వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2021-22లో 417.8 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల ద్వారా ఎగుమతి లక్ష్యాన్ని అధిగమించిన భారతదేశం


గత 12 నెలలుగా నెలవారీ ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ; మార్చిలో 40 బిలియన్ డాలర్లను అధిగమించిన ఎగుమతులు

గణనీయమైన వృద్ధిని సాధిస్తున్న పెట్రోలియం యేతర ఎగుమతులు

2021-22లో ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు 45.5% వృద్ధి

2022-23లో గోధుమ ఎగుమతులు 10 మిలియన్ టన్నులు మించవచ్చు అని అంచనా

భారతదేశం స్థానిక మార్కెట్ నుంచి ప్రపంచ వాణిజ్య విపణికి చేరువ అవుతుంది - శ్రీ పీయూష్ గోయల్

ఎగుమతుల వల్ల జరిగే వృద్ధి కార్మిక వర్గాలు, రైతులు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది - శ్రీ గోయల్

ఎగుమతి లక్ష్యాలను అధిగమించడంలో వారి సమిష్టి కృషికి భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలిపిన శ్రీ పీయూష్ గోయల్

వ్యవసాయ రంగ ఎగుమతుల్లో అనుకూల వృద్ధి సూచనలు, వార్షిక ఎగుమతుల విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం.

అధిక వ్యవసాయ ఎగుమతులు 1.35 బిలియన్ల జనాభా అవసరాలను తీర్చగల భారతీయ రైతుల సామర్థ్యాన్ని సూచిస్తాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి మిగులును ఉత్పత్తి చేస్తాయి- శ్రీ గోయల్

ODOP PLIల వంటి చర్యలు అట్టడుగు స్థాయిలో ఎగుమతుల గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డాయి- శ్రీ

Posted On: 03 APR 2022 5:58PM by PIB Hyderabad

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సరుకులు ఎగుమతులు   417.8 బిలియన్ల అమరికన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య నాన్-ఇడిఐ పోర్ట్‌ ల నుంచి వచ్చిన గణాంకాలను మినహాయించింది.  ఇది భారతదేశ ఎగుమతి చరిత్రలో  ఎన్నడూ అందుకోని  విలువ అయిన $418 బిలియన్లను అధిగమించే అవకాశం ఉంది.

భారతదేశం మార్చి 2022లో అత్యధిక నెలవారీ సరుకుల ఎగుమతి విలువ 40.38 బిలియన్ డాలర్లను సాధించింది, మార్చి 2021లో USD 35.26 బిలియన్ల కంటే 14.53% పెరుగుదల గా,  మార్చి 2020లో USD 21.49 బిలియన్ల కంటే 87.89% పెరుగుదల గా నమోదు.

ఏప్రిల్ 2021-మార్చి 2022లో పెట్రోలియం యేతర వస్తువులలో కూడా ఎగుమతులు గణనీయమైన వృద్ధి సాధించాయి, ఇది ఏప్రిల్ 2020-మార్చి 2021లో  డాలర్లలో  352.76 బిలియన్లు, ఇది ఏప్రిల్ 2019-మార్చి 2020లో   266.00 బిలియన్ డాలర్ల  వృద్ధి 29.66% పెరుగుదల కంటే కంటే  ఎక్కువగా 32.62% పెరుగుదల.

వాణిజ్యం  పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం  ప్రజా పంపిణీ  జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపుకు ప్రతిస్పందిస్తూ భారతదేశం నిజంగా ‘స్థానికం నుంచి ప్రపంచ వాణిజ్యానికి’ మళ్లిందని అన్నారు.

భారతదేశం ‘ఆత్మనిర్భర్త’ను సాధిస్తున్న వేగాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలి, అలాగే ప్రతి భారతీయుడు ఈ పురోగతి నుంచి ప్రయోజనం పొందుతాడని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశం ఈ అద్భుతమైన లక్ష్యాన్ని సాధించగలిగిందని ఆయన అన్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేక రికార్డులను నెలకొల్పడానికి సిద్ధంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేసిన శ్రీ గోయల్, భారతదేశం కోసం ప్రధాని మోదీ ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించారని, అలాంటి అపారమైన లక్ష్యాలను సాధించడంలో మన దేశం చాలా సమర్థంగా ఉందని అన్నారు. సాధ్యాసాధ్యాన్ని  సాధ్యమైనదిగా చేయడానికి, దాని కోసం అవిశ్రాంతంగా,  సమిష్టిగా కృషి చేయండి, అన్నారాయన.

