వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రారంభించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద “కిసాన్ భాగీదారీ, ప్రాథమిక్తా హమారీ” ప్రచారం


కేంద్ర వ్యవసాయ మంత్రి దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాలలో (కెవికె) రైతులతో జరిపిన ప్రత్యక్షం గా ఆన్లైన్ గోష్టి


రైతులు కొత్త విత్తనాలు, సాంకేతికతల సాయంతో ప్రయోగాలు చేయడానికి ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి: నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 26 APR 2022 6:36PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  25-30 ఏప్రిల్ 2022తేదీల్లో  “కిసాన్ భాగీదారీ, ప్రాథమికతా  హమారీ” ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల్లో (కేవీకేలు) హాజరైన రైతులతో ఆన్లైన్ లో నేరుగా  మాట్లాడారు. భారతదేశం. భారత ప్రభుత్వం ప్రధాన పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించడం, అట్టడుగు స్థాయిలో రైతులు పొందుతున్న విజయాలు, ప్రయోజనాలను అంచనా వేయడం పరస్పర చర్య ఉద్దేశం.

వ్యవసాయ మంత్రి రైతులతో సంభాషిస్తూ, దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం పట్ల ప్రధానమంత్రి దృష్టిని వివరించారు. టెక్నాలజీ సహాయంతో పారదర్శకతకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఉదాహరణ అని ఆయన అన్నారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుండగా ‘ఆత్మనిర్భర్త’ అవసరమని, ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పంటల వైవిధ్యం, ఎగుమతి మార్కెట్‌లో నాణ్యతను కొనసాగించడం అవసరమన్నారు.

కాలానుగుణంగా ప్రయోగాలు చేయడానికి, మారడానికి సిద్ధంగా ఉండాలని, కొత్త రకాల విత్తనాలు వాడాలి, నేల నాణ్యతను పరీక్షించుకోవాలని, రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పిఓ)లో చేరాలని, డ్రోన్‌లతో సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. రైతులు కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) రక్షణ కవచంలోకి రావడానికి సిద్ధంగా ఉండాలి. సహజ వ్యవసాయాన్ని  మంత్రి  ప్రోత్సహిస్తున్నారని, ఐసిఎఆర్ కూడా పాఠ్య ప్రణాళికలో ఈ సమాచారాన్ని  చేర్చుతోందని చెప్పారు.

 

‘కెవికె’లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మా) అభివృద్ధి చెందిన సాంకేతికతలను రైతు సమాజంలోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయని శ్రీ తోమర్ అన్నారు. ‘కెవికె’లు వ్యవసాయ పురోగతిలో మార్గదర్శకులు, రైతులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. 2021-22 సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతి దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలని చెబూతూ . ఇందులో రైతుల సహకారం అభినందనీయమన్నారు. రైతుల అలుపెరగని కృషి, శాస్త్రవేత్తల నైపుణ్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు స్నేహపూర్వక విధానాలు ఫలితాలను ఇస్తున్నాయి. రైతుల ఆదాయం కూడా నిరంతరం పెరుగుతుంది,. నేటి ప్రారంభ ప్రచారం సందర్భంగా దేశం నలుమూలల ఉన్న  వివిధ ‘కెవికె’ లలో రైతులతో పరస్పర చర్చ సందర్భంగా కూడా ఈ సమాచారం వెల్లడైంది.

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి మాట్లాడుతూ 'కెవికే' అంతా రైతులతో సంభాషించిన సందర్భంగా కొంతమంది రైతులు ఇటీవలి కాలంలో తమ ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుకున్నారని గమనించడం సంతోషంగా ఉందన్నారు.

రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు "కిసాన్ భాగీదారీ ప్రాథమిక్తా హమారీ" ప్రచారాన్ని అంకితం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ఇందులో లక్షలాది మంది రైతులు, పలువురు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర వ్యవసాయ సంస్థల్లో మేళాల ద్వారా పాల్గొన్నారు.

"కిసాన్ భగీదారీ ప్రథమిక హమారీ"లో భాగంగా ప్రతి’కేవికే’వద్ద ఈ రోజు ‘ఆత్మా’  సహకారంతో కృషి మేళా నిర్వహించారు. ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, స్టార్టప్‌లు, ఏపీఎంసీలు, ఈ-నామ్, ఎఫ్‌పీఓలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. హార్టికల్చర్ కార్యకలాపాలపై సెమినార్లు, వర్క్‌ షాప్‌లు కూడా నిర్వహించారు.

కేంద్ర వ్యవసాయ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహపాత్ర ప్రారంభ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. జాయింట్ సెక్రటరీ శ్రీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్ కార్యక్రమాలు నిర్వహించారు. సంయుక్త కార్యదర్శి శ్రీ రితేష్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రచారంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు పాల్గొంటున్నాయి.

 

****


(Release ID: 1820555) Visitor Counter : 204


Read this release in: English , Urdu , Hindi