శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

జమ్ములో బయోనెస్ట్- బయో ఇంక్యుబేటర్!


శ్రీకారం చుట్టిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్..

జమ్ములో వేలాదిమంది యువతకు
ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనే లక్ష్యం.

జమ్ము ఐ.ఐ.ఐ.ఎం. పరిధిలో మూడేళ్ల లోగా
64 స్టార్టప్ కంపెనీలు నమోదైనట్టు వెల్లడి..

14 ఉత్పాదనలు రూపొందాయని,
నాలుగు మార్కెట్లో ప్రవేశించాయని ప్రకటన..

రేపు జరిగే ప్రధాని పంచాయతీ దివస్ ర్యాలీకి
బయోనెస్ట్ ఇంక్యుబేటర్
గట్టి ప్రేరణ అవుతుందన్న జితేంద్ర సింగ్

Posted On: 23 APR 2022 3:56PM by PIB Hyderabad

   వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.)కి అనుబంధంగా జమ్ములో ఏర్పాటైన భారతీయ సమగ్ర ఔషధ అధ్యయన సంస్థ (ఐ.ఐ.ఐ.ఎం.) పరిధిలో 64 స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే నమోదయ్యాయి. జీవనోపాధి మార్గాలకు ప్రత్యామ్నాయ వనరులుగా స్టార్టప్ కంపెనీలకు తాజాగా ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇందుకోసం,.. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన అనుబంధ సంస్థలు, శాఖల ద్వారా ఆర్థిక, సాంకేతిక, లాజిస్టిక్ సంబంధ మద్దతును అందిస్తోంది. జమ్ము ఐ.ఐ.ఐ.ఎం. పరిధిలో నమోదైన 64 స్టార్టప్ సంస్థల్లో 14 సంస్థలు ఇప్పటికే  తమ ఉత్పాదనలను రూపొందించాయి. వాటిలో 4 సంస్థలు తమ ఉత్పత్తులతో మార్కెట్లో కూడా ప్రవేశించాయి. 

 

https://ci6.googleusercontent.com/proxy/b4shu3KWp1ftDkg_k8oIcTDbTwRIwFSC_DpbV4C8p7DHi2ggOydchQLxuLgIJl85DYYABgElvbRtF_m2ibBin3RccIam1zB51pwFVGVNigTrdQcPjT08PAyqqQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016B71.jpg

  కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం ప్రకటించారు.  భూగోళ విజ్ఞానం, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ వ్యవహారాలు, అణుశక్తి, అంతరిక్షశాఖలను కూడా సహాయ (స్వతంత్ర హోదా) మంత్రిగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. జమ్ములోని సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఐ.ఐ.ఎం. అధీనంలో బయోనెస్ట్ బయో ఇంక్యుబేటర్.ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ స్టార్టప్ సంస్థల ద్వారా జమ్ము ప్రాంతంలోని వేలాది మంది యువజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి వనరులు అందుతాయి.   

https://ci5.googleusercontent.com/proxy/ZZKQuk2R7_kPNKa8p1Lj8JpmwtnOPLFUbGNSIAsfE7cG3dtPXdKg1DrVPB0Ub2grNurI_xLC7E-_qUO9EhPMCj3iJ9aQ2IppeeiMgUz38kLarzzSw2KURlrosg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KL0O.jpg

దేశంలో జీవ సాంకేతిక పరిజ్ఞాన సృజనాత్మక వ్యవస్థను పెంపొందించే కృషిలో భాగంగా రూపొందించిన బయోనెస్ట్ వ్యవస్థను బయెటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధనా సహాయ మండలి (బి.ఎ.ఆర్.ఎ.సి.) ప్రారంభించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని స్టార్టప్ కంపెనీలకు భిన్నమైన రీతిలో, జీవ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఆవిష్కరణలకు, ఆలోచనలకు విభిన్న తరహా ప్రోత్సాహం అవసరమవుతుంది. తమతమ ఆలోచనలను, భావనలను పరీక్షించేందుకు కార్యకలాపాల నిర్వహణకు తగిన స్థలం, అధునాతన సాధన నిర్మాణంతో అనుసంధానం, ఇతర స్టార్టప్ సంస్థలతో అనుసంధామయ్యే వెసులుబాటు అవసరమవుతాయి. జమ్ములో ప్రారంభమైన బయోనెస్ట్ కార్యక్రమం ద్వారా బయో ఇంక్యుబేటర్లకు తగిన ప్రోత్సాహం, మద్దతు లభిస్తుంది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్ధగా నిలబడటానికి గానీ లేదా విద్యా సంస్థలో భాగంగా కొనసాగడానికి కానీ ఈ మద్దతు లభిస్తుంది.