మా ఎగుమతిదారుల 'మడమ తిప్ప కూడదు ' అనే స్ఫూర్తి, EPC లు  పరిశ్రమల సంఘం అవిశ్రాంత ప్రయత్నం, వివిధ GOI విభాగాలు  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం 'మొత్తం ప్రభుత్వ విధానాన్ని' ప్రతిబింబించేలా ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాయని శ్రీ గోయల్ అన్నారు.

ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం, ప్రతి రైతు, ప్రతి వ్యవస్థాపకుడు, ప్రతి సూక్ష్మ మధ్య స్థాయి, పెద్ద స్థాయి ఉత్పాదక  సంస్థలు ,  రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాభదాయకమైన లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పనిచేశాయని ఆయన అన్నారు. 2021-22లో భారతదేశపు  విభిన్న ఎగుమతి పోర్ట్‌ ఫోలియో భారతదేశ తయారీ సామర్థ్యాలతో పాటు హైటెక్ వస్తువులు, ఎలక్ట్రానిక్,   వ్యవసాయ ఉత్పత్తులలో వృద్ధిని చూపుతుంది.

ఏప్రిల్-మార్చి 2020-21కన్నా  ఏప్రిల్-మార్చి 2021 2022లో సానుకూల వృద్ధిని నమోదు చేసిన ప్రధాన వస్తువుల ఎగుమతులు పెట్రోలియం ఉత్పత్తులు (152.1%), కాటన్ నూలు/బట్టలు/తయారీ దుస్తులు, చేనేత ఉత్పత్తులు మొదలైనవి (55.1%), ఇతర వస్తువులు. (52,2%), రత్నాలు  ఆభరణాలు (49.6%), మానవ నిర్మిత నూలు/ఫ్యాబ్‌లు/ తయారీ దుస్తులు మొదలైనవి.( 46.9%), ఇంజినీరింగ్ వస్తువులు (45.5%), కాఫీ (49%), ఎలక్ట్రానిక్ వస్తువులు (40.5%), జూట్  ఉత్పాదకత సహా ఫ్లోర్ కవరింగ్ (36.2%), తోలు  సంబంధ (32.2%), ఆర్గానిక్ & ఇనార్గానిక్ రసాయనాలు  (32.0%), ప్లాస్టిక్  లినోలియం (31.1%), సముద్ర ఉత్పత్తులు (30.0%), అన్ని వస్త్రాలు (29.9%), హస్తకళలు మినహాయించి, చేతితో తయారు చేసిన తివాచీలు  (22.0%)  తృణధాన్యాలు,  ఇతర ప్రాసెస్ చేయబడిన వస్తువులు (21.9%) ఏప్రిల్ 2020-మార్చి 2021లో వరుసగా 21.9% సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

2021-22లో ఎగుమతి అయిన  వివిధ రకాల సరుకుల వస్తువులతో పాటు, భారతదేశపు సరుకుల ఎగుమతులు కూడా వివిధ దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలకు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 2020- మార్చి 2021కాలానికి  అమెరికా, అరబ్ దేశాలు, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్, బ్రిటన్, బెల్జియం, జర్మనీలకు ఎగుమతులు వరుసగా 46.4%, 66.9%, 64.5%, 90.5%, 26.8%, 7.8%, 28%, 90.4%  21.1% పెరిగాయి.

కోవిడ్ (2వ, 3వ వేవ్) వరుస సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారతదేశ వాణిజ్య వాణిజ్య పనితీరు అద్భుతమైన వృద్ధిని కనబరిచింది.  ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు వరుసగా పన్నెండు నెలల పాటు ఎగుమతులు  30 బిలియన్ డాలర్ల  కంటే ఎక్కువగా ఉన్నాయని శ్రీ గోయల్ చెప్పారు.

‘లోకల్ టు గ్లోబల్’ అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు  నేడు భారతదేశం ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఇది నాయకత్వ పటిమకు నిదర్శనం. ప్రధాని ఇప్పుడు 'సమగ్ర  దేశ విధానం'పై విస్తృతంగా దృష్టి సారిస్తున్నారు, అని ఆయన అన్నారు.

