పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఈశాన్య రాష్ట్రాలను ఎంపిక చేసిన అంతర్జాతీయ గమ్యస్థానాలను అనుసంధానించేందుకు ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ (ఐఏసీఎస్)
- ఈశాన్య రాష్ట్రాలను బ్యాంకాక్, ఢాకా, ఖాట్మండు, యాంగోన్, హనోయి, మాండలే, కున్మింగ్ , చిట్టగాంగ్‌లతో అనుసంధానించబడతాయి.
Posted On:
04 APR 2022 2:17PM by PIB Hyderabad
సామాజిక-ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి.. ఎంపిక చేసిన అంతర్జాతీయ గమ్యస్థానాలతో దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల నుండి ఎయిర్ కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 'ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్' (ఐఏసీఎస్) ప్రారంభించింది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు మద్దతు ఇస్తున్నాయి. అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం గౌహతి, ఇంఫాల్ మరియు అగర్తలాలో ఎంపిక చేసిన అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానించే వివిధ మార్గాలను గుర్తించాయి. బ్యాంకాక్, ఢాకా, ఖాట్మండు, అస్సాం, మణిపూర్, త్రిపుర ప్రభుత్వాలు గౌహతి, ఇంఫాల్, అగర్తలా నగరలాలను బ్యాంకాక్, ఢాకా, ఖాట్మండు, యాంగోన్, హనోయి, మాండలే, కున్మింగ్ & చిట్టగాంగ్ వంటి ఎంపిక చేసిన అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానించే మార్గాలను గుర్తించాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు విమానాశ్రయాల అభివృద్ధి, మరియు ఆధునికీకరణ అనేది నిరంతర ప్రక్రియ, వాణిజ్య సాధ్యత, ట్రాఫిక్ డిమాండ్, భూమి లభ్యత మొదలైన వాటిపై ఆధారపడి.. సంబంధిత విమానాశ్రయ నిర్వహకులు ఎప్పటికప్పుడు దీనిని నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఈశాన్య ప్రాంతంలో గౌహతి, ఇంఫాల్‌లలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి, వీటిని వరుసగా గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీఐఏఎల్) మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహిస్తోంది.
జీఐఏఎల్ మరియు ఏఏఐ రెండూ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (ఎన్ఐటీబీ) నిర్మాణాన్ని చేపట్టాయి మరియు ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంతో సహా సేవలను మెరుగుపరచడానికి తమ సంబంధిత విమానాశ్రయాలలో ఇతర అనుబంధ పనులను చేపట్టాయి. దీనికి తోడు ఈశాన్య ప్రాంతానికి/వాటికి అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచడానికి ఏఏఐ కింది అభివృద్ధి పనులను చేపట్టింది:-
i) భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అగర్తల ఎయిర్‌పోర్ట్‌లోని కొత్త టెర్మినల్ భవనంను అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌గా రూపొందించబడింది. ii) అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడిన ఇంఫాల్ విమానాశ్రయంలో ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో సంవత్సరానికి 2.4 మిలియన్ల ప్రయాణికుల కోసం (ఎంపీపీఏ) కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టబడింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
(Release ID: 1813493)
Visitor Counter : 197