వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జాతీయ పరిశోధనాభివ్రుద్ధి సంస్థ (NRDC)తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న ‘వ్యవసాయ , శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ’ (APEDA)
ఇది నాణ్యమైన ఎగుమతుల కోసం కర్బన అవశేషాలు లేని, కర్బన రహిత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సున్నా కర్బన ఉద్గార వ్యవసాయానికి సంబంధించిన, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయంపై దృష్టి సారించడానికి జరిగిన అవగాహన ఒప్పందం
प्रविष्टि तिथि:
22 APR 2022 3:08PM by PIB Hyderabad
ఎగుమతి విలువ గొలుసును ప్రోత్సహించే లక్ష్యంతో, వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (APEDA) నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC)తో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది.
భాగస్వాములకు మెరుగైన విలువ తీసుకురావడానికి వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రయోజనాల కోసం కార్యక్రమాలు సమన్వయం చేయడానికి కలిసి పని చేయడం ద్వారా రెండు సంస్థల నైపుణ్యాన్ని ఉపయోగించడం కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వ్యవసాయ ఎగుమతుల పాలసీ అమలుకు, ఎగుమతి విలువ గొలుసును బలోపేతం చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఎగుమతుల కోసం కార్బన్ అవశేషాలు లేని, కార్బన్ రహిత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సున్నా కార్బన్ ఉద్గార వ్యవసాయానికి సంబంధించిన వాతావరణ మార్పులు తట్టుకునే వ్యవసాయ రంగాలలో APEDA తో సంయుక్తంగా సాంకేతికతలను ప్రవేశపెట్టడం వ్యాప్తి చేయడం ఒప్పందం ఉద్దేశం.
ఒప్పంద పత్రం ప్రకారం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి విలువ గొలుసులోని వివిధ స్థాయిలలో వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధికి సంబంధించిన సాంకేతికతను వాణిజ్యీకరించడానికి రెండు సంస్థలు సహకార ప్రాజెక్టులలో పరస్పరం సహకరించు కుంటాయి.
చిన్న తరహా రైతులకు తక్కువ ధర, వినియోగదారు అనుకూలమైన ఇంధన-సమర్థవంతమైన సాధనాల కోసం వ్యవసాయ యంత్రాలు అభివృద్ధి చేయడం, మెరుగుపరచడం, వ్యవసాయ-ఎగుమతుల లో నిమగ్నమవ్వడానికి NRDC ఇంక్యుబేషన్ సెంటర్ (NRDCIC) తో అనుబంధించిన వ్యవసాయ అంకుర పరిశ్రమలు ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం సహకారం స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడం పరస్పర జ్ఞానాన్ని పెంచుకోవడానికి NRDC/APEDA నిపుణుల వనరులను ప్రతిపాదించడం ముఖ్య అంశాలు.
న్యూ ఢిల్లీలోని APEDA ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు, IAS సమక్షంలో APEDA కార్యదర్శి NRDC చైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ విశ్రాంత కమోడోర్ అమిత్ రస్తోగి ఈ ఒప్పందం పై సంతకం చేశారు.
NRDC, భారత ప్రభుత్వంలోని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (DSIR) అనుబంధ సంస్థ, ఇది 1953లో ఆవిష్కరణలు, పేటెంట్లు సాకారం అయ్యేందుకు సాంకేతికతలను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం వాణిజ్యీకరించడం అనే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించారు,.
వివిధ రంగాలలో స్వాభావికమైన వృత్తిపరమైన ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్న అనేక సంస్థలు, సంస్థలతో సమన్వయాన్ని తీసుకురావడానికి APEDA ఒక సహకార విధానంపై దృష్టి సారించింది. 2018లో భారత ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విధానం (AEP) కింద నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయం, దాని ఎగుమతి మెరుగుదల కోసం గుర్తించిన కొన్ని ప్రయత్నాలు పరిష్కరించడానికి, వాటాదారుల సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిష్కారాలను అందించడం వంటి సహకార రంగ లక్ష్యాలు ఉన్నాయి. .
AEP వ్యవసాయ ఎగుమతి ఆధారిత ఉత్పత్తి, ఎగుమతి ప్రోత్సాహం, రైతులకు మెరుగైన ధరల సాకారం, భారత ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు సమకాలీకరణ పై దృష్టి సారించి రూపొందించారు. విలువ గొలుసు అంతటా నష్టాలను తగ్గించడంలో సహాయపడటానికి మూలం వద్దే విలువ జోడింపు ద్వారా మెరుగైన ఆదాయం కోసం ఇది "రైతు కేంద్రక విధానం" పై దృష్టి పెడుతుంది.
మట్టి పోషకాల నిర్వహణ, అధిక ఉత్పాదకత, మార్కెట్-ఆధారిత రకాన్ని స్వీకరించడం వంటి వివిధ సరఫరా-వైపు సమస్యలు ఎదుర్కోవడంలో సహాయం చేయడానికి దేశంలోని వివిధ వ్యవసాయ-వాతావరణ మండలాల్లో ఉత్పత్తి-నిర్దిష్ట మండళ్లను అభివృద్ధి చేసే పంట, మంచి వ్యవసాయ పద్ధతుల ఉపయోగం మొదలైన విధానాన్ని అనుసరించడం పై కూడా ఈ విధానం దృష్టి సారిస్తుంది.
****
(रिलीज़ आईडी: 1819317)
आगंतुक पटल : 285