సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఇండియన్ కల్చర్ పోర్టల్‌లో మొత్తం మెటా డాటాతో సహా 2.98 లక్షల కళాఖండాలు, 34 లక్షలకు పైగా గ్రంథపట్టిక (బిబ్లియోగ్రాఫిక్) నమోదులుః శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
04 APR 2022 3:49PM by PIB Hyderabad
ఐఐటి బాంబే, ముంబై సమన్వయంతో భారత ప్రభుత్వం భారతీయ సాంస్కృతిక పోర్టల్, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఇండియన్ కల్చర్. గవ్. ఇన్ (www.indianculture.gov.in) ద్వారా నేషనల్ వర్చువల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌విఎల్ఐ)ను అమలు చేసింది. విభిన్న సాంస్కృతిక కళాఖండాల డిజిటల్ పరిరక్షణ కోసం ఒక వేదికను అందించడమే కాక తమ ఉమ్మడి వారసత్వం గురించి పౌరులలో సామూహిక యాజమాన్య భావనను సృష్టించడం ఎన్‌విఎల్ఐ లక్ష్యం.
ప్రాజెక్టు అత్యంత సజావుగా పురోగమించింది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఫలితం లేక ఉత్పాదన భారతీయ సాంస్కృతిక పోర్టల్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఇండియన్ కల్చర్. గవ్. ఇన్ (www.indianculture.gov.in).
ఎన్‌విఎల్ఐ ప్రాజెక్టును సంతృప్తికరంగా అమలు చేయడం జరిగింది. ఎన్‌విఎల్ఐ కింద అభివృద్ధి చేసిన భారతీయ సాంస్కృతిక పోర్టల్‌లో మొత్తం మెటా డాటాతో సహా 2.98 లక్షల కళాఖండాలు, 34 లక్షలకు పైగా గ్రంథపట్టిక (బిబ్లియోగ్రాఫిక్) నమోదులు ఉన్నాయి.
విషయాంశాన్ని అరుదైన పుస్తకాలు, ఇ-బుక్స్, వివరణ పట్టీ (ఆర్కీవ్స్), పెయింటింగ్‌లు, కథలు, సంక్షిప్త సమాచారాలు, చారిత్రిక నగరాలు, కోటలు/ దుర్గాలు తదితరాలు సహా 28 వర్గాలలో అందించడం జరుగుతోంది. ప్రస్తుతం పోర్టల్ ఇంగ్లీష్ & హిందీ భాషలలో అందుబాటులో ఉంది. దీనిని అటు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో ఇండియన్ కల్చర్ అన్న యాప్ ద్వారా చూసే సౌలభ్యాన్ని కల్పించారు.
నేటివరకూ సాధించిన విజయాలతో పాటుగా ఎన్‌విఎల్ఐలోని విశిష్ఠ అంశాలు
డిజిటల్ భవిష్యత్తు కోసం తమను తాము సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేపట్టిన చొరవ ఎన్‌విఎల్ఐ. భారతదేశవ్యాప్తంగా ఉన్న వివిధ కోశాగారాలు, వ్యవస్థల నుంచి సేకరించిన సాంస్కృతిక సహేతుక ఉన్న డాటాను సమ్మిళితంగా ప్రదర్శించే వేదిక ఎన్‌విఎల్ఐ.
ఎన్‌విఎల్ఐ ప్రాజెక్టులో భాగంగా, ఐఐటి- బి మన చరిత్ర, వారసత్వం, సంస్కృతిక సంబంధించి సమాచారాన్ని ఒకే చోట అందుబాటులో ఉండే మూలంగా భారతీయ సాంస్కృతిక పోర్టల్ (www.indianculture.gov.in)ను అభివృద్ధి చేసింది.
ఎన్‌విఎల్ఐ ముఖ్య లక్షణాలుః-
సమాజంలోని అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా జాతీయ, రాష్ట్ర ఆర్కీవ్స్ (వివరణ పట్టీ), గ్రంథాలయాలు, జిల్లా గెజెటీర్లు వంటి బహుళ సాంస్కృతిక వనరులకు సౌలభ్యాన్ని కల్పించే అన్నింటితో కూడిన సంఘటిత డిజిటల్ వేదిక.
డాటా సేకరణ , సంరక్షణ - వివిధ ఎంఒసి సంస్థల నుంచి డాటాను సేకరించారు. అలా అందుకున్న డాటాను భద్రపరిచారు.
డాటా హార్వెస్టింగ్ - భద్రపరిచిన డాటాను ఒక సామాన్య కోశాగారంలో సేకరించి ఉంచి, భారతీయ సాంస్కృతిక పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఉచిత యాక్సెస్ (ప్రాప్యత) - కోశాగారంలో భద్రపరిచిన వనరుల ఉచిత ప్రాప్యత.
