సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
2021-22లో రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్‌ను అధిగమించి భారత్‌లోని అన్ని ఎఫ్ఎంసిజి కంపెనీలను మించి ముందుకు సాగిన ఖాదీ
Posted On:
30 APR 2022 12:36PM by PIB Hyderabad
భారతదేశంలో ఎఫ్ఎంసిజి కంపెనీల సుదూర లక్ష్యంగా మిగిలిన ఉన్నతిని ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ - కెవిఐసి) సాధించింది. దేశంలో ముందెన్నడూ ఏ ఎఫ్ ఎంసిజి సాధించని విధంగా రూ. 1.15 లక్షల కోట్ల టర్నోవర్‌ను కెవిఐసి తొలిసారి సాధించింది. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర మద్దతు ప్రధాన కారణం. దీని కారణంగా, రూ. 1 లక్ష కోట్ల టర్నోవర్ నమోదు చేసిన ఒకే ఒక్క కంపెనీగా కెవిఐసి అవతరించింది.
ఆర్థిక సంవత్సరం 2020-2021తో సాధించిన రూ. 95,741.74 కోట్లతో పోలిస్తే 2021-22లో కెవిఐసి మొత్తం టర్నోవర్ అత్యంత భారీగా రూ. 1,15, 415.22 కోట్ల మొత్తం టర్నోవర్‌ను సాధించింది. అలాగే, 2020-21 నుంచి 20.54ఞ% వృద్ధిని కెవిఐసి నమోదు చేసింది. ఇక, 2014-15 సంవత్సరంతో పోలిస్తే, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగంలో 2021-22లో మొత్తం ఉత్పత్తి 172% అధిక వృద్ధి రేటును సాధించింది. అలాగే, ఇదే కాలంలో స్థూల అమ్మకాలు 248% పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా 2021 మొదటి మూడు నెలల్లో, అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో పాక్షిక లాక్‌డౌన్ విధించినప్పటికీ కెవిఐసి ఈ భారీ టర్నోవర్‌ను సాధించింది.
గత ఒక్క సంవత్సరం పనితీరును పరిశీలించినప్పుడే, 2020-21లో సాధించిన 3528 కోట్ల నుంచి 2021-22లో రూ. 5052 కోట్లను సాధించి దాదాపు 43.20% వృద్ధిని నమోదు చేసిన భారీ ప్రభావం కనిపిస్తుంది. గత 8 సంవత్సరాలలో అంటే 2014-15 నుంచి ఖాదీ రంగంలో ఉత్పత్తి 2021-22 నాటికి 191% పెరుగగా, ఖాదీ అమ్మకాలు 332% పెరిగాయి.
మరొకవైపు, గ్రామీణ పరిశ్రమల రంగంలో టర్నోవర్ గత ఏడాది సాధించిన రూ.92,214 కోట్లతో పోలిస్తే 2021-22లో రూ. 1,10,364 కోట్లను చేరుకుంది. గత 8 ఏళ్ళలో, ముఖ్యంగా 2021-22లో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి 172% పెరుగగా, అమ్మకాలు 245% పెరిగాయి.
ఖాదీ అసాధారణ వృద్ధికి కారణం, దేశంలో ఖాదీని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించిన నిరంతర మద్దతే కారణమని, కెవిఐసి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా పేర్కొన్నారు. అదే సమయంలో, వినూత్న పథకాలు, సృజనాత్మక మార్కెటింగ్ ఐడియాలు, వివిధ మంత్రిత్వ శాఖల క్రియాశీలక మద్దతు కూడా ఇటీవలి సంవత్సరాలలో ఖాదీ వృద్ధికి జతయ్యాయని చెప్పారు. స్వదేశీని ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా ఖాదీని స్వాలంబన సాధించాలని ప్రధానమంత్రి పదే పదే చేసిన అప్పీళ్ళు అద్భుతాలను సృష్టించాయి. నేడు, దేశంలోని ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఖాదీ అత్యంత ముందువరుసలో ఉంది. నూతన శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తూ, ఖాదీ ఉత్పత్తుల శ్రేణిని వైవిధ్యభరితం చేస్తూ, మరే ఎఫ్ఎంసిజి పోల్చుకోలేని భారీ వృద్ధిని సాధించడంలో కెవిఐసి విజయాన్ని సాదించిందని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి ఆత్మనిర్భర్, వోకల్ ఫర్ లోకల్ అంటూ ఇచ్చిన పిలుపులకు ప్రజలు ఉత్సాహంగా స్పందించారు. గత రెండేళ్లలో, కెవిఐసి చేతిపనివారికి, నిరుద్యోగ యువతకు నిలకడైన ఉపాధిని కల్పించడంపై కెవిఐసి ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆర్థిక బాధలను ఎదుర్కొంటున్న పెద్ద సంఖ్యలో యువత స్వీయ ఉపాధిని చేపట్టి, పిఎంఇజిపి కింద ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టింది.. గ్రామీణ పరిశ్రమల రంగంలో ఉత్పత్తి పెరగడానికి ఇది తతోడ్పడింది. అదే సమయంలో, ప్రధానమంత్రి స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయమంటూ చేసిన విజ్ఞప్తితో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు చెప్పుకోదగినంతగా పెరిగాయి. న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లోని ఖాదీ ప్రతిష్ఠాత్మక దుకాణంలో ఒక్కరోజు అమ్మకాలు 30 అక్టోబర్ 2021న ఎన్నడూలేని స్థాయిలో రూ. 129 కోట్లు సాధించడం ఇందుకు తార్కాణం.
****
(Release ID: 1821710)
Visitor Counter : 214