సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో కాంపోజిట్ రీజనల్ సెంటర్ (CRC)కు రేపు శంకుస్థాపన చేయనున్న కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రి డా. వీరేంద్ర కుమార్

Posted On: 01 MAY 2022 12:49PM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డా. వీరేంద్ర కుమార్ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో నైపుణ్యాభివృద్ధి, పునరావాసం మరియు వికలాంగుల సాధికారత కోసం కాంపోజిట్ రీజనల్ సెంటర్ (CRC) యొక్క కొత్త భవనానికి రేపు వర్చులవల్ వేదికగా శంకుస్థాపన చేయనున్నారు.
కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ సహాయ మంత్రి కుమారి ప్రతిమ భూమిక్, శ్రీమతి. అనిలా భెడియా, స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, శ్రీ సంతోష్ పాండే, ఛత్తీస్‌గఢ్ రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు, శ్రీమతి అంజలి భవ్రా, సెక్రటరీ, డీఈపీడబ్యూడీ, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ, డా. రమణ్ సింగ్, సభ్యుడు శాసనసభ, రాజ్‌నంద్‌గావ్ & ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ B.V.రామ్ కుమార్, డైరెక్టర్ (Offg.) NIEPID, సికింద్రాబాద్ మరియు శ్రీ కుమార్ రాజు, డైరెక్టర్ సీఆర్సీ, రాజ్‌నంద్‌గావ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
500 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.33,28,681 విలువ చేసే సహాయ సామాగ్రి మరియు ఉపకరణాలు, బోధనా అభ్యాస సామగ్రి కిట్‌లు ఈ కార్యక్రమంలో పంపిణీ చేయబడతాయి.
వికలాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాసం మరియు సాధికారత కోసం కాంపోజిట్ రీజనల్ సెంటర్ (CRC)ను వికలాంగుల సాధికారత విభాగం, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, రాజ్‌నంద్‌గావ్‌లో జూన్ 2016లో స్థాపించబడింది. అప్పటి నుండి, సీఆర్‌సీ క్లినికల్ సేవలు, పరిపాలన & స్టోర్ అందించడానికి జిల్లా పరిపాలన ద్వారా కేటాయించబడిన 15 గదులతో తాత్కాలికంగా పనిచేస్తోంది.
రాజ్‌నంద్‌గావ్‌లోని ఠాకుర్టోల్లాలో శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు సంస్థకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
రూ.24.28 కోట్ల అంచనా వ్యయంతో 4,105.22 చ.మీ. స్థలంలో కొత్త భవనం, చికిత్సా సేవలు, మనస్తత్వ శాస్త్రం, ప్రత్యేక విద్య, వైకల్య ముందస్తు గుర్తింపు కేంద్రం, నైపుణ్య శిక్షణ, దీర్ఘకాలిక మరియు వివిధ సేవల కోసం చిన్న శిక్షణా కార్యక్రమాలు, పరిపాలన, సమావేశ మందిరం, విశ్రాంతి సంరక్షణ, అతిథి గదులు నిర్మాణానికి ప్రతిపాదించారు.
భవనంలో సబ్-స్టేషన్, అగ్నిమాపక వ్యవస్థ, ఫైర్-అలారం సిస్టమ్, లిఫ్టులు, వీధి దీపాలు, డీజీ సెట్లు, సీసీటీవీ సిస్టమ్, యూపీఎస్, ఈపీఏబీఎక్స్ సిస్టమ్, లాన్ నెట్‌వర్కింగ్ ఉపకరణాలు మరియు ఎస్‌టీపీ కోసం సదుపాయం ఉంటుంది.
కేంద్రం ప్రభుత్వం ప్రారంభ గుర్తింపు & ఇంటర్వెన్షన్, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, ఫిజికల్ మెడికల్ & రిహాబిలిటేషన్, సైకలాజికల్ ఇంటర్వెన్షన్, ప్రోస్తేటిక్స్ & ఆర్థోటిక్స్, స్పీచ్ లాంగ్వేజ్ & హియరింగ్, ప్రత్యేక విద్య, నైపుణ్య శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ, బోధన & పంపిణీకి సంబంధించిన శిక్షణ, పంపిణీ కమ్యూనికేషన్ మెటీరియల్స్, సోషల్ వర్క్, ప్లేస్‌మెంట్, అవుట్‌రీచ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్, కిరణ్ మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్ (MHRH) సీఆర్సీ, కృత్రిమ అవయవాలు, టీచింగ్ & లెర్నింగ్ మెటీరియల్‌తో సహా శారీరక వైకల్యానికి సంబంధించిన సహాయక పరికరాలను క్రమం తప్పకుండా పంపిణీ చేయడం మేధోపరమైన వైకల్యాలు ఉన్న వ్యక్తులకు కిట్‌లు మరియు ఎడీఐపీ పథకం కింద వినికిడి లోపం ఉన్న వ్యక్తుల కోసం బీటీఈ వినికిడి పరికరాలు అందించనున్నారు.

 

****



(Release ID: 1822000) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi , Tamil