విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ & పునరుత్పాతక శక్తి రంగం కోసం పైలట్ ప్రాతిపదికన మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి వ్యక్తీకరణ (EOI)ని కోరిన విద్యుత్ మంత్రిత్వ శాఖ

Posted On: 14 APR 2022 11:16AM by PIB Hyderabad

పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ కోసం పైలట్ ప్రాతిపదికన మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను ఏర్పాటు చేయడం కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆసక్తి వ్యక్తీకరణ (EOI)ని కోరింది. ఐదేళ్ల వ్యవధిలో రూ. 400 కోట్ల బడ్జెట్‌తో పైలట్‌ ప్రాతిపదికన విద్యుత్‌ మరియు పునరుత్పాదక రంగానికి మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసేందుకు పథకాన్ని అమలు చేయాలని మంత్రిత్వ శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేంద్ర ప్రభుత్వ పథకం యొక్క వ్యవధి 2022-23 ఆర్థిక ఏడాది నుంచి 2026-27 ఆర్థిక ఏడాది వరకు గల ఐదు సంవత్సరాలు. ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) ను సమర్పించడానికి చివరి తేదీ 8 జూన్ 2022.

ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విధానంపై సంక్షిప్త సమాచారం:

 

ఈఓఐ ప్రాసెస్ అథారిటీ విజయవంతమైన ప్రపోజర్ ఎంపిక కోసం సింగిల్ స్టేజ్ ఈఓఐ ప్రక్రియను అనుసరిస్తునంది. ప్రతి ప్రతిపాదకులు ఒకే ప్రతిపాదనను సమర్పించాలి. అన్ని ప్రతిపాదనలు ఈ ఈఓఐ నిబంధనలకు అనుగుణంగా లేదా ప్రతిపాదన గడువు తేదీకి ముందు సిద్ధం చేసి సమర్పించాలి. దీనికి సంబంధించిన అదనపు సమాచారం కోసం ఏవైనా ప్రశ్నలు లేదా అభ్యర్థనలు ఈఓఐ ప్రాసెస్ అథారిటీకి అనుగుణంగా సమర్పించబడతాయి. ఈఓఐ ప్రాసెస్ అథారిటీ క్రింది ఈఓఐ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండటానికి ప్రయత్నిస్తుంది:

 

క్ర.సం

కార్యక్రమం

తేది &  సమయం

1.

ప్రతిపాదకులకు నోటిఫికేషన్

బుధవారంఏప్రిల్ 13, 2022

2.

ప్రి-ఈఓఐ మీటింగ్

బుధవారం, ఏప్రిల్  27, 2022 at 11:00 AM

3.

సందేహాలు అడిగేందుకు చివరి తేది లేదా ప్రతిపాదకులకు కావల్సిన సమాచారం

బుధవారం, మే 4, 2022 at 04:00 PM

4.

సమస్యల వివరణ, అనుబంధం లేదా ఈఓఐ సవరణలు 

బుధవారం, మే 11, 2022 at 04:00 PM

5.

ప్రతిపాదన గడువు తేదీ

బుధవారం, జూన్ 8, 2022 at 04:00 PM

 

మరిన్ని వివరాలకు ఈ పోర్టల్ సందర్శించండి:  https://powermin.gov.in/

 For EoI document, click here 


(Release ID: 1816858) Visitor Counter : 210