మంత్రిమండలి

ఎం.ఎస్‌.ఎం.ఇ ప‌నితీరును పెంచి , వేగ‌వంతంచేసేందుకు 808 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల మొత్తాన్ని ఆమోదించిన కేంద్ర కేబినెట్‌

Posted On: 30 MAR 2022 2:23PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష్త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ , ఎం.ఎస్‌.ఎం.ఇల ప‌నితీరును పెంచ‌డంతోపాటు, వేగ‌వంతం చేసేందుకు( ఆర్.ఎ.ఎం.పి) 808 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు లేదా 6,062.45 కోట్ల రూపాయ‌ల‌ను  ఆమోదించింది. 2022-23 ఆర్ధిక సంవ‌త్స‌రం నుంచి  కొత్త పథ‌కం ప్రారంభ‌మ‌వుతుంది.
 ఇందుకు అయ్యే ఖ‌ర్చు :
ఈ ప‌థ‌కానికి మొత్తం కేటాయింపుల రూ 6,062.45 కోట్లు లేదా 808 మిలియ‌న్ డాల‌ర్లు. ఇందులో 3750 కోట్ల రూపాయ‌లు లేదా 500 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల మొత్తాన్ని ప్ర‌పంచ బ్యాంకు రుణంగా ఉంటుంది. మిగిలిన రూ 2312.45 కోట్ల రూపాయ‌లు లేదా 308 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల మొత్తాన్ని భార‌త ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తుంది.
అంశాల వారీగా వివ‌రాలు:
ఎం.ఎస్‌.ఎం.ఇల ప‌నితీరు పెంపు, దానిని వేగ‌వంతం చేసే ఆర్‌.ఎ.ఎం.పి కార్య‌క్ర‌మం ప్ర‌పంచ బ్యాంకు స‌హాయంతో చేప‌డుతున్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ ప‌థ‌కం. సూక్ష్మ‌, చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ఎంట‌ర్ ప్రైజెస్ మంత్రిత్వ‌శాఖ ( ఎం ఒ ఎం ఎస్ ఎం ఇ) ఆధ్వ‌ర్యంలో క‌రోనా వైర‌స్ 2019 నుంచి తిరిగి ఆయా సంస్థ‌లు కోలుకునేందుకు, నిల‌దొక్కుకునేందుకు మ‌ద్ద‌తునిచ్చే చ‌ర్య‌ల‌లో భాగంగా దీనిని చేప‌డుతున్నారు.

మార్కెట్ , రుణాల అందుబాటును పెంపొందించేందుకు ఈ కార్య‌క్ర‌మం దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే కేంద్ర , రాష్ట్రాల స్థాయిలో సంస్థ‌ల‌ను ,నిర్వ‌హ‌ణ‌ను బ‌లోపేతం చేసేందుకు ఉప‌క‌రిస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య సంబంధాల‌ను మెరుగుప‌రిచేందుకు, చెల్లింపుల‌లో జాప్యం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు , ఎం.ఎస్.ఎం.ఇ ల‌ను ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌రంగా మార్చేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది.
ఎం.ఒ.ఎం.ఎం.ఎస్‌.ఎం.ఇ సామర్ధ్యాన్ని జాతీయ‌స్థాయిలో పెంపొందించ‌డంతోపాటు, ఆర్‌.ఎ.ఎం.పి కార్య‌క్ర‌మం రాష్ట్రాల‌లో ఎం.ఎస్‌.ఎం.ఇ ల క‌వ‌రేజ్‌ని వాటి సామ‌ర్థ్యం పెంపున‌కు దోహ‌ద‌ప‌డుతుంది.
ఉపాధి క‌ల్ప‌న సామ‌ర్ధ్యం, ఈ కార్య‌క్ర‌మ‌ ప్ర‌ముఖ ప్ర‌భావం,ల‌బ్ధిదారుల సంఖ్య‌:
ఎం.ఎస్‌.ఎం.ఇ రంగం సాధార‌ణంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌తోపాటు, కోవిడ్ సంబంధిత స‌వాళ్ల‌ను  ఎదుర్కొనేందుకు ఆర్.ఎ.ఎం.పి కార్య‌క్ర‌మం ఉప‌క‌రిస్తుంది.  ప్ర‌స్తుత ఎం.ఎస్‌.ఎం.ఇ ప‌థ‌కాల ప్ర‌భావాన్ని మ‌రింత పెంచేందుకు ప్ర‌త్యేకించి వాటి సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. దీనికితోడు ఈ కార్య‌క్ర‌మం, సామ‌ర్ధ్యాల నిర్మాణం, ఆయా సంస్థ‌ల‌కు అండ‌గా ఉండ‌డం, నైపుణ్యాల అభివృద్ధి , నాణ్య‌తా పెంపు, సాంకేతికత స్థాయి పెంపు, డిజిటైజేష‌న్‌, ఔట్‌రీచ్‌, మార్కెటింగ్ ప్ర‌మోష‌న్ త‌దిత‌రాల‌పై దృష్టిపెడుతుంది.

