. వివిధ క‌ళ‌లుసాహిత్యం మ‌రియు విద్య‌క్రీడ‌లువైద్యంసామాజిక సేవ‌సైన్స్ అండ్ ఇంజినీరింగ్ప్ర‌జాసంబంధాలుసేవసివిల్ సర్వీస్వాణిజ్యంపరిశ్రమమొదలైన రంగాలలోను.. విభాగాలలో విశిష్టమైనఅసాధారణమైన విజయాలు/ సేవలకు గాను ఈ పుర‌స్క‌రాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. జాతివృత్తిస్థానం లేదా లింగ భేదం లేకుండా వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. వైద్యులుశాస్త్రవేత్తలు తప్ప పీఎస్‌యులలో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కారు.

పద్మ అవార్డులను పీపుల్స్ పద్మ” గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందువల్ల దేశ పౌరులందరూ స్వీయ నామినేషన్‌ల‌తో సహా నామినేషన్లు / సిఫార్సులు చేయాలని అభ్యర్థించ‌డ‌మైంది.

 

నామినేషన్లలను పైన పేర్కొన్న పోర్టల్‌లోనిర్ధిష్ఠ ఫార్మాట్‌ల‌లో పొందుపరచాలి. అలాగే అవార్డుకు సిఫారసు చేయబడిన వ్యక్తికి సంబంధించిన వివరాలను కథన రూపంలో గరిష్టంగా 800 పదాల‌లో తెలియజేయడంతో పాటుఆ వ్యక్తి యొక్క విశిష్టత‌ మరియు అసాధారణమైన విజయాలు/సేవల‌ను సంబంధిత ఫీల్డ్/రంగాలను స్పష్టంగా పొందుపరచాలి.

 

అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలురాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలు.. భరత‌ రత్న మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలుఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ప్రతిభా వంతులైన వ్యక్తులను గుర్తించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయవచ్చని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. సమాజంలోని బలహీన వర్గాలుఎస్సీలు మ‌రియు ఎస్టీలుదివ్యంగ్ వ్యక్తులు సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వారిని ఇందుకు సిఫార‌సు చేయ‌వ‌చ్చు.

 

ప‌ద్మ అవార్డుల‌కు సంబంధించిన మరిన్ని వివరాలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన‌ వెబ్‌సైట్‌లో  (www.mha.gov.in), పద్మ అవార్డుల పోర్టల్‌లో (https://padmaawards.gov.in ) 'అవార్డులుపతకాలుశీర్షికలో అందుబాటులో ఉన్నాయి. ఈ అవార్డులకు సంబంధించిన శాసన విష‌యాలునియమాలు వెబ్‌సైట్‌లో https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్‌తో అందుబాటులో ఉన్నాయి.

 

***


(Release ID: 1822956) Visitor Counter : 360