ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

సాంకేతిక సహకారం కోసం యూఐడీఏఐ మరియు ఇస్రో మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయబడింది

Posted On: 08 APR 2022 3:52PM by PIB Hyderabad

సాంకేతిక సహకారం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), ఇస్రో, హైదరాబాద్ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.  యూఐడీఏఐ మరియు ఎన్ఆర్ఎస్సీ యొక్క ప్రధాన కార్యనిర్వాహక అధికారులు(సీఈవో), యూఐడీఏఐ మరియు ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐఎఫ్ఎస్ శైలేంద్ర సింగ్ మరియు ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ సంతకం చేశారు.


భారతదేశంలోని ఆధార్ కేంద్రాల సమాచారం మరియు స్థానాలను అందించే భువన్ -ఆధార్ పోర్టల్‌ను ఎన్ఆర్ఎస్సీ అభివృద్ధి చేస్తుంది. నివాసితుల అవసరాల ఆధారంగా లొకేషన్ వారీగా సంబంధిత ఆధార్ కేంద్రాలను శోధించే సదుపాయాన్ని కూడా పోర్టల్ అందిస్తుంది.

సాధారణ చట్టబద్ధమైన తనిఖీలను నిర్వహించడం ద్వారా పౌర కేంద్రీకృత సేవలను మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న మరియు కొత్త గా నమోదు చేసే కేంద్రాలకు సంబంధించిన డేటాను సేకరించడానికి మరియు స్టోర్ చేయడానికి ఎన్ఆర్ఎస్సీ వెబ్ ఆధారిత పోర్టల్‌ను కూడా అందిస్తుంది. ఆన్‌లైన్ విజువలైజేషన్ సదుపాయంతో పాటు కేంద్రాల గురించి నివాసితులకు ఖచ్చితమైన సమాచారాన్ని నిర్ధారించడానికి సేకరించిన డేటా ప్రాంతీయ స్థాయిలో ఆమోదించబడిన అధికారుల ద్వారా నాణ్యత కోసం అవసరాలకు అనుగుణంగా మార్చబడుతుంది.  
అధిక రిజల్యూషన్ కలిగిన ఉపగ్రహ చిత్రాల బ్యాక్ డ్రాప్తో భువన్ ఆధార్పూర్తి భౌగోళిక సమాచారాన్ని స్టోర్ చేయడం, పునరుద్ధరించడం, విశ్లేషించడం మరియు ఆధార్ కేంద్రాల కోసం నివేదించడాన్ని సులభతరం చేస్తుంది.  యుఐడిఎఐ మరియు ఎన్‌ఆర్‌ఎస్‌సి డిజైన్, ఇంటిగ్రేషన్ మరియు ప్రాధాన్యతపై రోల్ అవుట్‌లకు సంబంధించిన విధానాలను నిశితంగా రూపొందిస్తున్నాయి.

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అనేది ఆధార్ చట్టం–2016 నిబంధన ప్రకారం 2016, జూలై 12న స్థాపించబడిన చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థ. ఆర్థిక మరియు ఇతర రాయితీలు, ప్రయోజనాలు మరియు సేవలను అందించే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది.  ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద భారతదేశంలో యూఐడీఏఐ ద్వారా ఇప్పటివరకు 132 కోట్ల మంది నివాసితులకు ఆధార్ నంబర్‌ను జారీ చేసింది. మరియు ఆధార్‌ను నవీకరించిన 60 కోట్ల మంది నివాసితులకు సౌకర్యాలు కల్పించింది.

 

****

 



(Release ID: 1815130) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi