పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కేషోద్-ముంబై మార్గంలో ఆర్సీఎస్ ఉదాన్ కింద విమాన సర్వీసు ప్రారంభం గుజరాత్‌లో 2 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు : శ్రీ సింధియా
ఏప్రిల్ 27న పోర్‌బందర్-ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభం : శ్రీ సింధియా
Posted On:
17 APR 2022 10:40AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్సీఎస్ ఉదాన్ కింద కేషోద్-ముంబై మార్గంలోపౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిన్న (16.04.2022) విమాన సర్వీసును ప్రారంభించింది. ఉదాన్ ఆర్సీఎస్-41 లో ఈ మార్గం అలయన్స్ ఎయిర్‌కు లభించింది.. ఈ మార్గంతో కలుపుకుని ఉడాన్-ఆర్‌సిఎస్ పథకం కింద విమానాలు నడుస్తున్న మార్గాల సంఖ్య 417కి చేరింది.
కేషోద్-ముంబై సర్వీసు ప్రారంభ కార్యక్రమంలో విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, గుజరాత్ రోడ్లు భవనాలు పౌర విమానయాన, పర్యాటక తీర్థయాత్ర శాఖ మంత్రి శ్రీ పురేష్ మోదీ, గుజరాత్ పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి శ్రీ దేవభాయ్ మలం, పోర్‌బందర్ పార్లమెంటు సభ్యుడు శ్రీ రమేష్ ధదుక్, శ్రీ రాజేష్ చుడాసమా, జునాగఢ్-గిర్ సోమనాథ్ పార్లమెంటు సభ్యుడు శ్రీ జవహర్ చావ్డా, మానవదర్ శాసనసభ సభ్యుడు శ్రీ బాబు భాయ్ బోఖిరియా, పోర్ బందర్ శాసనసభ సభ్యులు శ్రీ రాజీవ్ బన్సల్, పౌర విమానయాన మంత్రిత్వ కార్యదర్శి శ్రీమతి ఉషా పాధీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వినీత్ సూద్, అలయన్స్ ఎయిర్ సీఈఓ మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ , ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు అలయన్స్ ఎయిర్ కి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ మార్గంలో విమానయాన సంస్థ బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి మూడు సార్లు విమానాలు నడుపుతుంది. మరియు ఈ మార్గంలో తక్కువ దూరం ప్రయాణించే విమానాల కోసం రూపొందించిన ఏటీఆర్ 72-600, 70-సీట్ల టర్బో ప్రాప్ తరహా విమానాలను సంస్థ ఉపయోగిస్తుంది. ఉదాన్ కింద కేశోద్‌ను ముంబైకి అనుసంధానం చేసిన మొదటి సంస్థగా అలయన్స్ ఎయిర్ గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా గుజరాత్‌లో ప్రత్యేకించి మన చరిత్రలో స్థానం పొందిన కేషోడ్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీకి ప్రీతిపాత్రమైన ప్రాంతాన్ని ఈ రోజు ప్రారంభించిన కొత్త ఉడాన్ సర్వీస్ దేశ ఆర్థిక రాజధానికి అనుసంధానం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కేషోడ్ సమీపంలో 2 ప్రసిద్ధ ప్రపంచ-ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు - సోమనాథ్ ఆలయం మరియు గిర్ నేషనల్ పార్క్ ఉన్నాయని అన్నారు. కొత్త మార్గాన్ని ప్రారంభించడంతో పర్యాటకులు ఈ రెండింటినీ సులభంగా సందర్శించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇంతేకాకుండా కేశోడ్‌లో పనిచేస్తున్న ఫర్నిచర్, టెక్స్టైల్, కెమికల్స్, సిమెంట్ మొదలైన వివిధ పరిశ్రమలు కూడా కొత్త విమాన మార్గం ప్రారంభం వల్ల ప్రయోజనం పొందుతాయని శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా వివరించారు.
గుజరాత్‌లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అమలు చేయనున్న అభివృద్ధి ప్రణాళికలను శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా వివరించారు. “ఈరోజు కొత్త విమాన మార్గాన్ని ప్రారంభించడమే కాకుండా, మేము కేశోద్‌ను రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌తో అనుసంధానం చేస్తాం. ఈ సంవత్సరం వేసవి షెడ్యూల్‌లో భారతదేశంలోని 3 నగరాలు అమృత్సర్, ఆగ్రా మరియు రాంచీ లకు అహ్మదాబాద్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అదేవిధంగా పోర్‌బందర్ మరియు రాజ్‌కోట్ నుంచి ముంబైకి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. హిరాసర్ మరియు ధోలేరాలో 2 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు ఎర్రపాటు అవుతాయి. వీటిలో వరుసగా సంవత్సరానికి 23 లక్షల మంది ప్రయాణికులు, 30 లక్షల మంది ప్రయాణికులు వస్తారని అంచనా. హిరాసర్ విమానాశ్రయానికి 1405 కోట్ల రూపాయలు, ధోలేరా విమానాశ్రయానికి 1305 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి" అని మంత్రి వివరించారు. . పోర్‌బందర్- ఢిల్లీని కలుపుతూ ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గం ఏప్రిల్ 27న ప్రారంభమవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి వెల్లడించారు.
కేశోద్ విమానాశ్రయం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. విమానాశ్రయం 1980ల చివరలోసేవలను అందించేందుకు విమానాశ్రయంలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి పునరుద్ధరించారు . గత 21 ఏళ్ల నుంచి ఈ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు దిగడం లేదు.
రన్‌వే పునరుద్ధరణ, ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ ఫైర్ టెండర్,, టెర్మినల్ బిల్డింగ్‌తో సహా కొత్త సివిల్ ఎన్క్లేవ్, రెండు ఏటీఆర్ -72 రకాల విమానాల కోసం అప్రాన్ మరియు లింక్ టాక్సీవే మొదలైన వాటి కోసం కేశోడ్ విమానాశ్రయాన్ని 25 కోట్ల రూపాయల ఖర్చుతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది.
కొత్తగా ప్రారంభించిన ఉదాన్ సర్వీస్ కేశోద్‌ను జాతీయ విమాన మార్గం పరిధిలోకి తీసుకుని వస్తుంది. గుజరాత్‌లోని జునాగర్ జిల్లాలో ఉన్న కేశోద్ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అరేబియా సముద్రం మరియు అందమైన అడవులు దీని సరిహద్దులుగా ఉన్నాయి. ఈ ప్రాంత ప్రయాణికులకు సౌకర్యం మరియు సౌకర్యాన్ని కేశోద్ విమానాశ్రయం అందిస్తుంది.. సోమనాథ్ ఆలయం మరియు గిర్ నేషనల్ పార్క్ కేషోడ్ సమీపంలో ఉన్నాయి. కేషోడ్ నుంచి ముంబైకి రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి దాదాపు 16 గంటలు పడుతుంది. , కొత్త విమానం ప్రారంభంతో ప్రయాణ కేవలం 1 గంట 25 నిమిషాలకు తగ్గుతుంది.
విమాన షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:
క్ర.స.
|
పోక
|
రాక
|
ఫ్రీక్వెన్సీ (వారానికి)
|
పోక (గం.)
|
రాక (గం.)
|
విమానం రకం
|
1
|
ముంబై
|
కేశోద్
|
బుధవారం,
శుక్రవారం,
ఆదివారం
|
1200
|
1325
|
ఏటీఆర్ -72 600
|
2
|
కేశోద్
|
ముంబై
|
1350
|
1510
|
(Release ID: 1817522)
Visitor Counter : 170