ఆర్థిక మంత్రిత్వ శాఖ
2021-22 లో ,కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనా ను మించి రూ 5 లక్షల కోట్ల రూపాయల పన్ను రాబడి
Posted On:
08 APR 2022 3:55PM by PIB Hyderabad
2021-22 కేంద్ర బడ్జెట్‌లో సవరించిన పన్ను రాబడి 19 లక్షల కోట్ల రూపాయలు కాగా 17 శాతం వృద్ధితో 22.17 లక్షల పన్ను రాబడి రాగలదని సవరించిన అంచనా వేశారు. 2021 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఇదే సమయంలో దేశంలో కోవిడ్ తొలి దశ తగ్గుతూ రాగా ప్రపంచం మిగిలిన వేవ్‌లను చూస్తోంది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనా పన్నురాబడి 22.17 లక్షల కోట్ల రూపాయలు కాగా ముందస్తు వాస్తవ అంచనాల ప్రకారం రెవిన్యూ రాబడి 27.07 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.ఇది దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా కంటే అధికం. ఈ పెరుగుదల అంతకు ముందు సంవత్సరం రెవిన్యూ వసూళ్లు రూ 20.27 లక్షల రూపాయలకంటే 34 శాతం అధికం. ప్రత్యక్ష పన్నులలో 49 శాతం, పరోక్ష పన్నులలో 20 శాతం వృద్ధి సాధించడం జరిగింది. కోవిడ్ పలు వేవ్ ల అనంతరం ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకోవడం, ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడంతో ఇది సాధ్యమైంది.ఇది ఆర్థిక వ్యవస్థ అద్భుత స్థాయిలో కోలుకున్న విషయాన్ని సూచిస్తోంది. దీనితో పాటు పన్ను ప్రక్రియను అమలు పరచడంలో మెరుగైన విధానం ఇందుకు తోడ్పడింది. ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు సక్రమంగా జరిగేలా చూసేందుకు పన్నుల యంత్రాంగం పలు చర్యలు తీసుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేథను కూడా ఇందుకు వినియోగించడం జరిగింది.
2021-22 అత్యధిక పన్ను-జిడిపి శాతం 11.7 శాతం కలిగి ఉంది. జిడిపిలో ప్రత్యక్ష పన్ను శాతం 6.1 కాగా, పరోక్ష పన్ను జిడిపిలో 5.6 శాతం. పన్ను రాబడి వృద్ధి(జిడిపి వృద్ధితో పోల్చినపుడు పన్ను రాబడిలో వృద్ధి) ఆరోగ్యకరమైన రీతిలో 1.9 గా ఉంది.ఇది ప్రత్యక్ష పన్నులకు 2.8 శాతం, పరోక్ష పన్నులకు 1.1 శాతంగా ఉంది.ప్రత్యక్ష పన్నుల నుంచి పరోక్ష పన్నుల శాతం 2020-21 లో 0.9 ఉండగా 2021-22లో అది తిరిగి 1.1 కి చేరింది.
స్థూల కార్పొరేట్ పన్ను 2021-22లో 8.6 లక్షల కోట్ల రూపాయలు. అంతకు ముందు సంవత్సరం ఇది 6.5 లక్షల కోట్లు. నతన సరళ తర పన్ను వ్యవస్థ,మినహాయింపులు లేకపోవడం వంటివి ఆశించిన ఫలితాన్నిచ్చాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయపన్ను విభాగం 2.24 లక్షల కోట్ల రూపాయల మేరకు రిఫండ్ ఇచ్చింది. గత రెండు సంవత్సరాలలో ,రిఫండ్‌లకు సంబంధించి పెండింగ్‌లు లేకుండా చూస్తోంది. దీనివల్ల వ్యాపార రంగం చేతికి డబ్బు అందుబాటులోకి వస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో 2.4 కోట్ల రిఫండ్‌లు జారీ చేశారు. ఇందులో 2.01 కోట్లు, 2021-22 కు సంబంధించి నవి. ఇవి 2021 మార్చి 31 వరకు దాఖలు చేసిన రిటర్న్‌లకు సంబంధించినవి.
