సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫ్రీడిష్ నేషనల్ అవుట్ రీచ్ కోసం ఒక వేదికగా ఆవిర్భవించిన డిడి ఫ్రీ డిష్

Posted On: 08 APR 2022 4:20PM by PIB Hyderabad

టెలివిజన్ ద్వారా భారతదేశం అంతటా ప్రజలకు పబ్లిక్ , నేషనల్ అవుట్ రీచ్ డిడి ఫ్రీడిష్ ప్లాట్ ఫామ్ తో అద్భుతమైన ప్రోత్సాహాన్ని పొందింది. తన ప్రజా సేవా విధానానికి కట్టుబడి, ప్రసార భారతి డిడి ఫ్రీడిష్ తన ప్లాట్‌ఫారమ్ ద్వారా పెద్దఎత్తున ప్రజలకు చేరువ ,వ్యాప్తిని ప్రారంభించడం ద్వారా మహమ్మారి సమయంలో ప్రజలకు సేవ చేయడంలో ప్రత్యేకంగా నిలిచింది. మహమ్మారి కారణంగా సాంప్రదాయ విద్యా విధానం ఇబ్బంది పడుతుండగా, డిడి ఫ్రీడిష్ బహుళ విద్యా ఛానెల్స్ కోసం ఒక వేదికను అందించింది. తద్వారా భారతదేశం అంతటా విద్యార్థులకు నిరంతర విద్యను అందుబాటు లో ఉంచింది. భారతదేశం అంతటా టెలివిజన్ ద్వారా పబ్లిక్ ,నేషనల్ ఔట్రీచ్ కోసం ఒక వేదికగా డిడి ఫ్రీడిష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు  ఇటీవలి వీక్షకుల డేటా వెల్లడించింది.

 

 

పరీక్షా పే చర్చా 2022 ను డిడి ఫ్రీడిష్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న వివిధ టీవీ ఛానెల్‌లలో 33% మంది వీక్షించారు. అనేక పరిశ్రమ అంచనాలు భారతదేశంలోని మొత్తం టీవీ గృహాలలో దాదాపు 20% డిడి ఫ్రీడిష్ ఇన్‌స్టాల్ బేస్‌ను కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ 2022 ను 26% మంది ప్రేక్షకులు డిడి ఫ్రీడిష్లో అందుబాటులో ఉన్న వివిధ ఛానెళ్లలో వీక్షించారు. నేషనల్ అవుట్ రీచ్ విషయం లో డిడి ఫ్రీడిష్ ప్రాముఖ్యత కు ఇది మరో సంకేతం.

 

2000వ దశకం ప్రారంభంలో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం ప్రారంభించిన డిడి ఫ్రీ డిష్ ను 2004 లో డిడి డైరెక్ట్ ప్లస్ గా పిలిచేవారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వ హయాంలో లో పునరుద్ధరించబడిన తరువాత, ఈ వేదిక ఇటీవలి సంవత్సరాలలో వేగవంతమైన వృద్ధిని చూసింది. గడిచిన ఏడు సంవత్సరాల్లో, 2015 నుంచి, డిడి ఫ్రీ డిష్ సబ్ స్క్రిప్షన్ బేస్ 100% మించి గణనీయంగా విస్తరించింది. ఇటీవలి ఫిక్కీ-ఈవై 2022 నివేదిక ప్రకారం, డిడి ఫ్రీడిష్ 43 మిలియన్లకు పైగా గృహాలకు చేరుకోవడం ద్వారా  టీవీ పంపిణీ పరిశ్రమలో అతిపెద్ద వేదికగా అవతరించింది, అయితే కొంతమంది విశ్లేషకులు ఇది మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

 

ప్రసార భారతి డిటిహెచ్ సర్వీస్ డిడి ఫ్రీడిష్ మాత్రమే ఫ్రీ-టు-ఎయిర్ (ఎఫ్టిఎ) డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) సర్వీస్. దీనికి  ప్రేక్షకుడు ఎటువంటి నెలవారీ చందా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. డిడి ఫ్రీడిష్ సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేయడం కోసం కేవలం రూ. 2000 చిన్న మొత్తం పెట్టుబడి ఒక్కసారి మాత్రమే అవసరం అవుతుంది.

https://prasarbharati.gov.in/free-dish/

 

డిడి ఫ్రీడిష్ ప్రస్తుత ఛానల్ లైనప్ లో మొత్తం 167 టివి ఛానల్స్ , 48 రేడియో ఛానల్స్ ఉన్నాయి, వీటిలో 91 దూరదర్శన్ ఛానల్స్ (51 కోబ్రాండెడ్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి) ,76 ప్రైవేట్ టివి ఛానల్స్ ఉన్నాయి.

 

ఛానల్స్ తాజా లైనప్ అందుకోవడం కోసం డిడి ఫ్రీడిష్ సెట్ టాప్ బాక్స్ ని ఎలా సెటప్ చేయాలనే దానిని క్రింది లఘు వీడియోను చూడవచ్చు.

 

****


(Release ID: 1815122) Visitor Counter : 160