జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్
azadi ka amrit mahotsav

భారతదేశ సైబర్ విధానాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వ అధికారులు మరియు క్రిటికల్ సెక్టార్ సంస్థల కోసం నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఎక్సర్‌సైజ్ (ఎన్‌సిఎక్స్‌ ఇండియా)ను జాతీయ భద్రతా మండలి నిర్వహిస్తుంది

Posted On: 18 APR 2022 3:13PM by PIB Hyderabad

 

జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్, కేసీ, ఈ రోజు నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఎక్సర్‌సైజ్‌ని నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ మరియు డీఆర్‌డీవో సెక్రటరీ డాక్టర్ సతీష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నేషనల్ సైబర్ ఎక్సర్‌సైజ్ (ఎన్‌సిఎక్స్‌) ఇండియా సమకాలీన సైబర్ దాడులు మరియు నిర్వహణపై ప్రభుత్వ/క్లిష్ట రంగ సంస్థలు మరియు ఏజెన్సీల సీనియర్ మేనేజ్‌మెంట్ మరియు టెక్నికల్ సిబ్బందికి శిక్షణనిచ్చే లక్ష్యంతో 2022 ఏప్రిల్ 18 నుండి 29 వరకు పది రోజుల పాటు హైబ్రిడ్ వ్యాయామంగా నిర్వహించబడుతుంది.
image.png

ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (ఎన్‌ఎస్‌సిఎస్‌)నిర్వహిస్తోంది. నాలెడ్జ్ పార్టనర్‌గా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డిఎస్‌సిఐ) సహకారంతో భారతదేశరక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) మద్దతు ఉంది. శిక్షణ కోసం ప్లాట్‌ఫారమ్‌ను సైబర్‌ఎక్సర్ టెక్నాలజీస్ అందిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద సైబర్ వ్యాయామాలను నిర్వహించడం కోసం గుర్తింపు పొందిన ఎస్టోనియన్ సైబర్‌సెక్యూరిటీ కంపెనీ.

140 మందికి పైగా అధికారులు శిక్షణా సెషన్‌లు, లైవ్ ఫైర్ మరియు స్ట్రాటజిక్ వ్యాయామాల ద్వారా శిక్షణ పొందుతారు. ఇన్‌ట్రూషన్ డిటెక్నిక్స్, మాల్వేర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్ (ఎంఏఎస్‌పి), వల్నరబిలిటీ హ్యాండ్లింగ్ & పెనెట్రేషన్ టెస్టింగ్, నెట్‌వర్క్ ప్రోటోకాల్స్ & డేటా ఫ్లోస్, డిజిటల్ ఫోరెన్సిక్స్ మొదలైన అనేక కీలకమైన సైబర్ సెక్యూరిటీ విభాగాలపై ఇందులో పాల్గొన్న వారికి శిక్షణ ఇవ్వబడుతుంది.

సైబర్ బెదిరింపులను బాగా అర్థం చేసుకోవడానికి, సంసిద్ధతను అంచనా వేయడానికి మరియు సైబర్ సంక్షోభ నిర్వహణ మరియు సహకారం కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఎన్‌సిఎక్స్‌ ఇండియా వ్యూహాత్మక నాయకులకు సహాయం చేస్తుంది. ఇది సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌, టీమ్‌వర్క్, ప్లానింగ్, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ మరియు డెసిషన్ మేకింగ్‌లను అభివృద్ధి చేయడంలో మరియు పరీక్షించడంలో కూడా సహాయపడుతుంది.

 image.png


జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్, కేసీ, తన ప్రధాన ప్రసంగంలో దేశంలో జరుగుతున్న డిజిటల్ విప్లవాన్ని మరియు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో డిజిటల్ సేవలను ప్రారంభించడాన్ని హైలైట్ చేశారు. ఏదైనా విజయవంతమైన డిజిటల్ పరివర్తనకు సైబర్ భద్రత పునాది అని ఆయన అన్నారు. సైబర్‌స్పేస్‌లో ఏవైనా బెదిరింపులు నేరుగా మన సామాజిక, ఆర్థిక మరియు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతాయి కాబట్టి మనం మన సైబర్‌స్పేస్‌ను కాపాడుకోవాలన్నారు.
image.png
 నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్, భారతీయ సైబర్‌స్పేస్ యొక్క ప్రాముఖ్యతను మరియు పౌరులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వాల కోసం దానిని సురక్షితంగా మరియు క్షేమంగా ఉంచవలసిన అవసరాన్ని తెలియజేశారు. ప్రపంచంతో పాటు మన దేశంలో జరుగుతున్న రాన్సమ్‌వేర్‌ మరియు సప్లై చైన్ దాడుల పెరుగుదల గురించి మరియు ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని సంస్థల మధ్య సమన్వయాన్ని సాధించడం ఎలా చాలా ముఖ్యమైనది అని ఆయన మాట్లాడారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌పై ఇటీవల జరిగిన రాన్సమ్‌వేర్‌ దాడిని మరియు ప్రపంచ దృష్టాంతంలో సైబర్ వార్‌ఫేర్ యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన హైలైట్ చేశారు.

సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు నైపుణ్యాలను పెంపొందించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

 


 

***


(Release ID: 1817849) Visitor Counter : 276