వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
యుఎఇ వ్యాపారాలకు ఇండియా గమ్యస్థానం- శ్రీ పియూష్ గోయల్
ఇండియా -యుఎయి సంబంధాలను నమ్మకమే తెలియజే్స్తుంది
కోవిడ్ సమయంలో ఒకరి కోసం ఒకరు పనిచేసిన సోదరులం మనం
రండి , చూడండి, ఇండియా- ఎన్నో అవకాశాలుగల దేశం
ఉమ్మడి దార్శనికత యుఎఇలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు సంకల్పానికి దారితీసింది.
Posted On:
30 MAR 2022 10:49AM by PIB Hyderabad
అంతర్జాతీయ వ్యాపారవేత్తలకు ఇండియా అందిస్తున్న అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోవాలని,ఇండియా అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాల ద్వారా ప్రయోజనం పొందాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన వ్యాపార వేత్తలకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ పిలుపునిచ్చారు.
“ తక్కువ ఖర్చు, నమ్మకం వంటి ప్రయోజనాలున్న ఇండియా లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తగిన సమయం. భాగస్వాములుగా, మనం పరస్పరం ఒకరికొకరు ఇతరుల ఆర్థిక భవిష్యత్‌కు పాటుపడడంతోపాటు కోవిడ్ అనంతర ప్రపంచంలో మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవలసి ఉంది ” అని శ్రీ గోయల్ అన్నారు.
దుబాయ్‌ఎక్స్ పో 2020 లో భారత గౌరవ దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ మాటలన్నారు.
మనం ఇప్పుడు వృద్ధి , ప్రగతికి సంబంధించి ఉన్నత స్థితిలో ఉన్నామని నేను నమ్ముతున్నాను. భారతదేశం ప్రతిభ, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అందిస్తుంది. చాలా రంగాలలో, నూరు శాతం ఎఫ్‌డిఐలను అనుమతించడం జరిగింది. ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం , మేక్ ఇన్ ఇండియా పాలసీ వంటి వాటిని, కలిగి ఉన్నాం. పరిశ్రమలను ప్రోత్సహించడానికి మేము అనేక కొత్త కార్యక్రమాలను కలిగి ఉన్నాము, సులభతర వాణిజ్యాన్ని అందించడానికి మేం సాగిస్తున్న ప్రయత్నాలు ఇవి. ఇవన్నీ సులభతర వాణిజ్యానికి ఉపకరిస్తాయి , ”అని ఆయన అన్నారు.
“ అంతర్జాతీయ సమాజానికి నేను ఒక విషయం చెబుతున్నాను. అద్భుత అవకాశాల భూమి అయిన ఇండియాకు రండి. కలసి ఎదుగుదాం.కలిసి పరిస్థితులను మారుద్దాం. కలిసి పరివర్తన సాధిద్దాం. దీనితో మనం ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించవచ్చు. ఎవరూ ఊహించని రీతిలో లక్ష్యాలను చేరుకోవచ్చు.” అని మంత్రి చెప్పారు.
” నవభారతదేశం ఎలాంటి భయాలు లేని దని, ప్రతి భారతీయుడి సుసంపన్నతను దర్శించగలమన్న దృఢవిశ్వాసంతో ఉన్నదని శ్రీ గోయల్ అన్నారు. రాగల 25 సంవత్సరాలలో ఇండియా బలమైన, ,సమ్మిళితత్వంతో ఉంటుందన్నారు.
విశ్వాసం అనే పదానికి ఇండియా- యుఎఇ సంబంధాలే ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇండియా-యుఎఇ మధ్య సంంధాలు నానాటికీ మరింత బలపడుతూ వస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, హిజ్ హై నెస్‌షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ల మధ్యగల ప్రత్యేక భాగస్వామ్యం విశేషమైనదని శ్రీ గోయల్ అన్నారు. ఈ స్నేహ బంధం విశ్వాసానికి ప్రతిరూపమని, ఇరుదేశాల మధ్య గల ఆర్థిక, వాణిజ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఉభయ పక్షాలూ సహజ భాగస్వాములని , వాణిజ్యాన్ని పెంచుకుంటున్నాయని అన్నారు. ఇవి తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్నాయని మంత్రి అన్నారు.
“ మన ఉమ్మడి దార్శనికత నూతన అవకాశాలకు ద్వారం తెరించిందని, ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఐఐటి) ఏర్పాటుకు సంకల్పం చెప్పుకోవడమని ఆయన అన్నారు.
ప్రభుత్వ సహకారం గురించి మాట్లాడుతూ శ్రీ గోయల్, ఉభయ ప్రభుత్వాలు ఒకరి కొకరు మద్దతుగా ఉన్నారన్నారు. మనం సోదరులం. కోవిడ్ సమయంలో ఒకరికొకరు సహకరించుకుంటూ వచ్చాం అని అన్నారు.
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సిపిపిఎ) ఉభయ పక్షాలకూ , ఉభయదేశాల ప్రజలకు ఎంతో మేలు చేసేది అని ఆయన చెప్పారు.
దుబాయ్ ఎక్స్‌పో ఘనవిజయం సాధించడం గురించి ప్రస్తావిస్తూ మంత్రి, ఎక్స్‌పో2020 ప్రతికూల పరిస్థితులపై సాధించిన విజయంగా పియూష్ గోయల్ అన్నారు. సోదరులిరువురూ మరింత సన్నిహత, అపురూ ప అధ్యాయానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని , చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.
ఎక్స్‌పొ ముగిసినా దీని జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని అన్నారు. ఇండియా పెవిలియన్ శాశ్వత నిర్మాణంగా ఉంటుందని అంటూ ఉభయ దేశాలూ ప్రజల సమష్ఠి మేలు కొసం సాగిస్తున్న కృషికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
దుబాయ్ ఎక్స్‌పో 2020లో ఇండియా పెవిలియన్ అత్యంత పెద్ద అద్భుత మైన పెవిలియన్. గత ఏడాది అక్టోబర్ 1న పెవిలియన్ ను ప్రారంభించినప్పటి నుంచచి దీనిని 1.6 మిలియన్ లమందికిపైగా సందర్శించారు. ఇండియా పెవిలియన్‌ను శ్రీ పియూష్ గోయల్ ప్రారంభించారు.
ఎక్స్‌పో 2020 దుబాయ్ మార్చి 31న ముగియనుంది.
ఎక్స్ పో 2020 దుబాయ్ లో ఇండియా పెవిలియన్ గురించి మరింతగా తెలుసుకోవాలంటే దయచేసి చూడండి:
వెబ్‌సైట్-- https://www.indiaexpo2020.com/
ఫేస్‌బుక్ - https://www.facebook.com/indiaatexpo2020/
ఇన్‌స్టాగ్రామ్- https://www.instagram.com/indiaatexpo2020/
ట్విట్టర్ - https://twitter.com/IndiaExpo2020?s=09
లింక్‌డ్ ఇన్ - https://www.linkedin.com/company/india-expo-2020/?viewAsMember=true
యూట్యూబ్ - https://www.youtube.com/channel/UC6uOcYsc4g_JWMfS_Dz4Fhg/featured
కూ- https://www.kooapp.com/profile/IndiaExpo2020
***
(Release ID: 1811860)
Visitor Counter : 185