రాష్ట్రాల‌తో మ‌రింత స‌మ‌న్వ‌యం ఏర్ప‌ర‌చుకోవ‌డం ద్వారా ఆర్‌.ఎ.ఎం.పి కార్య‌క్ర‌మం, ఉపాధి క‌ల్పించేదిగా,మార్కెట్ ప్ర‌మోట‌ర్‌గా, ఆర్ధిక‌వెసులుబాటు క‌ల్పించేందిగా, స‌మాజంలోని పేద వ‌ర్గాల‌కు అండ‌గా ఉండేదిగా, ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర చ‌ర్య‌లుతీసుకునేదిగా ఉండ‌నుంది. ఎం.ఎస్‌.ఎం.ఇల ప‌నితీరు త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రాల‌లో ఈ కార్యక్ర‌మం పెద్ద ఎత్తున వాటిని ముందుకు తీసుకువెళ్ల‌నుంది. దీనితో ఆర్ ఎ ఎం పి కిందికి వ‌చ్చే ప‌థ‌కాల ప్ర‌భావం గ‌ణ‌నీయంగా ఉండ‌నుంది. ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసే ఎస్ఐపిలు మెరుగైన ఎం.ఎస్‌.ఎం.ఇ రంగం అభివృద్ధికి రోడ్ మ్యాప్‌గా ప‌నికిరానుంది.

ఆర్‌.ఎ.ఎం.పి  ప‌థ‌కం, ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ మిష‌న్‌కు పూర‌కంగా ఉంటుంది.
. అలాగే ఎం.ఎస్.ఎం.ఇల‌ను పోటీతత్వానికి నిల‌బెట్ట‌డంతోపాటు, స్వావలంబన, ఎగుమతులను మెరుగుపరచడం, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా నిల‌బెట్ట‌డం ,దేశీయ తయారీని ప్రోత్సహించడం వంటి వాటికి అవసరమైన సాంకేతిక స‌దుపాయాల‌ను ఇది స‌మ‌కూరుస్తుంది. ఆ ర‌కంగా ఆర్‌.ఎ.ఎం.పి ఒక విధాన క‌ర్త‌గా ఉంటుంది.
 మెరుగైన సామర్థ్యం ద్వారా  పోటీతత్వం , వ్యాపార స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను స‌మ‌కూర్చ‌డానికి ఉప‌క‌రిస్తుంది. దేశీయ త‌యారీదారుల‌ను ప్రోత్స‌హిస్తుంది. త‌గిన ప్ర‌మాణాల‌ను నిర్దేశించ‌డం ద్వారా నాలెడ్జ్ ప్రొవైడ‌ర్‌గా ఉంటుంది. అంత‌ర్జాతీయ అనుభ‌వాల‌కు అనుగుణంగా ఉత్త‌మ ప‌ని విధానాల‌ను, విజ‌య‌గాధ‌ల‌ను పంచుకుంటుంది.
సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందించేదిగా ఉంటుంది. అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటు లోకి తేవ‌డంతో ఎం.ఎస్‌.ఎం . ఇల రంగంలో సాంకేతిక ప‌రివ‌ర్త‌న కు అత్యున్న‌త కృత్రిమ మేథ‌, డాటా అనాల‌సిస్‌, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), మెషిన్ లెర్నింగ్ కు వీలు క‌లుగుతుంది.

ఆర్‌.ఎ.ఎం.పి కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా ప్ర‌భావాన్ని చూప‌నుంది. ఇది ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా ఎం.ఎస్‌.ఎం.ఇలుగా అర్హ‌త పొందిన‌ 63 మిలియ‌న్ ఎంట‌ర్‌ప్రైజ్‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించ‌నుంది.
ఇందులో 5,55,000 ఎం.ఎస్‌.ఎం.ఇలు ప్ర‌త్యేకించి ప‌నితీరు పెంపున‌కు ల‌క్ష్యంగా నిర్దేశించిన‌వి. దీనికి తోడు ల‌క్షిత మార్కెట్ విస్త‌ర‌ణ‌, తో పాటు సేవ‌ల రంగం,. 70,500 మ‌హిళా ఎం.ఎస్‌.ఎం. ఇల విస్త‌ర‌ణ ఉన్నాయి.
అమ‌లు వ్యూహం, ల‌క్ష్యాలు:
ఈ కార్య‌క్ర‌మం ఫ‌లితాలు ఇచ్చే రెండు అంశాల‌ను గుర్తించింది. అవి 1) ఎం.ఎస్.ఎం.కి కార్య‌క్ర‌మ సంస్థ‌లు, వాటి పాల‌న‌ను బ‌లోపేతం చేయ‌డం, 2) మార్కెట్ అందుబాటుకు మ‌ద్దతు ఇవ్వ‌డం, ప‌టిష్ట‌మైన సామ‌ర్ధ్యం ఉండేలా చూడ‌డంతోపాటు ఆర్థిక వ‌న‌రుల అందుబాటుకు తోడ్ప‌డ‌డం.
ఇందుకు సంబంధించిన నిధులు ఆర్‌.ఎ.ఎం.పి ద్వారా మంత్రిత్వ‌శాఖ బ‌డ్జెట్‌లోకి వ‌స్తాయి. వాటిని పంపిణీ ఆధారిత సూచిక‌లు (డిఎల్ఐ) ల ఆధారంగా ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఎం.ఒ.ఎం.ఎస్‌.ఎం.ఇ కార్య‌క్ర‌మాల‌కు మద్ద‌తు నివ్వ‌డం జ‌రుగుతుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ అందుబాటు, పోటీత‌త్వంపై దృష్టిపెట్ట‌డం జ‌రుగుతుంది.
ఆర్ ఎ ఎం పి కి  ప్ర‌పంచ బ్యాంకు నిధుల పంపిణీని కిందివిధంగా పంపిణీ ఆధారిత సూచిక‌ల‌కు అనుగుణంగా విడుద‌ల చేయ‌డం జ‌రుగుతుంది.
-జాతీయ ఎం.ఎస్‌.ఎం.ఇ సంస్క‌ర‌ణ‌ల అజెండా అమ‌లు
-ఎం.ఎస్‌.ఎం.ఇ రంగం వేగ‌వంతంగా పుంజుకొవ‌డానికి కేంద్ర -రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం
-సాంకేతిక ఉన్న‌తీక‌ర‌ణ ప‌థ‌కం స‌మ‌ర్ధ‌త పెంపు (సిఎల్‌సిఎస్‌- టియుఎస్‌)
- ఎం.ఎస్‌.ఎం. ఇ మార్కెట్‌కు అందుబాటు అయ్యే ఫైనాన్సింగ్‌ను బ‌లోపేతం చేయ‌డం.
- సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా సంస్థ‌ల‌కు సంబంధించి (సిజిటిఎస్ంఎస్ ఇ) క్రెడిట్ గ్యారంటీ స‌మ‌ర్ధ‌త పెంపు, ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర ఏర్పాటు, స్త్రీ పురుష స‌మాన‌త్వం
-చెల్లింపుల జాప్యం నివార‌ణ‌
- ఆర్ ఎ ఎం పిలో ప్ర‌ధాన‌మైన అంశం, వ్యూహాత్మ‌క పెట్టుబ‌డి ప్ర‌ణాళికల రూప‌క‌ల్ప‌న‌. ఇందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను ఆహ్వానించ‌డం జ‌రుగుతుంది.
ఎస్‌.ఐ.పి లో ఔట్ రీచ్ ప్ర‌ణాళిక‌,ఆర్ ఎ ఎం పి కింద ఎం.ఎస్‌.ఎం.ఇల గుర్తింపు, కీల‌క అడ్డంకుల గుర్తింపు, లక్ష్యాల ఏర్పాటు, అవ‌స‌ర‌మైన బ‌డ్జెట్ ల గుర్తింపు, ప్రాధాన్య‌తా రంగాల‌లో అంటే పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు, గ్రామీణ‌, నాన్‌ఫార్మింగ్ వ్యాపారం, హోల్ సేల్ , రిటైల్ ట్రేడ్‌, గ్రామీణ‌, కుటీర ప‌రిశ్ర‌మ‌లు, మ‌హిళా సంస్థ‌లు వంటివి ఉన్నాయి.

