నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav g20-india-2023

ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంపై ఒక రోజు సదస్సు నిర్వహించిన నీతి ఆయోగ్


ఆకాంక్షిత జిల్లాల్లో అమలు చేసిన ఉత్తమ విధానాల ద్వారా సాధించిన విజయాలపై నివేదిక విడుదల చేసిన నీతి ఆయోగ్

Posted On: 28 APR 2022 1:02PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా  ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం (ఏడిపి)పై నీతి ఆయోగ్ ఒక రోజు సదస్సు నిర్వహించింది. భాగస్వామ్యం ద్వారా శ్రేయస్సుపేరిట నిర్వహించిన సదస్సులో వివిధ జిల్లాల కలెక్టర్లుఆకాంక్షిత జిల్లాలకు చెందిన కేంద్ర ఇంచార్జి అధికారులువివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలునీతి ఆయోగ్ అధికారులుఅధివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

'మార్పు విజయగాధలుపేరుతో ఆకాంక్షిత జిలాల్లో అమలు చేస్తున్న వినూత్న విధానాలపై ఒక నివేదికను సదస్సులో విడుదల చేశారు. ప్రవర్తనా విధానాల  వినియోగంఆవిష్కరణ,అమలు  మరియు ప్రభావం అంశాల ప్రాతిపదికపై గుర్తించి అమలు చేసిన ఈ విధానాల వల్ల క్షేత్ర స్థాయిలో సాధించిన విజయాలను నివేదికలో పొందుపరిచారు.

 సదస్సులో ప్రసంగించిన నీతి ఆయోగ్ సాధ్యుడు డాక్టర్ వీకే పాల్ ఆరోగ్య సేవలపై ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆశిస్తున్న స్థాయిలో ఆరోగ్య సేవలు అందించాలని అన్నారు. మాత శిశు సంరక్షణ కోసం రూపొందించిన ఆరోగ్య పథకాలు సమాజంలో అట్టడుగు స్థాయి వరకు అమలు జరగాలని అన్నారు. 

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంతో కలిసి  అభివృద్ధి భాగస్వాములు  పనిచేసేందుకు ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం ఒక వినూత్న వేదికగా నిలిచిందని నీతి ఆయోగ్  సీఈఓ శ్రీ అమితాబ్ కాంత్ అన్నారు. భాగస్వాముల సహకారంతో గణనీయమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. జిల్లా బృందాలు, అభివృద్ధి భాగస్వాముల మధ్య అవగాహన కుదరడంతో   జిల్లాల ముఖ్య అవసరాలు గుర్తించి, పథకాలు సక్రమంగా సమర్ధంగా అమలు చేసేందుకు అవకాశం కలిగిందని ఆయన వివరించారు. 

'రాష్ట్ర సామర్థ్యం', 'విద్య', 'వ్యవసాయం', 'నైపుణ్యాభివృద్ధి' మరియు జీవనోపాధి', 'ఆరోగ్యం'పై ఐదు సదస్సులు  జరిగాయి. ' ప్రవర్తన మార్పు సమాచార మార్పిడి  మరియు సమర్థవంతమైన సమాచార నిర్వహణ  ద్వారా చివరి వరకు మెరుగైన సేవలను అందించేందుకు గల అవకాశాలను 'రాష్ట్ర సామర్థ్యంపై జరిగిన సదస్సులో చర్చించారు.   సేవలను అందించే అంశంలో ఎదురవుతున్న సమస్యలను,   అభివృద్ధి చెందుతున్న ఉత్తమ విధానాల ద్వారా వీటిని పరిష్కరించే అంశాన్ని సదస్సులో చర్చించారు. పంచాయతీ, బ్లాకు స్థాయిలో పనిచేస్తున్న వారి సామర్ధ్యాలను పెంపొందించేందుకు  జార్ఖండ్‌లోని దుమ్కాలో అమలు చేసిన విధానాలను సదస్సులో చర్చించారు. 

మహమ్మారి సమయంలో విద్యా పరంగా పిల్లలకు జరిగిన  నష్టాన్ని భర్తీ చేసేందుకు   ప్రభుత్వం మరియు అభివృద్ధి భాగస్వాములు చేసిన  కృషిని 'విద్యపై జరిగిన సదస్సులో  చర్చించారు. తమిళనాడు లోని విరుదునగర్, ఒడిషాలోని నౌపాడ వంటి జిల్లాల్లో బడి మాని వేసిన పిల్లలను తిరిగి పాఠశాలకు రప్పించేందుకు అమలు జరిగిన కార్యక్రమాలను సదస్సులో చర్చించడం జరిగింది.   

రైతులకు సంబంధించిన అంశాలను 'వ్యవసాయం' పై జరిగిన సదస్సులో చర్చించారు. తరిగిపోతున్న భూగర్భజలాలు, తక్కువగా ఉన్న కమతాలు, వాతావరణ మార్పులు అంశాలను సదస్సులో చర్చించారు. విలువ జోడింపు, మార్కెట్ లభ్యత, సాంకేతికత వినియోగం అంశాలను అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.   ఆకాంక్షిత   జిల్లాలలో  అమలు చేస్తున్న   నీటి పునరుజ్జీవన ప్రాజెక్టుల వంటి అనేక కార్యక్రమాలను సదస్సులో చర్చించారు. 

 ఆకాంక్షిత జిల్లాల్లో జీవనోపాధి మెరుగుపరిచేందుకు అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ' నైపుణ్య అభివృద్ధి మరియు జీవనోపాధిఅంశంపై జరిగిన సదస్సులో చర్చించడం జరిగింది. స్వయం సహాయక బృందాలుసూక్ష్మ సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని చర్చించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా లాంటి ప్రాంతాలలో   రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా  సమస్యలను పరిష్కరించేందుకు అమలు చేసిన విధానాలు  జీవనోపాధి అవకాశాలను గుర్తించేందుకు అమలు చేసిన  సమర్థవంతమైన పద్ధతులు  మరియు గృహాలకు అందించిన ప్రయోజనాలను   చర్చించారు. 

'ఆరోగ్యంఅనే అంశంపై జరిగిన సదస్సు ప్రస్తుత ప్రభుత్వ సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడంలో అభివృద్ధి భాగస్వాములు పోషించవలసిన  పాత్రపై దృష్టి సారించింది. పోషకాహార లోపం మరియు రక్తహీనతను తగ్గించే కార్యక్రమంలో  వరిచిరు ధాన్యాలతో కూడిన బలవర్ధక ఆహారాన్ని  సమీకృత శిశు అభివృద్ధి పథకం కింద అందించే కార్యక్రమాన్ని ఈ సదస్సులో చర్చించారు. రక్తహీనత లేని భారతదేశం సాధన కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక ప్రాజెక్ట్  జార్ఖండ్‌లోని ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు జరుగుతోంది. ప్రాజెక్టు అమలు జరుగుతున్న తీరును సదస్సులో చర్చించారు. 

 

***



(Release ID: 1821065) Visitor Counter : 168