సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

పి.ఎం.ఇ.జి.పి. కింద ఉపాధి కల్పన

Posted On: 04 APR 2022 1:11PM by PIB Hyderabad

 వ్యసాయేతర రంగంలో సూక్ష్మ ఔత్సాహిక సంస్థల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో, ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమాన్ని (పి.ఎం.ఇ.జి.పి.ని) దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.) మంత్రిత్వ శాఖ, ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి.) కలసి ఉమ్మడిగా ఈ పి.ఎం.ఇ.జి.పి. కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.

  పి.ఎం.ఇ.జి.పి. కింద గత మూడేళ్లలో రాష్ట్రాలవారీగా, ఏర్పాటైన సూక్ష్మ సంస్థల సంఖ్య, వాటి ద్వారా జరిగిన ఉపాధి కల్పనపై అంచనా తదితర వివరాలు ఈ దిగువన ఇచ్చిన అనుబంధంలో పొందుపరచబడ్డాయి.

  దీనికి తోడుగా, దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో స్వయం ఉపాధి కల్పనకోసం ఈ దిగువన పేర్కొన్న కార్యక్రమాలను కె.వి.ఐ.సి. ఆమలు చేస్తోంది.:

  1.  హనీ మిషన్: ఈ కార్యక్రమం కింద తేనెటీగల పెట్టెలు, తేనెటీగలు, పెంకందార్లకు అవసరమైన వస్తుసామగ్రిని అందించడంతోపాటుగా తగిన శిక్షణను కూడా ఇస్తున్నారు. రైతులు, ఆదివాసీలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు తేనెటీగల పెంపకం దార్లుగా తగిన ప్రోత్సాహం అందించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు.
  2. కుమ్హర్ సశక్తికకారణ్ కార్యక్రమం: ఈ కార్యక్రమం కింద కుమ్మరులకు అవసరమైన సహాయం, సహకారం అందిస్తున్నారు. విద్యుత్తుతో పనిచేసే కొత్త తరహా కుమ్మరిసారెలను, పరికర సామగ్రిని అందించడంతోపాటుగా, కుమ్మరులకు తగిన శిక్షణను కూడా ఇస్తున్నారు.

 

  సూక్ష్మ చిన్నతరహా సంస్థల (ఎం.ఎస్.ఇ.ల)ను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ దిగువ పథకాలను అమలుచేస్తూ వస్తోంది.:

  1. సంప్రదాయ పరశ్రమల పునరుజ్జీవ నిధి పథకం (ఎస్.ఎఫ్.యు.ఆర్.టి.ఐ.): సంప్రదాయ పరిశ్రమలను, సదరు పరిశ్రమల కార్మికులను, పనివారిని ప్రోత్సహించేందుకు, మెరుగైన పరికర సామగ్రిని, ముడిపదార్థాలను సరఫరా చేసి, ఉమ్మడి సదుపాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణను, నమూనాలను, మార్కెటింగ్ మద్దతును అందించడం ద్వారా  సుస్థిర ఉపాధిని కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
  2. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎం.ఎస్.ఇ.-సి.డి.పి.): విలువల వ్యవస్థ పరంగా సారూప్యంగా ఉండే ఒకే రకమైన 20 లేదా అంతకంటే ఎక్కువ సంస్థలను సమూహాలుగా (క్లస్టర్లుగా) నిర్వహించడం ద్వారా ఉమ్మడి సదుపాయ కేంద్రాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫ్యాక్టరీ సముదాయాల ఏర్పాటు లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
  3. ఇక, సూక్ష్మ, చిన్నతరహా సంస్థల రుణ హామీ పథకం (సి.జి.టి.ఎం.ఎస్.ఇ.), కింద కొలాటరల్ పూచీతో ప్రమేయం లేకుండానే రుణ సదుపాయం (టర్మ్ రుణాన్ని లేదా నిర్వహణాపరమైన మూలధనాన్ని) కల్పిస్తారు. ఈ పథకం కింద,..సూక్ష్మ, చిన్నతరహా సంస్థలను కొత్తగా స్థాపించేవారికి, ప్రస్తుత సంస్థల యజమానులకు రుణ సంస్థలు రుణసహాయాన్ని అందిస్తాయి. సి.జి.టి.ఎం.ఎస్. కింద గరిష్టంగా రూ. 2కోట్లదాకా రుణానికి 50-85శాతం వరకూ గ్యారంటీని వర్తింపజేస్తారు.

 

అనుబంధం

పి.ఎం.ఇ.జి.పి. కింద గత మూడేళ్లలో దేశంలో ఏర్పాటైన సూక్ష్మ సంస్థలు, వాటి ద్వారా కలిగిన ఉపాధి కల్పనా అవకాశాలపై అంచనాలు

 

 

2018-19

2019-20

2020-21

 

క్రమ సంఖ్య

రాష్ట్రం పేరు

ఏర్పాటైన సూక్ష్మ సంస్థలు

ఉపాధి కల్పనపై అంచనా

ఏర్పాటైన సూక్ష్మ సంస్థలు

ఉపాధి కల్పనపై అంచనా

ఏర్పాటైన సూక్ష్మ సంస్థలు

ఉపాధి కల్పనపై అంచనా

 

 

 

1

జమ్ము-కాశ్మీర్

7,529

60,232

5,355

42,840

8,575

68,600

 

2

లడఖ్

(కేంద్ర పాలిత ప్రాంతం-యు.టి.)

0

0

0

0

281

2,248

 

3

హిమాచల్ ప్రదేశ్

1,399

11,192

1,226

9,808

1,208

9,664

 

4

పంజాబ్

1,801

14,408

1,695

13560

1,650

13,200

 

5

చండీగఢ్ (యు.టి.)

28

224

14

112

10

80

 

6

హర్యానా

2,165

17,320

2,029

16,232

1,740

13,920

 

7

ఢిల్లీ

132

1,056

93

744

74

592

 

8

రాజస్థాన్

2,359

18,872

3,024

24,192

2,772

22,176

 

9

ఉత్తరాఖండ్

2,181

17,448

1,844

14,752

2,249

17,992

 

10

ఉత్తరప్రదేశ్

5,243

41,944

6,118

48,944

9,994

79,952

 

11

చత్తీస్.గఢ్

3,094

24,752

2,810

22,480

2,718

21,744

 

12

మధ్యప్రదేశ్

2,526

20,208

2,175

17,400

4,854

38,832

 

13

సిక్కిం

55

440

79

632

57

456

 

14

అరుణాచల్ ప్రదేశ్

280

2,240

211

1,688

98

784

 

15

నాగాలాండ్

1,208

9,664

1,109

8,872

740

5,920

 

16

మణిపూర్

1,291

10,328

1,173

9,384

1556

12,448

 

17

మిజోరాం

1,123

8,984

760

6,080

810

6,480

 

18

త్రిపుర

1,179

9,432

963

7,704

842

6,736

 

19

మేఘాలయ

390

3,120

377

3,016

 359

 2,872

 

 

కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.


[సందేశం జతచేయబడింది] పూర్తి సందేశం కోసం క్లిక్ చేయండి.

 

****


(Release ID: 1813498) Visitor Counter : 217