రైల్వే మంత్రిత్వ శాఖ
ఖజురహోలో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ఖజురహో కోసం వందే భారత్ రైలు ప్రకటన
ప్రాంత అభివృద్ధిపై ప్రజాప్రతినిధులతో చర్చ
వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం కింద ఛతర్‌పూర్
Posted On:
17 APR 2022 2:16PM by PIB Hyderabad
ఖజురహో ఝాన్సీ నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌వే పర్యటన సందర్భంగా, రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉందని తెలిపారు.
కేంద్ర మంత్రి పర్యటనలో భాగంగా, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామ యోజనలో జరిగిన పనులను సమీక్షించారు. మంత్రి మహారాజా ఛత్రసల్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, గౌరవనీయులైన రైల్వే మంత్రి ఖజురహో నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఛతర్‌పూర్, ఖజురహోలో రెండు రేక్ పాయింట్లు ఆమోదించినట్లు తెలిపారు. దీనితో పాటు, ఇప్పుడు 45,000 పోస్టాఫీసుల నుండి రైలు టిక్కెట్లను పొందవచ్చని ఆయన చెప్పారు. త్వరలో ముఖ్యమైన ప్రదేశాలలో ఆర్వోబీ/ఆర్యూబీ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. రామాయణ ఎక్స్‌ప్రెస్, విద్యుద్దీకరణ వంటి భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణను ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు. అదే సమయానికి వందే భారత్ కూడా ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి 'ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడమే' అనే దార్శనికతను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సమయంలో స్ఫూర్తిగా అనుసరించాలని ఆయన అన్నారు.
రైల్వే మంత్రి ఖజురహో స్టేషన్‌ని ప్రపంచ స్థాయి స్టేషన్‌గా మార్చేందుకు పునరాభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి, స్థానిక పరిపాలన మరియు రైల్వేలతో పాటు, రైతులు వారి భూమిలో సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించారు, వీటి ద్వారా వారి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా బుందేల్‌ఖండ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. దీనికోసం త్వరలో భూమిని గుర్తించాలన్నారు. కిసాన్ మోర్చా, రైల్వే, జిల్లా పరిపాలన సంయుక్తంగా స్థలాన్ని గుర్తించడానికి. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్కీమ్‌ను కూడా విస్తరిస్తున్నామని, తద్వారా స్థానిక స్థాయి ఉత్పత్తులను స్టేషన్ల ద్వారా మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతామని ఆయన తెలియజేశారు. ఈ పథకం కింద 1000 స్టేషన్లు చేర్చబడతాయన్న మంత్రి, ఇందులో ఛతర్‌పూర్ స్టేషన్ కూడా చేర్చుతున్నట్లు తెలిపారు. పన్నా సమీపంలోని సున్నపురాయి పరిశ్రమలు ముఖ్యమైనవన్న అయన, పన్నా రైల్వేతో సైతం ఇది అనుసంధానం కానుందని తెలిపారు
ఈ సందర్భంగా ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ ప్రమోద్ కుమార్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సుధీర్ కుమార్ గుప్తా, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ అశుతోష్, జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రైల్వే పరిపాలన, జిల్లా పరిపాలన అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1817844)
Visitor Counter : 209