పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
స్వామిత్వ పథకం కింద దేశంలోని దాదాపు 31,000 గ్రామాల్లో ఆస్తి కార్డులు తయారు చేశారు
ఈ పథకాన్ని మార్చి 2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు
Posted On:
05 APR 2022 6:11PM by PIB Hyderabad
సెంట్రల్ సెక్టార్ స్కీమ్ "SVAMITVA" అనేది గ్రామాలలోని నివాస ప్రాంతాలలో (అబాది) ఇళ్లను కలిగి ఉన్న గ్రామ గృహ యజమానులకు 'రికార్డ్ ఆఫ్ రైట్స్' అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద, దేశంలోని అన్ని గ్రామాలలోని గ్రామీణ నివాస ప్రాంతాల్లోని భూభాగాలను సర్వే చేస్తారు. ఇది పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా (SoI), రాష్ట్ర రెవెన్యూ శాఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరియు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) సహకార ప్రయత్నాలతో అమలు అవుతోంది. ఈ పథకం సామాజిక-ఆర్థిక సాధికారత మరియు మరింత స్వావలంబన కలిగిన గ్రామీణ ప్రజలను వారి ఆస్తి కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా వారి ఆస్తులను మోనటైజేషన్ చేయడానిని సులభతరం చేస్తుంది.
SVAMITVA పథకం కింద, సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (IEC) మరియు స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (SPMU) ఏర్పాటు కోసం రాష్ట్రాలకు పరిమిత స్థాయిలో నిధులు అందిస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, SVAMITVA పథకం కింద IEC మరియు SPMU భాగాల కోసం మహారాష్ట్ర రాష్ట్రానికి రూ.10,52,500/- నిధులు విడుదల చేశారు.
2018-19 నుండి అమలు చేస్తున్న రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ (RGSA) యొక్క కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద, దేశవ్యాప్తంగా పంచాయతీ రాజ్ సంస్థల (PRIలు) బలోపేతం కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు (UTs) నిధులు అందిస్తారు. RGSA పథకం కింద గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్ర రాష్ట్రానికి ఆమోదించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక (AAP) యొక్క వివరాలు మరియు నిధులు అనుబంధంలో జోడించారు.
2020-21లో హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి ప్రయోగాత్మక రాష్ట్రాలలో 2020-21లో పథకాన్ని విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, SVAMITVA పథకాన్ని 2021 - 22 నుండి దేశవ్యాప్తంగా విస్తరించారు. ఇప్పటివరకు దేశంలోని దాదాపు 31,000 గ్రామాల్లో ఆస్తి కార్డులను సిద్ధం చేశారు. ఈ పథకం మార్చి 2025 నాటికి పూర్తవుతుందని ఊహిస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు- రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు సర్వే ఆఫ్ ఇండియా కోసం మధ్యంతర లక్ష్యాలను నిర్దేశించడం, పర్యవేక్షణ కోసం రాష్ట్రాలు/సర్వే ఆఫ్ ఇండియాతో క్రమం తప్పకుండా సమావేశం కావడం, జాతీయ, రాష్ట్రం, జిల్లా మరియు పంచాయితీలలో నాలుగు స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా పొందుపరచడం మొదలైనవి.
భూమి మరియు భూమికి సంబంధించిన రికార్డులు అనేవి రాష్ట్రానికి సంబంధించిన విషయం. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సంబంధిత భూ రెవెన్యూ చట్టం/నియమాలు/కోడ్‌లు మరియు/లేదా SVAMITVA పథకం అమలు మరియు ఆస్తి కార్డుల జారీకి సంబంధించిన ఏదైనా ఇతర పరిపాలనా పత్రంలో తగిన నిబంధనలను పొందుపరుస్తాయి. అందువల్ల, రాష్ట్ర రెవెన్యూ చట్టాల ఏకరూపత కోసం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎటువంటి చొరవ తీసుకోలేదు.
అనుబంధం
RGSA పథకం కింద గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్ర రాష్ట్రానికి ఆమోదించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక (AAP) యొక్క వివరాలు మరియు నిధులు
(రూ. కోట్లలో)
క్రమ సంఖ్య
|
సంవత్సరం
|
AAP అప్రూవ్డ్
|
విడుదలైన ఫండ్
|
1
|
2018-19
|
102.54
|
11.54
|
2
|
2019-20
|
119.71
|
8.44
|
3
|
2020-21
|
233.00
|
66.76
|
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
*****
(Release ID: 1814010)
Visitor Counter : 566