https://ci4.googleusercontent.com/proxy/NAO95PDUXbV8O3zf2BI5-8u12xVY5O2BOGt4Pdf8rOGhDUtk8Isx2zBhgy2NhQPZ8W2FU_5U7szn-JvV_LgXz5E7zgKT2pNvvgdwWDp8gQTYT058WIfvV3RoBA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003O5JV.jpg

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, జమ్ములోని సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఐ.ఐ.ఎం. సంస్థతో నమోదైన 64 స్టార్టప్ కంపెనీలు ప్రజా ప్రయోజనాలతోనే ముడివడిన ప్రాజెక్టులని అన్నారు. ఇప్పటికే ఈ స్టార్టప్ కంపెనీలు 14 ఉత్పాదనలను రూపొందించాయని, నాలుగు ఉత్పత్తులు మార్కెట్లో కూడా ప్రవేశించాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని స్టార్టప్ సంస్థల  నమోదు ప్రక్రియను ఐ.ఐ.ఐ.ఎం.  వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు.

https://ci6.googleusercontent.com/proxy/9TOhQmGYq-aqfuC_TQH5lX3hRdq0KglXFAs1AO1P93D5-9pU18pe5AL0jauayF99A6_tEFziGycc_kbmrkG0BME0N6QYwD0yZPgjfxTWY-UZDDwUzTFoJ7l3AA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KNB7.jpg

జమ్ములో బయోనెస్ట్ ఇంక్యుబేటర్ ప్రారంభం, స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో సమావేశం తదితర పరిణామాలతో ప్రధానమంత్రి ర్యాలీలో టెక్నాలజీ ప్రదర్శనకు మరింత ప్రేరణ లభిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. రేపు పంచాయతీ దినోత్సవం (పంచాయతీ దివస్) సందర్భంగా, జమ్ము కాశ్మీర్.లోని సాంబా జిల్లాలో ఉన్న పల్లి ప్రాంతంలో జరగనున్న వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారని జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ పరిణామం స్టార్టప్ సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న కొత్త జీవనోపాధి మార్గాలపై అవగాహన ఏర్పడుతుందని కేంద్రమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో అవగాహనా లోపం కారణంగా ఈ అంశాలపై ఆశించిన విధంగా ప్రోత్సాహం లభించలేదని ఆయన అన్నారు. స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో డాక్టర్ జితేంద్ర సింగ్ ముచ్చటిస్తూ, జాతీయ ప్రాధాన్యత కలిగిన జమ్ములోని ఈ సంస్థ, మరువం, సుగంధ మొక్కల సాగు పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇది ఈ ప్రాంతంలో నూతన ఉపాధి మార్గాలను అందించి, రైతుల స్వావలంబనకు కారణమైందని అన్నారు. మరువం సాగు రైతుల్లో విస్తృతమైన ఆదరణ పొందిందని అన్నారు. ఇది రైతులకు ఆర్థికంగా కొత్త మార్గం చూపించిందని అన్నారు. దీనికి దేశంలో, విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నందున ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో దీన్ని గొప్ప విజయంగా చెప్పవచ్చని, దీని ద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యం కూడా బాగా సమకూరే అవకాశం ఉందని అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/7bcz1_V743NcEOv6Gc5PsZ1QX9cgVRAg2YYH7axee5GFwvM8E6NkH9qfaZMuP2Ys2Tde586R4QJHs3RKAQhxyL-JsUcWQkTPSnPXcXL8xVsHFllrSTjJescxtA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005TWIE.jpg

