వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
జూన్ 2021 నుంచి 14 మార్చి 2022వరకు 62.84 ఎల్ఎంటిల పామాయిల్ దిగుమతి
నిరాటంకంగా రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులను 31.12.2022 వరకు పొడిగించిన కేంద్రం
Posted On:
30 MAR 2022 4:06PM by PIB Hyderabad
ఐటిసి హెచ్ఎస్ 15119010, 15119020, 15119090ల కింద 31.12. 2022 వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రిఫైన్డ్ పామాయిల్స్‌ను దిగుమతి చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నెం. 46/ 2015-2020 నోటిఫికేషన్ ను 20 డిసెంబర్ 2021న పొడిగించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబు ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 2021 నుంచి 14 మార్చి 2022వరకు 62.84 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ ను దిగుమతి చేసుకున్నట్టు చెప్పారు.
దేశీయంగా వంట నూనెల అందుబాటును మెరుగుపరిచేందుకు వాటి ధరలను నియంత్రణలో ఉంచేందుకు, ఓపెన్ జనరల్ లైసెన్స్ (ఒజిఎల్) కింద వంట నూనెల దిగుమతిని ప్రభుత్వం అనుమతించింది.
(Release ID: 1811577)