ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా,
కోవిడ్ -19 ఎక్స్ గ్రేషియా పరిహారం కోసం దాఖలైన క్లెయిమ్‌లను కొన్నింటిని పరిశీలించేందుకు మహారాష్ట్ర, గుజరాత్,ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు అత్యవసరంగా బయలుదేరిన కేంద్ర బృందాలు
విపత్తుల నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 5 కింద, ఎక్స్‌గ్రేషియా పొందేందుకు తప్పుడు క్లెయిమ్ దాఖలు చేయడం, తప్పుడు సర్టిఫికేట్ సమర్పించడం శిక్షార్హమైన నేరం.
Posted On:
08 APR 2022 6:02PM by PIB Hyderabad
కోవిడ్ -19 ఎక్స్‌గ్రేషియా పరిహారం కోసం దాఖలు అయిన క్లెయిమ్‌లలో 5 శాతం క్లెయిమ్‌లను యాదృచ్ఛికంగా ఎంపిక చేసి పరిశీలించేందుకు కేంద్రప్రభుత్వం మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యవసరంగా కేంద్ర బృందాలను పంపింది.
సుప్రీంకోర్టు 2022 మార్చి 24 వ తేదీన మిసిలేనియస్ అప్లికేషన్ నెం 1805 రిటి్ పిటిషన్ (సివిల్ )నెం 539 2021లోసుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రకు వెళ్లే బృందానికి ఎన్‌సిడిడి ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సునీల్ గుప్త నాయకత్వం వహిస్తారు.
కాలికట్ కు చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సలహాదారు డాక్టర్ పి.రవీంద్రన్ కేరళ బృందానికి, ఎన్ సిడిసి ప్రిన్సిపల్ అడ్వయిజర్ డాక్టర్ ఎస్ .వెంకటేష్ గుజరాత్ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే బృందానికి ఎన్‌సిడిసి డైరక్టర్ డాక్టర్ ఎస్.కె.సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.
క్ర.సంఖ్య
|
రాష్ట్రం
|
మెంబర్ 1
|
మెంబర్ 2
|
మెంబర్ 3
|
1
|
మహరాష్ట్ర
|
డాక్టర్ సునీల్ గుప్త
ప్రిన్సిపల్ కన్సల్టెంట్
ఎన్‌సిడిసి
|
డాక్టర్ అనుభవ్ శ్రీవాత్సవ
జాయింట్ డైరక్టర్
ఎన్‌సిడిసి
|
శ్రీ మనోజ్ కుమార్ వర్మ,యుఎస్
సిజిహెచ్ఎస్
|
2
|
కేరళ
|
డాక్టర్ పి.రవీంద్రన్
అడ్వయిజర్
ఎం.ఒ.హెచ్.డబ్ల్యు
కాలికట్
|
డాక్టర్ సంకేత్ కులకర్ణి
జాయింట్ డైరక్టర్
ఎన్‌సిడిసి
|
శ్రీ రాజేందర్ కుమార్
అండర్ సెక్రటరీ
ఆర్ఎస్ బివై డివిజన్.
|
3
|
గుజరాత్
|
డాక్టర్ ఎస్.వెంకటేశ్
ప్రిన్సిపల్ అడ్వయిజర్
ఎన్‌సిడిసి
|
డాక్టర్ సిమ్మి
జాయింట్ డైరక్టర్
ఎన్‌సిడిసి
|
శ్రీ రాజ్ కుమార్
హాస్పిటల్ 2
ఎన్.ఇ.డివి.
|
4
|
ఆంధ్రప్రదేశ్ |
డాక్టర్ ఎస్.కె.సింగ్
డైరక్టర్,ఎన్‌సిడిసి
|
డాక్టర్ హిమాన్షు చౌహాన్
జాయింట్ డైరక్టర్
ఎన్‌సిడిసి
|
శ్రీ ప్రేమ్ నారాయణ్
అండర్ సెక్రటరీ
డబ్ల్యుపిజి డివిజన్
|
ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, ఎన్‌డిఎంఎ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నారా లేదా అన్నదానిని పరిశీలిస్తాయి. ఇందుకు సంబంధించి వారు ఎక్స్‌గ్రేషియా కోసం దాఖలైన దరఖాస్తులలో యాదృచ్ఛికంగా 5 శాతం దరఖాస్తులను తీసి పరిశీలిస్తారు. ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు ఎంచుకున్న పద్ధతిని , ఆయా కేసుల వివరాలను వాటిని ఆమోదించారా లేక తిరస్కరించారా, కారణాలు ఏమిటి, జిల్లా అధికార యంత్రాంగం సేకరించిన పత్రాలు, చేసిన పరిశీలన వంటి వాటిని పరీక్షిస్తారు.
2022 మార్చి 24 వ తేదీన సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల ప్రకారం తప్పుడు క్లెయిమ్ దాఖలు చేయడం, తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఎక్స్‌గ్రేషియా పొందడం విపత్తుల నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 52 కింద నేరం.
సుప్రీంకోర్టు 2022 మార్చి 24న జారీచేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు ఈ బృందాలు చేపట్టే పరిశీలనకు సాయపడవలసి ఉంది. అలాగే క్లెయిమ్ లకు సంబంధఙంచిన సమాచారం, వారు చేపట్టిన చర్యలు, ప్రాసెస్ చేసిన విధానం వంటి వాటిని ఈ బృందం దృష్టికి తీసుకురావలసి ఉంటుంది. వాటిని పరిశీలించి దానిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. ఈ నివేదికను గౌరవ సుప్రీంకోర్టుకు సమర్పించవలసి ఉంది.
****
(Release ID: 1815316)
Visitor Counter : 200