అత్యాధునిక, యూజర్ ఫ్రెండ్లీ (సులభంగా ఉపయోగించగల) ఇంటర్‌ఫేస్ - పోర్టల్‌లో సులభంగా ప్రవేశించగలగడం అన్నది వినియోగదారు కోరుకున్న ఫలితాన్ని వేగవంతంఆ పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.
దృష్టిలోపం ఉన్న వారికి కూడా అందుబాటులో - దృష్టిలోపం ఉన్నవారు కూడా ఎటువంటి కష్టం లేకుండా పోర్టల్‌ను వినియోగించి, చదివేందుకు అవకాశాన్ని కల్పించే నిర్ధిష్ట లక్షణాలను, నిర్వాహకతను పోర్టల్ కలిగి ఉంది.
ఫేసెటెడ్ అండ్ అడ్వాన్స్‌డ్ సెర్చ్ - ఫిల్టర్ల సాయంతో పోర్టల్‌లోని వివిధ స్తరాలను చూసేందుకు ఫేసెటెడ్ సెర్చ్ వ్యక్తిని అనుమతిస్తుంది. అడ్వాన్స్‌డ్ సెర్చ్ అన్నది గ్రంథ రచయిత పేరు, పుస్తక శీర్షిక వంటి నిర్ధిష్ట క్షేత్రాలను ఉపయోగించి పుస్తకాలు, ఇతర వనరులను వెతికేందుకు తోడ్పడుతుంది.
ద్విభాషా డిజిటల్ వేదిక - ఇది ద్విభాషా పోర్టల్. ఇది ఇంగ్లీషు, హిందీ భాషలలో అందుబాటులో ఉంటుంది.
అరుదైన పుస్తకాలు, ఇ-పుస్తకాల కోసం డిజిటల్ ఫ్లిప్‌బుక్ - ఈ ప్రత్యేక లక్షణం పోర్టల్‌లో ఉన్న అన్ని పుస్తకాలకు అందుబాటులో ఉంది. పోర్టల్‌లో ఉన్న అరుదైన పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
సులభంగా చదవగల విషయాంశం - చరిత్ర, వారసత్వం, సంస్కృతికి సంబంధించిన విషయాంశాన్ని తేలికగా చదవగల రూపంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉంచడం జరిగింది.
క్యూఆర్ కోడ్ షేరింగ్ - పోర్టల్‌లో ఉన్న డాటాను ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించడం ద్వారా సులభంగా షేర్ చేయవచ్చు. ఒక్కసారి స్కాన్ చేసిన తర్వాత, కోరుకున్న పేజీని తేలికగా ఫోన్, ఇతర పరికరాల ద్వారా అందుబాటులోకి వస్తుంది.
నిరంతర వృద్ధి, నూతన చేరికలు - నూతన విషయాంశాలు, క్యురేట్ చేసిన డాటాతో పోర్టల్ నిరంతరం వృద్ధి చెందుతోంది. పుస్తకాలు, చేతితో రాసిన పత్రాలు, భద్రపరిచిన పత్రాలు, చిత్రాలు, వీడియోలు, ఇతర వనరుల రూపంలో లక్షలాది డాటాకు పోర్టల్ వేదికగా ఉంది.
భారతీయ సాంస్కృతిక పోర్టల్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వర్గాలుః -
అరుదైన పుస్తకాలు, ఇ- పుస్తకాలు, కోశాగారాలు (అర్కైవ్‌లు), గెజెట్‌లు, గెజెటీర్లు, చేతితో రాసిన పత్రాలు, మ్యూజియం సేకరణలు, పెయింటింగ్‌లు, ఆడియోలు, అగ్రాహ్య సాంస్కృతిక వారసత్వం (ఇన్ టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్), ఫోటో అర్కీవ్‌లు, చిత్రాలు, వీడియోలు, యునెస్కో నుంచి వచ్చిన కంటెంట్, పరిశోధనా పత్రాలు, ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీ, నివేదికలు & ప్రొసీడింగ్‌లు, యూనియన్ కేటలాగ్‌లు, ఇతర సేకరణలు తదితరాలు. కథలు, సంక్షిప్త రూపంలో అంశాలు, ఫోటో వ్యాసాలు, భారత్‌లోని దుర్గాలు, భారతదేశ జౌళి, వస్త్రాలు, భారత్‌లోని చారిత్రిక నగరాలు, భారతీయ సంగీత వాద్యాలు, ఆహారం, సంస్కృతి, వర్చువల్ వాక్‌త్రూస్, ఫ్రీడం ఆర్కీవ్ - గుర్తింపు రాని వీరులు తదితరాలు.
ఈ సమాచారాన్ని సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు.
***
(Release ID: 1813489)
Visitor Counter : 150