వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మౌలిక సదుపాయాల సమగ్ర ప్రణాళిక కోసం ప్రధానమంత్రి గతిశక్తి, జాతీయ బృహత్ ప్రణాళిక కింద సాధించిన పురోగతి సమీక్షించిన శ్రీ పీయూష్ గోయల్


ప్రధానమంత్రి గతిశక్తి సానుకూల ప్రభావాలను ప్రశంసించిన మంత్రి


వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకీకరణ, సమకాలీకరణ ఆప్టిమైజేషన్, మొలిక సదుపాయాల ప్రణాళిక కోసం ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్‌ స్వీకరణ


ఆర్థిక వృద్ధిని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి దేశ ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి గతిశక్తి సహాయం.

Posted On: 14 APR 2022 11:27AM by PIB Hyderabad

వాణిజ్యం పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ వి కె త్రిపాఠి, ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రంజన్‌తో ప్రాదానమంత్రి గతిశక్తిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు.  శ్రీ రాజీవ్ బన్సల్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ. అనురాగ్ జైన్, సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ & ఇంటర్నల్ ట్రేడ్ అన్ని ఇతర మొలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు /డిపార్ట్‌ మెంట్‌ల నుండి సీనియర్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 ప్రధానమంత్రి గతిశక్తి - నేషనల్ మాస్టర్ ప్లాన్ (NMP) అనేది మెరుగైన కలిమిడి ఉత్పాదకత  కోసం వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల యొక్క ప్రస్తుత ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ వివరించే ఒక సమగ్ర ప్రణాళిక.

 మౌలిక సదుపాయాల అభివృద్ధి లో నిమగ్నమైన వివిధ వాటాదారులకు దృశ్యమానతను అందించడం ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని సాధించడంలో NMP సహాయం చేస్తుంది. ఇది వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పథకాలను కలుపుతుంది. టెక్స్‌టైల్ క్లస్టర్‌లు, ఫార్మాస్యూటికల్ క్లస్టర్‌లు, డిఫెన్స్ కారిడార్లు, ఎలక్ట్రానిక్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫిషింగ్ క్లస్టర్‌లు, అగ్రి జోన్‌లు మొదలైన ఆర్ధిక మండళ్ళు కూడా ఈ  మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వస్తాయి.

 ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది దేశ ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతుంది.

 డిపిఐఐటి లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శి చేసిన ప్రజెంటేషన్ సందర్భంగా, పిఎం గతిశక్తి కింద నిర్దేశించిన లక్ష్యాలపై పురోగతిని మంత్రిత్వ శాఖల వారీగా చర్చించారు. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరానికి 2,00,000 కిమీల నిర్దేశిత లక్ష్యం లో 2022 మార్చి 31 నాటికి 1,41,190 కి.మీ.ల జాతీయ రహదారులు పూర్తి చేసింది.
అదేవిధంగా, పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ అదే సమయ వ్యవధిలో 34,500 కిమీలలో 20,000 కిలోమీటర్ల గ్యాస్ పైప్‌లైన్ వేయడం పూర్తి చేసింది. మార్చి 2022 చివరి వరకు 4,54,200 కి.మీ.ల ప్రసార నెట్‌వర్క్‌ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధిగమించింది.

 టెలీకమ్యూనికేషన్ విభాగం 2024-25కి 50,00,000 కి.మీల నిర్దేశిత లక్ష్యానికి   31 మార్చి 2022 నాటికి 33,00,997 కి.మీల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ -OFC నెట్‌వర్క్‌ ను సృష్టించింది.

 సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ ను అమలులోకి తీసుకువచ్చినట్లు ఈ సమావేశంలో గుర్తించారు. దీని ప్రకారం, అపెక్స్ బాడీ - క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఒక ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్’ (EGoS) ఏదైనా అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి మాస్టర్ ప్లాన్‌లో ఏవైనా మార్పులను ఆమోదించడానికి ఏర్పాటు అయ్యారు. సమీకృత మల్టీమోడల్ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (NPG) వివిధ అనుసంధాన, మౌలిక మంత్రిత్వ శాఖలు, /డిపార్ట్‌మెంట్‌ల ప్రాతినిధ్యంతో వారి నెట్‌వర్క్ ప్లానింగ్ డివిజన్ అధినేతలతో కూడిన ఏకీకృత ప్రణాళిక ప్రతిపాదనల ఏకీకరణ EGoSకి సహాయం చేస్తుంది.