వ్యవసాయ రంగంలో ఆకట్టుకునే వృద్ధి కనిపించింది. ముఖ్యంగా మహమ్మారి సమయంలో భారతదేశం ఆహారం / అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా  ఉద్భవించింది. వ్యవసాయం ఎగుమతులు   బియ్యం (బాస్మతి  బాస్మతి యేతర రెండూ), సముద్ర ఉత్పత్తులు, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు  పంచదార వంటి వస్తువుల ద్వారా 2021-22లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గా నమోదైంది.

అధిక వ్యవసాయ ఎగుమతులు 1.35 బిలియన్ల జనాభా అవసరాలను తీర్చగల భారతీయ రైతుల సామర్థ్యాన్ని సూచిస్తాయి.  ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి మిగులును ఉత్పత్తి చేస్తాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఏకీకరణ చేయడం వల్ల మన రైతులు మరింత పోటీతత్వం, నాణ్యమైన స్పృహతో  అదే సమయంలో తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలను పొందేందుకు వీలు కల్పిస్తుంది.

మనం  50 బిలియన్ డాలర్ల  వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ఇది సాధ్యమవుతుందని కొందరు మాత్రమే  విశ్వసించారు. అయితే ఈ రోజు కోవిడ్-19 ఉన్నప్పటికీ ఎక్కువ ఉత్పత్తులను పండించిన మన రైతులను నేను అభినందించాలి అనుకుంటున్నాను. ఎగుమతుల పెరుగుదల రైతులకు  శ్రమతో కూడిన రంగాలకు, MSMEలకు సహాయపడింది. ప్రభుత్వం ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని శ్రీ గోయల్ చెప్పారు.

-
ఉక్రెయిన్ యుద్ధంలో దెబ్బతిన్న దేశాలకు గోధుమల సరఫరా భారత్ వేగవంతం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

“ ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో సంఘర్షణ ప్రాంతాల నుంచి సరఫరాలు పొందని దేశాల్లో అవసరాలను తీర్చడానికి మనం పెద్ద ఎత్తున గోధుమలు ఎగుమతి కొనసాగిస్తాము. 2022-23లో మన గోధుమ ఎగుమతులు  10 మిలియన్ టన్నులను  మించే అవకాశం ఉంది. మన రైతులు తదనుగుణంగా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించారు, ”అని ఆయన అన్నారు.

మన  పరిశ్రమలకు  ఎగుమతిదారులకు వారి ఎగుమతి పనితీరును మెరుగుపరచడానికి అనుకూలమైన వాతావరణం  మౌలిక సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తోంది. వారి ప్రయోజనాల కోసం లక్ష్యానికి అనుగుణంగా విధానాలు  పథకాలు ప్రవేశపెట్టారు. అవి  అమలు అవుతున్నాయి. మహమ్మారి ప్రభావిత కాలంలో  కూడా ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు  పన్నుల మినహాయింపులు, RoDTEP  రాష్ట్ర,  కేంద్ర పన్నులు,  లెవీల రాయితీ - ROSCTL నుంచి సజావుగా అనుమతులు రావడం  చర్చనీయాంశంగా నడవాలని ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. వడ్డీ సమానీకరణ పథకం ఎగుమతిదారులకు విస్తరించారు. దీనివల్ల  పెద్ద సంఖ్యలో MSME ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరే  అవకాశం ఉంది.

ఎగుమతులను సులభతరం చేసేందుకు జిల్లా స్థాయిలో ఎగుమతుల అవస్థాపన, రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్ ను రూపొందించేందుకు కృషి చేస్తోందని శ్రీ గోయల్ తెలిపారు.

ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP  ఉత్పత్తి అఆదార ప్రోత్సాహకాల PLIల ద్వారా ప్రతి జిల్లాలో ఎగుమతులపై అవగాహన కల్పించడంలో మనం  విజయం సాధించామని ఆయన చెప్పారు.

భారతదేశం,  పోటీతత్వ ప్రయోజనాలు ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి పరిశ్రమతో సన్నిహిత భాగస్వామ్యంతో పని చేయడం ద్వారా గ్లోబల్ వాల్యూ చైన్‌లలో సమగ్రతను మరింతగా పెంచడం కోసం దేశీయ సామర్ద్యాన్ని పెంపొందించడానికి కఠినమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా తరహాలో ప్రపంచం కోసం మన సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరం  నుంచి ప్రారంభమయ్యే 13 కీలకమైన తయారీ రంగాలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలు ప్రకటించారు.

****



(Release ID: 1813290) Visitor Counter : 300