  సుగంధం, మరువం సాగుకు సంబంధించి జమ్ములోని ఐ.ఐ.ఐ.ఎం. స్టార్టప్ సంస్థలకు ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహంపై విస్తృత స్థాయిలో ప్రచారం జరపవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబైకి చెందిన అజ్మల్ బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్, అదితి ఇంటర్నేషనల్, నవనైత్రి గామిక వంటి ప్రముఖ కంపెనీలు ఈ ఉత్పత్తులను ప్రధానంగా కొనుగోలు చేస్తున్నాయని అన్నారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా అధునాతన పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి డైరీ స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు కూడా ఇక్కడ అవకాశం ఉందన్నారు. ఇది స్వయం ఉపాధి అభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు.

  రేపు ప్రధానమంత్రి ర్యాలీ ఎగ్జిబిషన్ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ శాఖలు, విభాగాలు ఏర్పాటు చేయబోయే స్టాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయానికి ప్రయోజనం చేకూర్చే సృజనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించనున్నట్టు ఆయన చెప్పారు. సాంబా జిల్లాలోని పల్లి పంచాయతీ పరిధిలో ఎగ్జిబిషన్ కోసం రికార్డు వ్యవధిలో ఏర్పాటైన 500 కిలోవాట్ల సౌరశక్తి ప్లాంటును, ఇతర ఏర్పాట్లను కేంద్రమంత్రి పరిశీలించారు. 

  కర్బన రహిత సౌరశక్తి ప్లాంటును మొత్తం 6,408 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. కేవలం 18 రోజుల వ్యవధిలోనే ఏర్పాటైన ఈ ప్లాంటు ద్వారా పంచాయతీ పరిధిలోని 340 ఇళ్లకు వెలుగులు అందించే స్వచ్ఛమైన విద్యుత్తును సరఫరా చేస్తుంది. కేంద్ర సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రీయ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్లాంటును ఏర్పాటు చేసిందని జితేంద్ర సింగ్ చెప్పారు.

  పంచాయతీ దివస్ వేడుకల కోసం గుర్తించిన వివిధ ఇతివృత్తాలను గురించి కేంద్రమంత్రి వివరించారు. పేదరికం.. గ్రామీణ ఉపాధి విస్తరణ, ఆరోగ్యవంతమైన గ్రామం, చిన్నారుల సానుకూల గ్రామం, జలసమృద్ధ గ్రామం, పచ్చని పరిశుభ్ర గ్రామం, స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాల గ్రామం వంటి ఇతి వృత్తాలను ఎగ్జిబిషన్ కోసం ఎంపిక చేశారని మంత్రి తెలిపారు. సైన్స్ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ విభాగాలు అమలు చేయనున్న ఈ కార్యక్రమం,.. గ్రామీణ ప్రజల ఆదాయాన్ని మరింత బలోపేతం చేయడానికి, గ్రామాలను విప్లవాత్మకంగా పరివర్తన చెందించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు.

  సైన్స్, టెక్నాలజీ అంశాలను, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ అంశాలతో సమ్మిళితం చేసి సామాన్య ప్రజల ప్రయోజనం లక్ష్యంగా స్టాల్స్.ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు. పంచాయతీ రాజ్ దివస్ వేడుకల్లో సాంప్రదాయ రీతిలో స్టాల్స్.ను ఏర్పాటు చేసేందుకు బదులుగా, రైతుల ఆదాయానికి విలువను జోడించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిబింబించేలా వివిధ ఉత్పాదనలను ప్రదర్శిస్తారు. పంచాయతీ రాజ్ లక్షణాలతో సైన్స్ ఆధారితంగా ఈ స్టాల్స్.ను ఏర్పాటు చేస్తారని చెప్పారు.

 

*****



(Release ID: 1819383) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Tamil