ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈశాన్య ప్రాంతాల్లో ఆపిల్ పంటల పెంపకంతో మార్పు

Posted On: 12 APR 2022 12:51PM by PIB Hyderabad

ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండ్లలో ఆపిల్ ఒకటి. ఈశాన్య ప్రాంతంలోని అనుకూలమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల కారణంగాతక్కువ ఉష్ణోగ్రత అవసరమైన ఆపిల్ రకాలు గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకునార్త్ ఈస్టర్న్ రీజియన్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొసైటీ (NERCRMS), షిల్లాంగ్ఈ ప్రాంతంలో ఆపిల్‌ పండ్లను పరిచయం చేయడానికి, ప్రచారం చేయడానికి చొరవ తీసుకుంది. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (NEC), ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖఆర్థిక సహకారంతో 2018 సంవత్సరంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YF9D.jpg

 

ఈ చొరవతో ఆ ప్రాంతంలోని రైతు సంఘాల నుంచి, వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల నుండి విశేష స్పందన లభించింది. ఈ విజయం ఆధారంగానార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (NEC), ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మద్దతును కొనసాగిస్తూ 2020-21 సంవత్సరంలో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత అవసరమైన ఆపిల్ ప్లాంటేషన్ యొక్క ప్రాజెక్ట్ ప్రమోషన్ యొక్క రెండవ దశను ప్రారంభించింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LJIG.jpg

 

అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీ ఛారిటీ మిషన్ సొసైటీ (జెడ్‌వీసీఎంఎస్సహకారంతో ఎన్ఈఆర్‌సీఆర్ఎంఎస్, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ZVCMS కార్యాలయంలోని జిరో, లెంపియాలో ఆపిల్ తోట నిర్వహణ మరియు సేంద్రీయ ఎరువులు బయో-పెస్టిసైడ్‌ల పంపిణీపై కార్యక్రమం నిర్వహించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZA1Z.jpg

 

వివిధ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ల (సీబీఓలు) నుండి 23 మంది లబ్ధిదారులను గుర్తించారు. శాస్త్రీయ పద్దతిలో సేంద్రియ ఎరువులుక్రిమిసంహారక మందుల వాడకం, పంట నాణ్యతను పెంపొందించడంపై వారికి శిక్షణ ఇచ్చారు.

హిబు డాంటేఉద్యానవన అభివృద్ధి అధికారిజిరోఅరుణాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం, శిక్షణ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్‌గా అధ్యక్షత వహించారు. జిరో వ్యవసాయ సంఘాన్ని శక్తివంతం చేయడంలో ఎన్ఈసీఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవను డాంటే ప్రశంసించారు. సూక్ష్మ పరిశ్రమలను ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించడంలో సీబీఓ సభ్యులకు శిక్షణ ప్రయోజనకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు అమలు చేయాలని ఆయన నిర్వాహకులకు తెలిపారు. కార్యక్రమం చివరలోలబ్ధిదారులు తమ తోటలకు అవసరమైన పనిముట్లను స్వీకరించారు.

ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, గౌరవ కేంద్ర కేబినెట్ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈశాన్య భారతదేశం శాంతిపురోగతి, శ్రేయస్సుల నవ శకానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్ఈఆర్ కిసాన్ శక్తికి సాధికారత కల్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారారైతులకు అధునాతన మార్పులు చేరువవుతున్నాయి. రైలుతు ఆర్థికంగా స్వావలంబన పొందుతున్నారు.

***


(Release ID: 1816027) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi , Manipuri