ఆర్‌.ఎ.ఎం.పికి సంబంధించి మొత్తంగా ప‌ర్య‌వేక్ష‌ణ‌, విధాన ప‌రిశీల‌న‌ను జాతీయ ఎం.ఎస్‌.ఎం.ఇ ఉన్న‌త స్థాయి కౌన్సిల్ ప‌ర్య‌వేక్షిస్తుంది. దీనికి ఎం.ఎస్‌.ఎం.ఇ మంత్రి నాయ‌క‌త్వం వ‌హిస్తారు. వివిధ మంత్రిత్వ‌శాఖల ప్ర‌తినిధులు ఈ కౌన్సిల్ లో ఉంటారు. ఇందుకు అవ‌స‌ర‌మైన సెక్ర‌టేరియ‌ట్ ఉంటుంది. ఎం.ఒ.ఎం.ఎస్‌.ఎం.ఇ కి చెందిన కార్య‌ద‌ర్శి నాయ‌క‌త్వంలో ఆర్ ఎ ఎం పి కార్య‌క్ర‌మ అమ‌లు క‌మిటీ ఉంటుంది. ఇది ఆర్ ఎ ఎంపి ల‌క్ష్యాల‌కు అనుగుణంగా కార్య‌క్ర‌మాల‌ను అమ‌లును ప‌ర్య‌వేక్షిస్తుంది.దీనికి తోడు, రోజువారీగా ఈ ప‌థ‌కం అమ‌లుచేసేందుకు జాతీయ స్థాయిలో , రాష్ట్ర స్థాయిలో ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ యూనిట్లు ఉంటాయి. ఇందులో వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెష‌న‌ల్స్‌, ప‌రిశ్ర‌మ‌నుంచి ఎంపిక చేసిన వారిని ఎం.ఒ.ఎం.ఎస్‌.ఎం.ఇకి , రాష్ట్రాల‌కు మ‌ద్ద‌తుగా ఏర్పాటు చేస్తారు. ఇది ఆర్‌.ఎ.ఎం.పి కార్య‌క్ర‌మ అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, మ‌దింపును చేస్తుంది.

వ‌ర్తించే రాష్ట్రాలు, జిల్లాలు:
 అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను ఎస్‌.ఐ.పి రూప‌క‌ల్ప‌న‌కు ఆహ్వానించ‌డం జ‌రుగుతుంది. ఎస్‌.ఐ.పి కింద రూపొందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మ‌దింపు చేసిన అనంత‌రం వాటి ఆధారంగా నిధులు స‌మ‌కూర్చ‌డం జ‌రుగుతుంది.
ఫండింగ్ అనేది నిష్పాక్ష‌కి ఎంపిక ఆధారంగా ఉంటుంది. ఎస్ఐపి మ‌దింపు, అనుమ‌తి మంజూరు అనేవి ఎం.ఒ.ఎం.ఎస్.ఎం.ఇ
నేప‌థ్యం:
ఆర్‌.ఎ.ఎంపిన,  భార‌త ప్ర‌భుత్వం రూప‌క‌ల్ప‌న‌చేసి ప్ర‌తిపాదించిన కార్య‌క్ర‌మం. ఇది ఎం.ఎస్‌.ఎం.ఇల‌ను బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన‌ది. యు.కె.సిన్హా క‌మిటీ, కెవి కామ‌త్ క‌మిటీ, ప్ర‌ధాన‌మంత్రికి ఆర్థిక వ్య‌వ‌హారాల మండ‌లి (పిఎంఇఎసి) చేసిన సిఫార్సుల‌కు అనుగుణంగా రూప‌క‌ల్ప‌న చేయ‌బ‌డిన‌ది.

ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం (డిఇఎ) త‌న 97 వ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో  ఆర్‌.ఎ.ఎం.పిపై ప్రాథ‌మిక నివేదిక‌ను ఆమోదించింది. ఆత‌ర్వాత దీనిపై రాష్ట్రాలు, ఇత‌ర స్టేక్ హొల్డ‌ర్ల‌తో విస్తృత సంప్ర‌దింపులు చేప‌ట్ట‌డం జ‌రిగింది. సాంకేతిక ఇత‌ర అంచ‌నాల‌ను ప్ర‌పంచ‌బ్యాంక్ చేప‌ట్టింది. అనంత‌రం వ్య‌య ఆర్థిక క‌మిటీ (ఇఎఫ్‌సి) దీనికి సంబంధించి ఒక నోట్ రూపొందించి, సంబంధిత మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాల‌కు పంపి వారి అభిప్రాయాలు కోరింది. ఇఎఫ్‌సి ఈ నోట్‌పై  2021 మార్చి 18న జ‌రిగిన స‌మావేశంలో చ‌ర్చించి ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను కేబినెట్ ప‌రిశీల‌న‌కు నివేదించింది.

 

***



(Release ID: 1811572) Visitor Counter : 257