వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2013-14 నుంచి 291% వృద్ధి చెందిన భారతదేశ చక్కెర ఎగుమతులు


మొదటిసారిగా 10 మిలియన్ టన్నుల ఎగుమతులు అధిగమించిన పంచదార రంగం

2021-22లోనే చక్కెర ఎగుమతులు 64.90% పెరుగుదల

మోడీ ప్రభుత్వ విధానాలు గ్లోబల్ మార్కెట్ ద్వారా రైతులు వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయపడుతున్నాయి - శ్రీ పీయూష్ గోయల్

Posted On: 18 APR 2022 5:34PM by PIB Hyderabad

భారతదేశ చక్కెర ఎగుమతులు 2013-14 ఆర్థిక సంవత్సరంలో  1,177 మిలియన్ల డాలర్ల  నుంచి 2021-22 ఆర్ధిక సంవత్సరంలో  4600 మిలియన్ల డాలర్లు అంటే  291% వృద్ధిని సాధించాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DGCI&S) గణాంకాల  ప్రకారం, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 121 దేశాలకు చక్కెర ఎగుమతి చేసింది.

 చక్కెర ఎగుమతులు 2021-22లో మునుపటి సంవత్సరంతో పోలిస్తే 65 శాతం పెరిగాయి. అధిక సరకు రవాణా ధరలు, కంటైనర్ కొరత మొదలైన COVID19 మహమ్మారి రూపంలో ఎదురైన రవాణా సవాళ్లు  ఎన్ని ఉన్నప్పటికీ వృద్ధి సాధ్యం అయ్యింది.

 కేంద్ర వాణిజ్యం  పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,  ప్రజా పంపిణీ,  జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఒక ట్వీట్‌లో చారిత్రాత్మక విజయాన్ని హైలైట్ చేస్తూ, మోడీ ప్రభుత్వ విధానాలు ప్రపంచ మార్కెట్‌ల  ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతున్నాయని అన్నారు.

 డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్   ప్రకారం, భారతదేశం 2019-20లో   1965 మిలియన్ల డాలర్ల  విలువైన చక్కెరను ఎగుమతి చేసింది, ఇది 2020-21లో 2790 మిలియన్ డాలర్లకు  2021-22లో 4600 మిలియన్లకు పెరిగింది.

 2021-22 (ఏప్రిల్-ఫిబ్రవరి)లో, భారతదేశం ఇండోనేషియాకు  769 మిలియన్ డాలర్ల  విలువైన చక్కెర ఎగుమతి చేసింది, తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (USD 561 మిలియన్లు), సుడాన్ (USD 530 మిలియన్లు)  U.A.E (USD 270 మిలియన్లు) ఉన్నాయి. భారతదేశం కూడా సోమాలియా, సౌదీ అరబ్, మలేషియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్, నేపాల్, చైనా మొదలైన దేశాలకు చక్కెర ఎగుమతి చేసింది. అమెరికా, సింగపూర్, ఒమన్, ఖతార్, టర్కీ, ఇరాన్, సిరియా, కెనడా తో పాటు  భారత తీపి దనాన్ని దిగుమతి చేసుకున్న దేశాల్లో  ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఇజ్రాయెల్, రష్యా, ఈజిప్ట్ మొదలైనవి ఉన్నాయి. దేశంలోని మొత్తం చక్కెర ఉత్పత్తిలో దాదాపు 80 శాతం ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర  కర్ణాటక వాటా. ఇతర చెరకు ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, బీహార్, హర్యానా  పంజాబ్.

 ముఖ్యంగా, బ్రెజిల్ తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు. 2010-11 నుంచి, భారతదేశం నిలకడగా మిగులు చక్కెర ఉత్పత్తి చేస్తోంది,  ప్రస్తుతం దేశీయ అవసరాలు సౌకర్యవంతంగా మించి ఉత్పత్తి చేస్తుంది. రికార్డు ఎగుమతులు చక్కెర ఉత్పత్తిదారులు తమ నిల్వలను తగ్గించుకునేలా చేస్తాయి  చెరకు రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి, ఎందుకంటే భారతీయ చక్కెర కు పెరిగిన డిమాండ్ వారి వాస్తవిక స్థితిని  మెరుగు పరిచే అవకాశం ఉంది. వ్యవసాయ-ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల దేశంలోని వ్యవసాయ  శుద్ధి చేసిన  ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా కూడా పరిగణిస్తారు.

 ఎగుమతి అయ్యే ఉత్పత్తుల స్థిర నాణ్యత ధృవీకరణను నిర్ధారించడానికి, వ్యవసాయ అండ్ శుద్ఎధి చేసియన్క్స్‌ ఆహార వస్తువుల అభివృద్ధి సంస్థ -APEDA విస్తృత శ్రేణి ఉత్పత్తులు  ఎగుమతిదారులకు పరీక్ష సేవలను అందించడానికి భారతదేశం అంతటా 220 ప్రయోగ శాలలను గుర్తించింది.

 


 

 APEDA అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలలో ఎగుమతిదారుల భాగస్వామ్యాన్ని నిర్వహిస్తుంది, ఇది ఎగుమతిదారులకు తమ ఆహార ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో మార్కెట్ చేయడానికి వేదికను అందిస్తుంది. APEDA వ్యవసాయ-ఎగుమతులు ప్రోత్సహించడానికి ‘ఆహార్’, ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్, బయో ఫ్యాచ్ ఇండియా మొదలైన జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.

 2019లో, APEDA ఇండోనేషియాకు ఎగుమతిదారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి రోడ్ షోలు నిర్వహించింది  సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత, ఇండోనేషియాకు ఎగుమతి పెరిగింది  నేడు భారతదేశం నుంచి చక్కెర అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అయ్యింది.

 

పట్టిక: చక్కెర ఎగుమతులు

                                                                                     ప్రమాణం : మిలియన్ డాలర్లలో

వస్తువు

2019-20

2020-21

 

2021-22

చక్కెర

1965         

2791

4600

 

 

రికార్డు ఎగుమతుల తర్వాత కూడా, చక్కర సీజన్ 2021-22 (అక్టోబర్-సెప్టెంబర్) ముగింపులో నిల్లువ 73 లక్షల టన్నుల సౌకర్య స్థాయిలో ఉంటాయి. చక్కెర ఎగుమతుల్లో ఈ ఎదుగుదల ధోరణిని కొనసాగించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను కొనసాగిస్తుంది.

 



***********



(Release ID: 1817933) Visitor Counter : 358