బొగ్గు మంత్రిత్వ శాఖ

కార్యకలాపాలునడవని బొగ్గు గనుల ను ఎలాంటి జరిమానా లేకుండానే వదులుకోవడం కోసం ప్రభుత్వ కంపెనీలకు వన్ టైమ్ విండో ను ఇవ్వడాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


పిఎస్ యు లవద్ద ఉన్న అనేక బొగ్గు గనులు ప్రభుత్వాని కి తిరిగి దక్కేటటువంటి అవకాశం ఉంది;అటువంటి గనుల ను వర్తమాన వేలం విధానాని కి అనుగుణం గా వేలం వేసే అవకాశం కూడా ఉంది  

Posted On: 08 APR 2022 4:02PM by PIB Hyderabad

కార్యకలాపాలు కొనసాగనటువంటి గనుల ను ఎలాంటి జరిమానా (బ్యాంకు పూచీకత్తు యొక్క జప్తు) లేకుండా మరియు ఎలాంటి కారణాన్ని పేర్కొనకుండా ప్రభుత్వానికి వాపసు ఇవ్వడాని కి కేంద్రీయ పిఎస్ యు లకు మరియు రాష్ట్ర పిఎస్ యు లకు ఒక వన్- టైమ్ విండో ను అందుబాటు లోకి తీసుకు రావాలని బొగ్గు మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) ఈ రోజు న ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తో ప్రస్తుతం ప్రభుత్వ పిఎస్ యు అలాటీస్ చేతి లో ఉన్న అనేక బొగ్గు గనులు ఏవైతే అభివృద్ధి ప్రక్రియ ను చేపట్టగలిగిన స్థితి లో లేవో/ఆయా గనుల అభివృద్ధి పట్ల ఆసక్తి వ్యక్తం కావడం లేదో అటువంటి గనుల ను విముక్తం చేసి, ప్రస్తుత వేలం విధానాన్ని ప్రతిపాదిక గా చేసుకొని వేలం వేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆయా గనుల ను కేటాయించిన ప్రభుత్వ కంపెనీలు ఆమోదం లభించిన సరెండర్ పాలిసీ తాలూకు ప్రచురణ తేదీ నాటి నుంచి మూడు నెలల కాలం లోపల ఆయా గనుల ను వదులుకొనేందుకు అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది.


సర్వోన్నత న్యాయస్థానం 2014వ సంవత్సరం లో బొగ్గు బ్లాకుల ను రద్దు చేసిన తరువాత, థర్మల్ పవర్ ప్లాంటుల కు బొగ్గు సరఫరాల లో తాత్కాలిక అంతరాయాన్ని నివారించడం కోసం ప్రభుత్వం కేటాయింపు ల ద్వారా రాష్ట్రాల పిఎస్ యు లకు మరియు కేంద్రీయ పిఎస్ యు లకు అనేక రద్దయినటువంటి బొగ్గు బ్లాకుల ను కేటాయించింది. కేటాయింపు కార్యాన్ని శీఘ్ర గతి న పూర్తి చేయడమైంది. దీనితో రాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి కంపెనీ (జెన్ కో) ల బొగ్గు అవసరాలు ఆయా బ్లాకుల నుంచి తీరుతాయని ఆశించడం జరిగింది. రాష్ట్ర / కేంద్రీయ పిఎస్ యు లు చెల్లించేటటువంటి రెవిన్యూ లో భాగాన్ని ప్రతి టన్ను ఆధారం గా నిర్ణయించడం జరిగింది. అదే ప్రైవేటు రంగానికయితే, ఇందుకోసం బిడ్ లను వేయవలసి ఉంటుంది. ఆ కాలం లో బొగ్గు బ్లాకు ల కేటాయింపు సందర్భం లో, బొగ్గు బ్లాకుల ను పని చేయించడాని కి నిర్దిష్ట కాల అవధు ల తాలూకు షరతు లు చాలా కఠోరం గా ఉండేవి. గని ని చేజిక్కించుకొన్న కంపెనీ లేదా నామినేటెడ్ ఆథారిటీ కోసం ఎలాంటి మినహాయింపు అవకాశాన్ని విడచిపెట్టలేదు కూడా. బొగ్గు గనుల ను పని చేయించడం ప్రారంభించడం లో జాప్యం జరిగితే శిక్ష తాలూకు పరిణామాల వశాత్తు వివాదాలు తలెత్తాయి. కోర్టు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

 

2021వ సంవత్సరం డిసెంబరు వరకు, ప్రభుత్వ కంపెనీల కు కేటాయించినటువంటి 73 బొగ్గు గనుల లో 45 గనులు ఏ విధమైన కార్యకలాపాల కు నోచుకోనేలేదు. మరోపక్క 19 బొగ్గు గనుల విషయం లో గని తవ్వకం కార్యకలాపాల ప్రారంభాని కి నిర్దేశించిన గడువు తేదీ ముందే సమాప్తం అయిపోయింది. జాప్యాల కు కారణాలు అనేవి కేటాయింపుదారు సంస్థ ల నియంత్రణ పరిధి కి ఆవల ఉండిపోయాయి. ఉదాహరణ కు చెప్పాలంటే, చట్టం మరియు వ్యవస్థ సంబంధి అంశాలు; మునుపు ప్రకటించిన దాని కన్నా అటవీ ప్రాంతం పెరుగుదల; భూమి సేకరణ ను వ్యతిరేకిస్తూ భూమి యజమానులు ప్రతిఘటన కు సిద్ధం కావడం; బొగ్గు వనరుల లభ్యత పరంగా చూసుకొన్నప్పుడు భౌగోళికం గా ఆశ్చర్యకర పరిణామాలు ఎదురవడం వంటివి.

 

బొగ్గు రంగం అనేది దేశ శక్తి సంబంధి భద్రత కు కీలకమైంది అని చెప్పాలి. ఆమోదం లో భాగం గా, మంచి నాణ్యత కలిగిన బొగ్గు బ్లాకు లు వేటినైతే త్వరత్వరగా కేటాయించడం జరిగిందో అటువంటి వాటి ని మరో సారి పని చేసేందుకు వీలుగా తీర్చిదిద్దవచ్చును. అయితే ఇందుకోసం సాంకేతిక ఇబ్బందుల ను దూరం చేయవలసినటువంటి మరియు సరిహద్దుల ను సర్దుబాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవి జరిగాక, వాటిని ఇటీవలే ప్రవేశపెట్టిన వాణిజ్య సరళి బొగ్గు గనుల వేలం విధానం ప్రకారం ఆసక్తి ఉన్న పక్షాల కు ఇవ్వజూపవచ్చును. బొగ్గు బ్లాకుల లో కార్యకలాపాలు త్వరగా మొదలైతే, ఉపాధి అవకాశాలు అందివస్తాయి. పెట్టుబడి కి ప్రోత్సాహం లభిస్తుంది. దేశం లోని వెనుకబడిన ప్రాంతాల లో ఆర్థిక అభివృద్ధి కి తోడ్పాటు దొరుకుతుంది; అంతేకాకుండా, న్యాయస్థానాల లో దావాల సంఖ్య తగ్గుతుంది. దీనికి అదనం గా వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం పెంపొందుతుంది; తద్ద్వారా, దేశం బొగ్గు దిగుమతుల పై ఆధారపడటాన్ని తగ్గించుకోగలుగుతుంది.
 

 

 

***



(Release ID: 1814973) Visitor Counter : 127