సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
జాతీయ కాలండర్‌పై ఎగ్జిబిషన్, రెండురోజుల సదస్సుపై విస్తృత ప్రచారం కల్పించేందుకు గౌహతిలో జరిగిన ముందస్తు ప్రచార కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
06 APR 2022 6:07PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా , భారతదేశ జాతీయ కాలండర్‌పై రెండు రోజుల సదస్సు, ఎగ్జిబిషన్‌ను 2022 ఏప్రిల్ 22-23 తేదీలలో నమధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని, డోంగ్లాలలో నిర్వహించనున్నారు( కర్కాటక రాశిపై గల ప్రాంతం)
సాంస్కృతిక వ్యవహారాలు, శాస్త్ర విజ్ఞానం, భూ విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, పారిశ్రామిక పరిశోధన, మధ్యప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పలు ఇతర శాస్త్ర విజ్ఞాన సంస్థలైన ఐయుసిఎఎ, ఐఐఎ, ఉజ్జయిని విక్రమ్ యూనివర్సిటీ, ఐఐటి ఇండోర్ , విజ్ఞాన భారతి, రాష్ట్రీయ దిన్‌దర్శిక ప్రచార్ మంచ్ వంటి సామాజిక శాస్త్ర విజ్ఞాన సంస్థలు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ సదస్సుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు, పలు ముందస్తు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అస్సాంలోని గౌహతి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కార్యక్రమం నిర్వహించారు.
అస్సాం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర విజ్ఞానం, ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ శాఖమంత్రి శ్రీకేశబ్ మహంత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజ్ఞాన భారతి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ జయంత్ సహస్రబుద్ధె తొలిపలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. ఐఐటి గౌహతి డైరక్టర్ ప్రొఫెసర్ టి.జి. సీతారామ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
అస్సాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ అరూప్ కుమార్ మిశ్రా, గౌహతిలోని ఇన్‌స్టిట్యూట్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరక్టర్ డాక్టర్ ఆశిష్ కుమార్ ముఖర్జీలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విజ్ఞాన్ ప్రసార్ సైంటిస్ట్ ఎఫ్ డాక్టర్ అరవింద్ సి. రణడే, మహారాష్ట్ర లోని ఔరంగా బాద్ కు చెందిన రాష్ట్రీయ్ దిన్‌దర్శిక ప్రసార్ మంచ్ కి చెందిన శ్రీ రాహుల్ ఔసేకర్, నార్త్ ఈస్ట్ సైన్స్ మూవ్‌మెంట్ అస్సాం (విభా చాప్టర్) అధ్యక్షుడు డాక్టర్ పరిమళ్ చంద్ర భట్టాచార్జీ, గౌహతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఐకెఎస్ కుచెందిన డాక్టర్ యు.ఎస్. దీక్షిత్ తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
ఇండియన్ నేషనల్ కాలండర్ అనేది భారతదేశ గుర్తింపునకు సంబంధించిన శాస్త్రీయ ప్రకటన.దీనిని రాజ్యాంగ బద్ధంగా మన పార్లమెంటు 1957లో స్వీకరించింది. ఇది స్వాతంత్ర్యానంతరం మన గుర్తింపును పునరుద్ధరింప చేయడం.అయితే దురదృష్ట వశాత్తు ఇది అంతగా ప్రజల దృష్టికి రాకుండా ఉండి పోయింది.
ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఎవరైనా ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్‌చేయించు కోవచ్చు. ఇందుకు వెబ్ సైట్ http://bharatcalendar.inను ఏర్పాటుచేశారు. ఎంపిక చేసిన వారిని ఉజ్జయినిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశంకల్పిస్తారు. అలాగే ఇందుకు సంబంధించి ప్రదర్శన, ప్రసంగాలు, ప్యానల్ చర్చజు, అబ్జర్వేషన్ సెషన్‌లు ఈ సదస్సులో భాగంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన భారతి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలపై ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
www.youtube.com/c/VijnanaBharatiOfficial, www.facebook.com/VIBHAIndia.org,& www.twitter.com/Vibha_india.
(రిలీజ్ ఐడి: 1814633)
సందర్శకుల సూచీ సంఖ్య : : 183