నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నైపుణ్యాభివృద్ధికి వినూత్న మార్గాలను అన్వేషించాలని పిఎస్‌యూలకు పిలుపునిచ్చిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


అప్రెంటిస్‌షిప్‌ను ప్రోత్సహించడం మరియు స్కిల్ ఇండియా 2.0ని ఖరారు చేయడం కోసం CPSEలతో జరిగిన వర్చువల్ మీట్‌లో పాల్గొన్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.


సర్టిఫైడ్ స్కిల్డ్ వర్కర్ల నియామకం వైపు మొగ్గు చూపుతున్న CPSEలు.


అప్రెంటిస్‌షిప్ శిక్షణను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 250+ క్లస్టర్ ఆధారిత వర్క్‌షాప్‌లు..

Posted On: 02 MAY 2022 5:36PM by PIB Hyderabad

రాబోయే ఒక సంవత్సరం కాలంలో 10 లక్షల మంది అప్రెంటీస్‌లను భాగం చేయాలనే లక్ష్యంతో, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) నేడు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSEలు)తో వర్చువల్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా మంత్రిత్వ శాఖ చేపట్టిన తాజా సంస్కరణలు మరియు కార్యక్రమాలపై CPSE లకు వివరించారు. అలాగే మరింత మంది అప్రెంటీస్‌లను భాగం చేసుకోవడానికి వారిని ప్రోత్సహించారు. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు MSDE మరియు MEITY రాష్ట్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని, ఈ జాతీయ నిర్మాణ వ్యాయామానికి అంతా ఎంత ఉత్తమంగా సహకరిస్తారనే దానిపై CPSE లతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
 
వర్క్‌షాప్‌కు 100 కంటే ఎక్కువ CPSEల CMDలు, HR మేనేజర్లు మరియు CSR హెడ్‌లు హాజరయ్యారు. వారు అప్రెంటిస్‌షిప్ శిక్షణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే దేశంలో అప్రెంటిస్‌షిప్ మోడల్‌ను విజయవంతం చేయడంలో గల అవకాశాలు, సవాళ్లను గురించి చర్చించారు.
 
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ CPSEలు తమ స్థానిక ప్రాంతాలలోని పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు, జన్ శిక్షణ్ సంస్థాన్‌లు (JSS)ని దత్తత తీసుకోవడం, ఎక్కువ మంది అప్రెంటిస్‌లను భాగం చేయడం, NSQFతో వారి స్కిల్లింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను సమలేఖనం చేయడం మరియు నైపుణ్యాన్ని పెంపొందించడానికి CSRని పెంచడం వంటి వినూత్న మార్గాలను అన్వేషించాలని CPSEలకు పిలుపునిచ్చారు. మొత్తం స్కిల్ ఇండియా మిషన్ కింద అభివృద్ధి ప్రయత్నాలు చేయాలని సూచించారు. మనం విడుదల చేసిన NEP2020 యొక్క సిఫార్సులకు అనుగుణంగా; మరింత శక్తివంతమైన, బహుముఖ శ్రామిక శక్తిని సృష్టించేందుకు మనం విద్య, నైపుణ్యం యొక్క బలమైన ఏకీకరణను సృష్టించాలి అని ఆయన అన్నారు.
 
పని తీరు ప్రస్తుతం మారుతున్నదని మంత్రి అన్నారు. శక్తి, సుస్థిరత, డేటా నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని మనం తప్పనిసరిగా అందరికీ పరిచయం చేయాలి. చైతన్యవంతమైన, ప్రగతిశీల మరియు ఆధునిక జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయడానికి వారి సూచనలు & ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడానికి ముందుకు రావాలని నేను PSUలను కూడా పిలుస్తున్నాను.
 