సత్వరం రిటర్న్ లు ప్రాసెస్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. 2021-22లో అదే రోజు ప్రాసెస్ చేసిన రిటర్న్‌లు 22.4 శాతం గా ఉన్నాయి. 75 శాతం రిటర్న్‌లు నెల రోజుల లోపల వ్యవధిలో ప్రాసెస్ చేసినవి ఉన్నాయి. 2021-22లో సగటు ప్రాసెసింగ్ సమయం 26 రోజులుగా ఉంది. అదే సంవత్సరం 71.4 కోట్ల రిటర్నులు దాఖలు కాగా , అంతకు ముందు సంవత్సరం 6.97 కోట్లరిటర్న్‌లు దాఖలయ్యాయి.
పరోక్ష పన్నుల విషయానికి వస్తే, 2021-22లో కోవిడ్ -19 మహమ్మారి రెండు వేవ్‌లు ఉన్నప్పటికీ జిఎస్‌టి లో వృద్ధి అద్భుతంగా ఉంది. సిజిఎస్‌టి రాబడి గత ఏడాది 4.6 లక్షల కోట్ల రూపాయల నుంచి 2021-22లో 5.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. సగటు నెలవారి స్థూల జిఎస్‌టి రాబడి 2021-22లో 1.23 లక్షల కోట్ల రూపాయలు. 2020-21 లో ఇది 94,734 కోట్ల రూపాయలు, 2019-20లో 1.01 లక్ష కోట్ల రూపాయలుగా ఉంది.
దీనిని గమనించినపుడు కూడా ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున కోలుకున్న విషయాన్ని గమనించవచ్చు. ఇది కూడా జిఎస్‌టి చెల్లింపులకు సంబంధించిన విధానాలను పకడ్బందీగా అమలు చేయడం వల్ల సాధ్యమైంది. జిఎస్‌టిఆర్ -3బి ఫైలింగ్ (ముందు నెల నాటి రిటర్న్‌లు ఆ నెలాఖరు నాటికి దాఖలైన శాతం) 2020 సెప్టెంబర్‌లో 74 శాతం నుంచి 2022 ఫిబ్రవరి నాటికి 87 శాతానికి పెరిగాయి. జిఎస్‌టిఆర్ -1 ఫైలింగ్ 2020 సెప్టెంబర్ లో 54 శాతం నుంచి ఫిబ్రవరి 2022 కు 82 శాతానికి పెరిగింది.దీనితో జిఎస్‌టిఆర్ -3బి ఫైలింగ్, జిఎస్‌టిఆర్ -1 ల ఫైలింగ్ మధ్య వ్యత్యాసం బాగా తగ్గింది. దీనిని బట్టి జిఎస్‌టి కి సంబంధించిన వ్యవహరాఆలు జిఎస్‌టిలో ఇన్ వాయిస్ ఆధారిత క్రమశిక్షణ కలిగిఉండడాన్ని స్వాగతించినట్టు అయింది. ఇది జిఎస్‌టి రెవిన్యూకు ప్రయోజనకరమే కాక, ఆర్థిక వ్యవస్థ కుదుట పడడానికి కూడా దోహాదపడుతుంది.
ప్రతినెల ఈ - వే బిల్లులను బట్టి కూడా ఆర్ధిక వ్యవస్థ ఏ స్థాయిలో కోలుకుందో బోధపడుతుంది. ఇది 2021 జనవరిలో 16.9 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2022 మార్చి నాటికి ఇది 25.7 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
2021-22 కస్టమ్స్ సుంకంలో వృద్ధి 48 శాతం గాఉంది. గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వం కస్టమ్స్ టారిఫ్‌ను సమగ్రంగా సమీక్షించడంతోపాటు కస్టమ్స్ టారిప్ వ్యవస్థను హేతబద్దం చేసింది. ఇందుకు విస్తృత సంప్రదింపులు, క్రౌడ్ సోర్సింగ్, నిర్వహించింది. వివిధ మినహాయింపులను హేతుబద్ధం చేసింది. టారిఫ్ వ్యవస్థను సులభతరం చేసింది.
వీటన్నింటిని బట్టి ఆర్థిక వ్యవస్థ కోలుకునే తీరు , ప్రభుత్వానికి పన్ను రాబడి మరింత వృద్ధి కాగలదని భావిస్తున్నారు.
****
(Release ID: 1815124)
Visitor Counter : 359