ప్రధానమంత్రి గతిశక్తి భావనను క్రమబద్ధీకరించడానికి ప్రదర్శించడానికి రాష్ట్రాలు ఆన్-బోర్డు అనుసంధానం అయ్యాయి. రాష్ట్రాల్లో సంస్థాగత వ్యవస్థను  నెలకొల్పారు. సాధికారత కలిగిన కార్యదర్శుల బృందం 25 రాష్ట్రాల్లో ఏర్పాటు అయ్యింది, నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ 9 రాష్ట్రాల్లో పనిచేస్తోంది 6 రాష్ట్రాల్లో సాంకేతిక సహాయ బృందాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించే ప్రక్రియ పూర్తయింది.

ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ పోర్టల్  ప్రయోజనాలు క్షేత్రస్థాయి ప్రభావం కూడా వివరించారు. వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోర్టల్‌ని అమలు ప్రయత్నాల ఏకీకరణ సమకాలీకరణ కోసం, అవస్థాపన ప్రాజెక్టు ప్రణాళికా దశలో ఖర్చు సమయాన్ని మదుపు చేయడం ప్రారంభించారు.

జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద పౌరులకు 50 Mbps బ్యాండ్‌విడ్త్ అందించాలనే దాని లక్ష్యాన్ని సాధించడానికి, ప్రధానమంత్రి గతిశక్తి - NMP ద్వారా అన్ని నాన్-ఫైబర్ టవర్‌లను OFC ద్వారా కనెక్ట్ చేయడానికి ప్రణాళిక చేశారు. అన్ని నాన్-ఫైబరైజ్డ్ టవర్లు ఇప్పటికే ఉన్న OFC నెట్‌వర్క్‌లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ గతిశక్తి అంతర్జాల అనుబంధంలోకి తెచ్చారు.

 ప్రణాళిక ప్రమాణాల ఆధారంగా, అవసరమైన OFC పొడవు కేబుల్  వేయడానికి అయ్యే ఖర్చు పొందడానికి క్రియా సాధనాలు అభివృద్ధి అవుతున్నాయి.

అంతరాయాన్ని, వ్యయాన్ని తగ్గించడానికి ఈస్ట్-వెస్ట్, ఈస్ట్-కోస్ట్ నార్త్-సౌత్ డెడికేటెడ్ రవాణా నడవల (DFCs) కోసం అమరికను పటిష్టం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ద్వారా కూడా పోర్టల్‌ని అమలులోకి తెచ్చారు. ప్రాజెక్ట్ అమలులో అనుకున్న సమయం మించిపోయింది.

ఎయిర్ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం భూ సేకరణ అవసరాలు, భూ వినియోగ విశ్లేషణ రోడ్డు కనెక్టివిటీని గుర్తించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారత విమానయాన సంస్థ  (MoCA) ఈ- పోర్టల్‌ని ఉపయోగించింది. AAI సమయానుకూల ప్రణాళిక పరంగా ప్రయోజనం పొందింది. ఈ పోర్టల్‌ను ఉపయోగించడం వల్ల ఖర్చు ఆదా చేయడం భౌతిక సర్వే అవసరాన్ని భర్తీ చేసింది.

ప్రధానమంత్రి గతిశక్తి –జాతీయ బృహత్ ప్రణాళిక సామర్థ్యాన్ని ఎత్తిచూపుతూ  వివిధ ఆర్థిక మండలాలకు మల్టీమోడల్ కనెక్టివిటీని మెరుగుపరచడం వల్ల ప్రజల, రవాణా   వ్యవస్థలను సరళీకరిస్తామని మంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రిగతిశక్తి NMP పోర్టల్ అవస్థాపనపై అవగాహన వీక్షణను అందిస్తూనే,  మెరుగైన నెట్‌వర్క్ ప్లానింగ్ వేగవంతమైన అనుమతులను సులభతరం చేస్తుంది.

తన ముగింపు వ్యాఖ్యలలో కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు రాష్ట్రాలు NMPని విస్తృతంగా స్వీకరించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎం గతిశక్తి సానుకూల ప్రభావాన్ని ఆయన ప్రశంసించారు. పీఎం గతిశక్తి లక్ష్యాలను సాకారం చేసేందుకు అన్ని మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలు సమగ్ర పద్ధతిలో చేసిన పని బాగు అని ప్రశంసించారు.

ప్రాజెక్ట్‌ ల పురోగతిని  వీక్షించ డానికి బలమైన యాంత్రికతలను అభివృద్ధి చేయడం, ఉత్పాదక ప్రభావం ఉపశమన అవసరాల ఆధారంగా భవిష్యత్ దృష్టాంతాన్ని నిర్మించడం, పరిష్కారాలు/ఉపయోగం కేసులు/ఫంక్షనాలిటీలను అభివృద్ధి చేయడానికి వివిధ వాటాదారుల పోర్టల్ సమస్య ప్రకటనలను మెరుగుపరచడానికి అభిప్రాయాన్ని సేకరించడం పై మంత్రి భవిష్యత్తు మార్గదర్శకాలు అందించారు.

  

******



(Release ID: 1817085) Visitor Counter : 200