హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర సాయుధ పోలీసు ద‌ళ సిబ్బందికి ఎయిర్ కొరియ‌ర్ సేవ‌లను నిలిపివేయ‌లేదు

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2022 8:21PM by PIB Hyderabad

సెంట్ర‌ల్ ఆర్మ‌డ్ పోలీస్ ఫోర్స్ (కేంద్ర సాయుధ పోలీసు ద‌ళ) సిబ్బందికి ఎయిర్ కొరియ‌ర్ సేవ‌ల‌ను నిలిపివేయ‌లేదు. ఈ సేవ‌లు జులై,2010 నుంచి న‌డుస్తున్నాయి. ఎయిర్ ఇండియాను ప్రైవేటీక‌రించిన ఫ‌లితంగా  స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల టెండ‌ర్ల‌ను ఖ‌రారు చేయ‌డం కొద్దిగా జాప్యం జ‌రిగింది. ఎయిర్ ఇండియా దీ సేవ‌ల‌ను కొన‌సాగించేందుకు హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే ఆమోదాన్ని తెలిపింది. టెండ‌ర్ల‌ను కూడా ఖ‌రారు చేయ‌డం జ‌రిగింది, ఉత్త‌ర్వులు జారీ కానున్నాయి. 
విమాన ప్ర‌యాణానికి సంబంధించిన మొత్తం కూడా నిబంధ‌న‌ల ప్ర‌కారం చెల్లించ‌డం జ‌రుగుతుంది. 


(రిలీజ్ ఐడి: 1815129) సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada , Malayalam