నీతి ఆయోగ్
ఏప్రిల్ 25న ఇన్నొవేటివ్ అగ్రికల్చర్‌పై ఒక రోజు వర్క్‌షాప్ ను నిర్వహించనున్న నీతీ ఆయోగ్
Posted On:
23 APR 2022 2:01PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నీతీ ఆయోగ్ (NITI Aayog), 25 ఏప్రిల్ 2022న ఇన్నొవేటివ్ అగ్రికల్చర్ (వినూత్న వ్యవసాయం) అన్న అంశంపై ఒక రోజు జాతీయ వర్క్‌షాప్ ను నిర్వహించనుంది.
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పర్‌షోత్తం రూపాల, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, సభ్యులు (వ్యవసాయం) డాక్టర్ రమేష్ చంద్, సిఇఒ అమితాబ్ కాంత్ వర్క్‌షాప్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
భారత్‌లోనూ, విదేశాలలో వినూత్న వ్యవసాయ రంగంలో, సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్న భాగస్వాములందరినీ వర్క్‌షాప్ ఒకచోటికి తీసుకురాగలదని భావిస్తున్నారు. సహజ వ్యవసాయం, భూమి ఆరోగ్య పునరుద్ధరణలో దాని పాత్ర, పర్యావరణ మార్పులను తగ్గించడం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి.
ఆహార, వ్యవసాయ సంస్థ ( పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ - ఎఫ్ ఎ ఒ) సూచించిన వ్యవసాయ జీవావరణ సూత్రాలకు దాదాపు సారూప్యంగా సహజ వ్యవసాయ పద్ధతులు ఉంటాయి. రసాయనిక వ్యవసాయం కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రబావాన్ని తగ్గించడంతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఇది ఆచరణీయ పరిష్కారాలను అందిస్తుంది.
వివిధ సందర్భాలలో గౌరవనీయ ప్రధానమంత్రి సహజ వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇటీవలే, సహజ వ్యవసాయంపై 16 డిసెంబర్ 2021న జరిగిన జాతీయ సదస్సులో సహజ వ్యవసాయాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
గంగా నదీ తట్టున 5 కిమీల వెడల్పు గల కారిడార్‌లోని పొలాలతో ప్రారంభించి, దేశవ్యాప్తంగా రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్టు 2022-23 బడ్జెట్ ప్రకటించింది.
ఈ కార్యక్రమాన్ని మీరు నీతీ ఆయోగ్ యూట్యూబ్ ఛానెల్‌లో వీక్షించవచ్చు.
***
(Release ID: 1819381)
Visitor Counter : 176