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కంపెనీలు కేవలం తాజా నైపుణ్యంపై మాత్రమే కాకుండా, నైపుణ్యం, రీ-స్కిల్లింగ్ మరియు మల్టీ-స్కిల్లింగ్‌పై కూడా దృష్టి పెట్టాలని, తద్వారా వారు ఈ రోజు వేగంగా మారుతున్న ఉద్యోగాల స్వభావాన్ని సులభంగా అర్థం చేసుకోగలరని ఆయన అన్నారు. నైపుణ్య అభివృద్ధి యొక్క అత్యంత స్థిరమైన నమూనాలో అప్రెంటిస్‌షిప్ ఒకటి. MSDE మరియు CPSUలలోని మేనేజ్‌మెంట్ రెండూ విస్తృతంగా ప్రచారం చేయాలి. అన్ని కంపెనీలలోని ప్రత్యక్ష మరియు పరోక్ష శ్రామికశక్తిలో నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి లేదా ప్రోత్సహించడాన్ని తప్పనిసరి చేయాలి. స్కిల్ ఇండియా మిషన్ కింద మన వర్క్‌ఫోర్స్ అధికారికంగా నైపుణ్యం మరియు సర్టిఫికేట్ పొందినట్లు మనము నిర్ధారించుకోవాలి.
 
కోవిడ్ తర్వాత యువత కొత్త అవకాశాలకు అనుగుణంగా మారడంలో స్కిల్లింగ్ మరియు రీస్కిల్లింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగ పాత్రను రూపొందించడంలో పరిశ్రమ చురుకైన పాత్ర పోషించాలని ఆయన అన్నారు.
 
DGTల డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ (DST) స్కీమ్/ఫ్లెక్సీ MoU స్కీమ్ ద్వారా CPSEలు స్కిల్లింగ్-వర్క్‌ప్లేస్ కన్వర్జెన్స్‌కి మద్దతివ్వాలని MSDE సూచించింది. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (ToT) ప్రోగ్రామ్, ల్యాబ్‌ల అప్‌గ్రేడేషన్, ల్యాబ్‌ల ఏర్పాటు, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (NSTIలు)/ ITIలు/జన్ శిక్షణ సంస్థాన్ (JSS) కేంద్రాలు మరియు MSDE కింద ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాల (PMKKలు) మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం సాధించడంతోపాటు మద్దతు కూడా అందించాలని సూచించింది.
 
CPSEలు వినూత్న సహకారాలలో తమను తాము సమర్థించుకోవాలని, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న శిక్షణ పొందిన వ్యక్తులను సక్రమంగా వినియోగించుకోవడానికి, PSUలలో సర్టిఫైడ్ నైపుణ్యం కలిగిన కార్మికులను క్రమంగా నియమించుకునే దిశగా ముందుకు సాగాలని మరియు CPSUల సబ్-కాంట్రాక్టర్లను నిర్ణీత శాతం సర్టిఫైడ్ నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకోవాలని సూచించింది. వారి ఒప్పందం ప్రకారం, అప్రెంటిస్‌లను భాగం చేయడం, RPL ద్వారా ఇప్పటికే ఉన్న కార్మికులకు శిక్షణ ఇవ్వడం వంటివి చేయడం ద్వారా నైపుణ్య అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
 
NSTI/ ITIలు/PMKKs/ JSS శిక్షకుల శిక్షణ కోసం CPSUల శిక్షణా కేంద్రాలను ఉపయోగించుకోవచ్చని; పాఠ్యాంశాల అభివృద్ధిలో చురుకుగా పాల్గొనాలని కూడా సూచించారు.
 
స్కిల్ ఇండియా, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో, ఏప్రిల్ 21, 2022న దేశంలోని 700+ ప్రదేశాలలో ఇటీవల ఒక రోజంతా 'ప్రధాన్ మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా'ను నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. విద్యుత్, రిటైల్, టెలికాం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్‌తో సహా 30కి పైగా రంగాల నుండి 1, 51,497 మంది విద్యార్థులు మరియు 8968 సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ పరిశ్రమ-యూత్ కనెక్ట్ ప్లాట్‌ఫారమ్‌లో ఒకే రోజులో 29000 మందికి పైగా అప్రెంటీస్‌లను నియమించారు. MSDE ప్రతి నెలా ఈ అప్రెంటిస్‌షిప్/రోజ్‌గార్ మేళాను నిర్వహించడం కొనసాగిస్తుంది. అలాగే నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అప్రెంటిస్‌షిప్ నమూనాను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 250+ క్లస్టర్-ఆధారిత వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తుంది.

 

****


(Release ID: 1822660) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Tamil