జల శక్తి మంత్రిత్వ శాఖ
2022 మార్చి 29న 3వ జాతీయ జల అవార్డుల విజేతలను సత్కరించనున్న రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్
ఉత్తమ రాష్ట్ర కేటగిరీలో వరుసగా మొదటి, రెండవ మరియు తృతీయ బహుమతులు సాధించిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలు
నవంబర్ 2022 వరకు కొనసాగే క్యాచ్ ది రెయిన్ 2022 ప్రచారాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి
Posted On:
28 MAR 2022 5:54PM by PIB Hyderabad
[ కర్టెన్ రైజర్]
భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ 29 మార్చి 2022న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 3 వ జాతీయ జల అవార్డుల విజేతలను సత్కరిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి జలశక్తి అభియాన్ నిర్వహించనున్న క్యాచ్ ది రెయిన్ ప్రచారం 2022ని కూడా ప్రారంభిస్తారు. క్యాచ్ ది రెయిన్ ప్రచారం ఈ సంవత్సరం 30 నవంబర్ 2022 వరకు అమలు చేయబడుతుంది.
కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, జలశక్తి సహాయ మంత్రులు శ్రీ బిశ్వేశ్వర్ తుడు మరియు శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ కుమార్ మరియు తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి శ్రీ విని మహాజన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ప్రజలు నీటి వనరుల నిర్వహణ పట్ల సమగ్ర విధానాన్ని అవలంబించే అంశాన్ని ప్రోత్సహించి అన్ని వర్గాల్లో ఈ అంశంపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో సమగ్ర జాతీయ నీటి అవార్డులు అందించాలని నిర్ణయించారు. నీటి ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు సమర్థవంతమైన నీటి నిర్వహణలో ఉత్తమ పద్ధతులు అవలంబించడానికి ఈ అవార్డులు స్ఫూర్తి కలిగించేందుకు దోహదపడతాయి.
జలశక్తి మంత్రిత్వ శాఖ 2018లో మొదటి జాతీయ నీటి అవార్డును ప్రారంభించింది. దేశంలో ఉత్తమ నీటి వనరుల నిర్వహణ పద్ధతులను ఎలా అవలంబించాలన్న అంశంపై సీనియర్విధాన రూపకర్తలతో చర్చలు జరిపేందుకు మరియు చర్చించేందుకు ప్రముఖ సంస్థలకు, అంకుర సంస్థలకు జాతీయ నీటి అవార్డులు మంచి అవకాశాన్ని అందించాయి.
రాష్ట్రాలు, సంస్థలు, వ్యక్తులు మొదలైన 11 విభిన్న విభాగాలలో జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ 57 అవార్డులు అందిస్తున్నాయి. ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ పట్టణ స్థానిక సంస్థ, ఉత్తమ మీడియా (ప్రింట్ ఎలక్ట్రానిక్), ఉత్తమ పాఠశాల, ఉత్తమ సంస్థ/గ్రామీణ నీటి సంస్థ, /మతపరమైన సంస్థ, ఉత్తమ పరిశ్రమ, ఉత్తమ స్వచ్చంధ సేవా సంస్థ , ఉత్తమ నీటి వినియోగదారు సంఘం మరియు సిఎస్ఆర్ కార్యాచరణ కోసం ఉత్తమ పరిశ్రమ, ప్రచార వినియోగం వర్గాలలో అవార్డులు అందిస్తున్నారు. దేశంలోని వివిధ జోన్‌ల కోసం ఉప-వర్గాలను కలిగి ఉన్నాయి. వివిధ విభాగాల్లో అవార్డు విజేతలకు ప్రశంసా పత్రం, ట్రోఫీ, నగదు బహుమతి అందజేస్తారు.
ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలు వరుసగా ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు పొందాయి. విజేతల్లో జల వనరుల నిర్వహణలో ఆదర్శప్రాయమైన కృషి చేశారు. అవార్డులు భారతదేశంలో జల వనరుల వినియోగంలో ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లో సహాయపడతాయని భావిస్తున్నారు.
'జల్ సమృద్ధి భారత్' సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే అంశంలో దేశవ్యాప్తంగా వ్యక్తులు మరియు సంస్థలు దృష్టి సారించేలా చూసేందుకు ఈ అవార్డులు తమ వంతు సహకారాన్ని అందించి ఈ అంశంపై దృష్టి సారిస్తాయి. నీటి వనరుల నిర్వహణ కార్యకలాపాలలో మరింత ఎక్కువగా ప్రజలు, సంస్థలు పాల్గొనేలా చూసి బలమైన ప్రజా భాగస్వామ్యాన్ని మరింత సుస్థిరం చేయడానికి ఈ అవార్డులు అవకాశాన్ని అందిస్తాయి.
