ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సామాజిక్ న్యాయ్ పఖ్వాడా కోసం కర్ణాటకను సందర్శించనున్న శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
08 APR 2022 6:10PM by PIB Hyderabad
సామాజిక న్యాయ్ పఖ్వాడా కార్యక్రమంలో భాగం ఎలక్ట్రానిక్స్ & ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వారం రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు.
నైపుణ్య శిక్షణా సంస్థల నుండి ప్రజలు, కార్యకర్తలు, న్యాయ నిపుణులు, అంకుర సంస్థలు, విద్యార్థులు & మహిళా పారిశ్రామికవేత్తలతో వారం రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.
ఏప్రిల్ 10న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సర్వజననగర్‌లోని రామమందిరాన్ని మంత్రి సందర్శించనున్నారు.
ఏప్రిల్ 11వ తేదీన మంత్రి ఐబీఎం కార్యాలయాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ సెంటర్‌ను సందర్శించి నిపుణులతో సంభాషిస్తారు. సైబర్‌స్పేస్‌పై భద్రత, నమ్మకం, దాని వినియోగదారులకు జవాబుదారీగా మార్చాల్సిన అవసరం గురించి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడనున్నారు. ఉక్రెయిన్-రష్యా వివాదం తర్వాత ఇంటర్నెట్‌ను ఆయుధీకరణ చేయడం, సార్వభౌమ దేశాలు పెద్ద టెక్నాలజీ సంస్థలు ద్వారా ఇంటర్నెట్‌ను ఆయుధంగా ఉపయోగించడంపై ఆయన ఇటీవల ప్రసంగించారు.
బెంగుళూరులోని కర్నాటక హైకోర్టులో న్యాయవాదుల సంఘం, కార్యక్రమంలో “"న్యాయ వెల్లడిలో తాజా సాంకేతికత” అనే అంశంపై మంత్రి ప్రసంగిస్తారు. ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ఇ-గ్రీవెన్స్ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. రాజీవ్ చంద్రశేఖర్ టెక్నాలజీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. భారతదేశంలో సాంకేతికతపై పట్టు ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా పరిగణించబడుతున్నారు. అతను చట్టబద్ధమైన పాలనపై దృఢ విశ్వాసం కలిగి ఉన్నాడు గోప్యతా హక్కు, ప్రాథమిక హక్కు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఉల్లంఘించేలా ఐటి చట్టంలోని క్రూరమైన సెక్షన్ 66ఏ ని కొట్టివేయడం వంటి ముఖ్యమైన ప్రజా సమస్యలపై పిల్స్ దాఖలు చేయడంలో పేరుగాంచాడు.
మరుసటి రోజు (ఏప్రిల్ 12) మంత్రి కోరమంగళలోని గుబాలాల సరస్సు, కననాపుర రోడ్, కెంపాబుధి కెరె, కెంపేగౌడ నగర్ మేస్త్రీపాళ్య సరస్సులను సందర్శిస్తారు. రాజీవ్ చంద్రశేఖర్ ఈ నీటి వనరుల పరిరక్షణ & పునరుజ్జీవనం కోసం మరియు వాటిని ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా నిరోధించడం కోసం చురుకుగా కొనసాగిస్తున్నారు. సరస్సుల సందర్శన అనంతరం బీటీఎం లేఅవుట్‌లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.
ఏప్రిల్ 13వ తేదీన బెంగళూరులో అంకుర సంస్థల సీఈవోలతో మంత్రి అల్పాహారం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు, అనంతరం బెంగళూరు నార్త్ నియోజకవర్గంలోని సరసమైన ధరల దుకాణాన్ని సందర్శిస్తారు.
ఏప్రిల్ 14న డా. బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం శాంతినగర్ నియోజకవర్గంలో పౌర కార్మికులతో కలిసి భోజనం చేస్తారు.
అనంతరం యశ్వంత్‌పూర్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ని సందర్శించి అక్కడ విద్యార్థినులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సంభాషించనున్నారు. మంత్రి నైపుణ్య శిక్షణా కార్యక్రమాల లబ్ధిదారులతో సంభాషిస్తున్నారు మరియు వారి వ్యాపారాలను మెరుగుపర్చేందుకు డిజిటల్ శక్తిని ఉపయోగించుకునేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తారు. రాజీవ్ చంద్రశేఖర్ 1990లలో భారతదేశంలో సెల్యులార్ రంగాన్ని నిర్మించిన విజయవంతమైన వ్యవస్థాపకుడు. మంత్రితో సంభాషించం వల్ల అవకాశాల కోసం ఎదురుచూసే నైపుణ్య శిక్షణార్థులందరికీ గొప్ప ప్రేరణగా ఉపయోగపడుతుంది.
***
(Release ID: 1815133)
Visitor Counter : 161