వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత్-అరబ్ దేశాల నడుమ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)


భారత-సంయుక్త అరబ్ దేశాల సమగ్ర ఆర్థిక ఒప్పందం (సిఇపిఎ) కింద మొట్టమొదటిసారి సరుకుల రవాణాకు పచ్చజెండా చూపిన వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం.


భారతదేశం- సంయుక్త అరబ్ దేశాల నడుమ ఒప్పందాన్ని కీలకమైనదిగా పేర్కొన్న కార్యదర్శి; దేశాల మధ్య వాణిజ్యంకై అనుకూల పవనాలు

Posted On: 01 MAY 2022 2:49PM by PIB Hyderabad

2022 ఫిబ్రవరి 18 న రెండు దేశాల మధ్య చారిత్రాత్మకమైన భారత్-అరబ్ దేశాల సమగ్ర ఆర్థిక ఒప్పందం (CEPA) ఈరోజు అమల్లోకి వచ్చింది. ఈరోజు న్యూఢిల్లీలోని కస్టమ్స్ హౌస్‌లో జరిగిన  కార్యక్రమంలో వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇండియా-సంయుక్త అరబ్ దేశాల సిఇపి ఒప్పందం  కింద భారతదేశం సంయుక్త అరబ్ దేశాలకు ఉత్పత్తులతో కూడిన మొదటి సరుకులను లాంఛనంగా రవాణా చేసింది

ఒప్పందాన్ని అమలు చేసే భారత ప్రభుత్వ గౌరవనీయ వాణిజ్య  కార్యదర్శి శ్రీ BVR సుబ్రహ్మణ్యం, రత్నాలు, ఆభరణాల రంగం నుంచి ముగ్గురు ఎగుమతిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పుడు  కస్టమ్స్ డ్యూటీ లేకుండా మొదటిసారి భారత దేశ  సరుకు ఈరోజు, 01 మే 2022న దుబాయ్‌కి చేరుకుంటుంది.

రత్నాలు & ఆభరణాల రంగం అరబ్- భారతదేశం ఎగుమతులు గణనీయమైన ప్రాముఖ్యత  కలిగి ఉంది. మన భారత - అరబ్ దేశాల  CEPA భారతీయ ఉత్పత్తులను అనుసరించి  పొందిన సుంకాల రాయితీల నుండి  ఈ రంగం గణనీయంగా ప్రయోజనం పొందుతుంది.

97%  టారిఫ్ లైన్లపై UAE అందించిన ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ నుండి భారతదేశం  ప్రయోజనం  పొందుతుంది, విలువ పరంగా UAE కి 99% భారతీయ ఎగుమతుల ప్రాతినిధ్యం ఉంది, రత్నాలు, వస్త్రాలు,   పాదరక్షలు, క్రీడా వస్తువులు, ప్లాస్టిక్‌లు, ఫర్నిచర్, వ్యవసాయ  కలప ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు ఇంకా  సేవలలో వాణిజ్యానికి సంబంధించి, భారతీయ సర్వీస్ ప్రొవైడర్ల 11 విస్తృత సేవా రంగాల ద్వారా  సుమారు 111 ఉప-రంగాలకు మెరుగైన ప్రాప్యతను కలిగి ఉన్నారు.

CEPA   ద్వారా  రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్య విలువ  100 బిలియన్ అమెరికన్ డాలర్ల  పైగా, సేవలలో వాణిజ్యం 15 బిలియన్ డాలర్లకు  పెరుగుతుందని అంచనా.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాణిజ్య శాఖ కార్యదర్శి ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి వ్యాపారానికి  ఉన్న అవకాశాలను ఎత్తిచూపుతూ, ఈ మార్పు  తక్కువ సమయంలో జరిగినందున   కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది    అన్నారు

ఈ  ఒప్పందం 100 బిలియన్ డాలర్ల అంచనాతో   తదనుగుణ వాణిజ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, మార్కెట్ పరిమాణం అరబ్ దేశాలు  భారతదేశానికి అందించే ప్రాప్యతను దృష్టిలో ఉంచుకుని, లక్షాలు కంటే చాలా ఎక్కువ సాధించవచ్చని వారన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల నాయకుల దార్శనికత పరిణామమని భారతదేశానికి, సంయుక్త అరబ్ దేశాల ప్రపంచానికి ఇది మార్గదర్శి అని వాణిజ్య కార్యదర్శి పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పోటీతత్వం అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన , మన సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎత్తి చూపారు. రవాణా ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, తద్వారా కొత్త  ప్రాధాన్యతా ప్రాంతాలనుంచి  వచ్చే ఉత్పత్తులు పోటీతత్వంతో ఉండవచ్చని అవకాశాలను అంచనా వేశారు.

భారతదేశం చాలా వేగంగా ఇతర దేశాల వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తుందని, బ్రిటన్ , యురోపియన్ యూనియన్లతో   ఈ ఫలితాలి ఆశించి చర్చలు కొనసాగుతున్నాయని వాణిజ్య కార్యదర్శి ప్రస్తావించారు.

అటువంటి వాణిజ్య  ప్రయోజనాలను ఎగుమతిదారులకు అందించేందుకు  సామాన్యుల భాషలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు ఒప్పందంలోని నిబంధనలను  సాధ్యమైనంత అవగాహన చేసుకుని , సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకుంటారని, మార్కెట్ ఇంటెలిజెన్స్, సమాచారం  ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం,  భవిష్యత్తులో ఈ మార్గంలో  దృష్టి సారిస్తుందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సద్వినియోగం చేసుకోవాలని వారు హితవు పలికారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో   670 బిలియన్ డాలర్ల  ఎగుమతుల విలువతో   (వస్తు, సేవల) GDP లో 22-23% గా ఉందని పేర్కొన్న శ్రీ సుబ్రహ్మణ్యం, ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు వృద్ధికి ప్రపంచానికే  కీలకమైన దేశంగా  భారతదేశం నిలుస్తుందన్నారు.

2047 లో భారతదేశ భవిష్యత్తు కోసం ఒక విజన్‌ను   వచ్చే 25 ఏళ్లలో మనం 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని. వాణిజ్య ప్రచారం  పై దృష్టి సారించి రేపటి సవాళ్లను భవిష్యత్తులో సిద్ధంగా ఉండేందుకు వాణిజ్య  శాఖ కూడా తనను తాను సిద్ధం చేసుకుంటోందని వివరించారు.

సంతోష్ కుమార్ సారంగి, డైరెక్టర్ జనరల్, విదేశీ వాణిజ్యం  సూర్జిత్ భుజబల్, ప్రధాన కస్టమ్స్ కమిషనర్ ; సంజయ్ బన్సల్, కస్టమ్స్ కమిషనర్ ఇతర  పరిశ్రమ / ఎగుమతిదారుల సంఘం మీడియా   ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

 

****



(Release ID: 1822073) Visitor Counter : 354