శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
క్వాంటమ్ కంప్యూటింగ్‌లో పరస్పర సహకారం సహకారం, వర్చువల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను చర్చించిన భారత్, ఫిన్లాండ్
Posted On:
20 APR 2022 10:39AM by PIB Hyderabad
క్వాంటం కంప్యూటింగ్‌లో సహకారం, వర్చువల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక పై భారతదేశం మరియు ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు చర్చించారు. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రెండు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ “ప్రత్యేకంగా మానవజాతి, ప్రపంచ శ్రేయస్సుకు ఉపకరించే విధంగా క్వాంటం సైన్స్ మరియు సాంకేతికతను అభివృద్ధి చేయడంలో సహాయపడే విద్యా మరియు పారిశ్రామిక భాగస్వాములను సహకారం పొందడానికి రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సాధ్యమైనంత తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే అంశానికి రెండు దేశాలు కృషి చేస్తున్నాయి ” అని పేర్కొన్నారు.
ఈ రంగంలో రెండు దేశాల బలాలు, లోటుపాట్లను గుర్తించాలని ప్రతినిధులకు డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. రెండు దేశాల బలాలు మరియు బలహీనతలు గుర్తించి బలహీనతలను అధిగమించడానికి ఒక ప్రణాళిక రూపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు.
సమావేశానికి ముందు క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఇండో-ఫిన్నిష్ వర్చువల్ నెట్‌వర్క్ సెంటర్ ఏర్పాటు కోసం రెండు దేశాల ప్రతినిధులు ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక, ప్రజా ఫిర్యాదులు, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, భూ శాస్త్రం,అంతరిక్ష శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, దేశంలో పర్యటిస్తున్న ఫిన్లాండ్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మికా లింటిలా సమక్షంలో ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థ మరియు బలమైన ఐటీ వ్యవస్థలను రెండు దేశాలు పరస్పరం అందించుకోవాలని ఫిన్‌లాండ్ ఆర్థిక వ్యవహారాలు మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ అండర్-సెక్రెటరీ శ్రీ పెట్రి పెల్టోనెన్ సూచించారు. ఫిన్‌లాండ్, భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానాలను రెండు దేశాలు పరస్పర సహకారంతో వినియోగించి లక్ష్యాలను సాధించాలని ఆయన అన్నారు.
రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన వల్ల సూపర్ కంప్యూటింగ్ పరికరాలు, సెన్సార్లు, సమాచార, అంతరిక్ష సాంకేతికతలు అభివృద్ధి, ఉత్పత్తి, పరిశోధన అంశాలకు దోహద పడుతుందని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ కె.ఆర్. మురళీ మోహన్ అన్నారు. నేషనల్ మిషన్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ మరియు క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (క్వెస్ట్) ప్రోగ్రామ్ ద్వారా కార్యక్రమాలను అమలు చేసేందుకు రెండు దేశాలకు గల అవకాశాలను ఆయన వివరించారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో తమ దేశంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వారసత్వం,, నిధులు, ఆవిష్కరణల-ఆధారిత పరిశ్రమ వివరాలను ఫిన్లాండ్ ఎంబసీ, ఎడ్యుకేషన్ & సైన్స్, కౌన్సెలర్, డాక్టర్ మికా టిర్రోనెన్ వివరించారు. తమ దేశం బలమైన క్వాంటమ్ వ్యవస్థను కలిగి ఉందని అన్నారు.
***
(Release ID: 1818357)
Visitor Counter : 189