నీటి సంరక్షణ మరియు నిర్వహణ కోసం 2019లో జలశక్తి అభియాన్ జాతీయ కార్యక్రమంగా అమల్లోకి వచ్చింది. దేశంలోని 256 జిల్లాల్లోని 1,592 నీటి ఒత్తిడి ఉన్న బ్లాక్‌లలో అమలు చేయబడింది. క్యాచ్ ద రెయిన్, అక్కడ అది ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్ అనే ప్రచారాన్ని జల్ శక్తి అభియాన్-II కింద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 22 మార్చి 2021న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. రుతుపవనాలు మరియు రుతుపవనాల కాలం, అంటే మార్చి 2021 నుంచి నవంబర్ 30, 2021 వరకు ఇది దేశంలోని అన్ని జిల్లాలలో (గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు) చేపట్టబడింది. జాతీయ నీటి మిషన్ నేతృత్వంలో అమలు జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. 2021 మార్చి 22 న ప్రారంభించినప్పటి నుంచి 31 డిసెంబర్ 2021 వరకు, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలు రెండూ కలిపి, 36 కోట్లకు పైగా మొక్కల పెంపకం పనులతో పాటు మొత్తం 46 లక్షలకు పైగా నీటి సంబంధిత పనులు పూర్తయ్యాయి/కొనసాగుతున్నాయి, కార్యక్రమంలో భాగంగా 43,631 శిక్షణా కార్యక్రమాలు/కిసాన్ మేళాలు నిర్వహించబడ్డాయి. 306 జల శక్తి కేంద్రాలు స్థాపించబడ్డాయి.ఒక్క మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మాత్రమే కార్యక్రమాలను మేలు చేసేందుకు 65000 కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయడం జరిగింది. నీటి సంరక్షణ సంబంధిత పనులతో పాటు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఇప్పటికే ఉన్న నీటి వనరులు/నిర్మాణాల గుర్తించి, జిఐఎస్ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా నీటి వనరుల జాబితా రూపొందించడం జరిగింది.
జల్ శక్తి అభియాన్: స్ప్రింగ్ షెడ్ అభివృద్ధి, నీటి పరీవాహక ప్రాంతాల రక్షణ, నీటి రంగంలో లింగ ప్రధాన స్రవంతి వంటి కొన్ని నూతన అంశాలు క్యాచ్ ది రైన్ 2022లో జోడించబడ్డాయి. లింగ ప్రధాన స్రవంతి నీటి పాలన/పరిరక్షణ మరియు నిర్వహణలో మహిళల పాత్ర ఎక్కువగా ఉండేలా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసే భాద్యతను చేపడతాయి. ఇవి విజ్ఞాన కేంద్రాలుగా నీటి సంబంధిత సమస్యలు/సమస్యలన్నింటికీ వన్ స్టాప్ పరిష్కారాన్ని అందిస్తాయి. సాధ్యమైనంత త్వరగా జిల్లా నీటి సంరక్షణ ప్రణాళిక రూపకల్పనకు అవసరమైన సహకారాన్ని అందిస్తాయి. రూపొందిస్తాయి. దేశంలోని అన్ని నీటి వనరులను ఈ ఏడాది ప్రచారం కింద గుర్తించి జాబితా సిద్ధం చేయడం అది పెద్ద విజయం అవుతుంది.
ప్రచారం ప్రారంభం సందర్భంగా సర్పంచ్‌లందరూ ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి గ్రామంలోని ప్రజలతో జల శపథం చేయిస్తారు. "జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్" ప్రచారాన్ని విజయవంతంగా అమలు చేయడం అట్టడుగు స్థాయిలో స్థానిక ప్రజల చురుకైన భాగస్వామ్యం ప్రధాన అంశంగా ఉంటుంది, క్షేత్ర స్థాయిలో ప్రజలు నీటి సంరక్షణలో చురుకుగా పాల్గొనడం ద్వారా నీటి కొరత సమస్యలను తగ్గించడానికి "నీటి యోధులు" అవుతారు. నీటి సంరక్షణ ఆస్తులకు యజమానులుగా పని చేస్తూ వాటిని నిర్వహించడం జరుగుతుంది. స్థానిక ప్రజలను “మార్గ దర్శక్”గా తీర్చి దిద్దడంలో జిల్లా మేజిస్ట్రేట్ మరియు గ్రామ సర్పంచ్‌లు కీలక పాత్ర పోషిస్తారు. “జల శక్తి కోసం జనశక్తి” లక్ష్య సాధనలో నీటి సంరక్షణలో ప్రతి వ్యక్తి చురుకైన పాత్ర పోషించి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గోవలసి ఉంటుంది.
(Release ID: 1810860)
Visitor Counter : 206