ప్రధాన మంత్రి కార్యాలయం

2022 మార్చి నెల 27 వ తేదీనాటి ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లోమాట ’) కార్యక్రమం 87 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 27 MAR 2022 11:30AM by PIB Hyderabad
  • ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనత ను సాధించాం. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్, అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థ కు సంబంధించిన అంశం అని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ గా ఇది భారతదేశం యొక్క సామర్థ్యానికి, భారతదేశం యొక్క శక్తి కి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుంచి ఎగుమతుల విలువ 100 బిలియన్ డాలర్, కొన్నిసార్లు 150 బిలియన్ డాలర్, మరికొన్నిసార్లు 200 బిలియన్ డాలర్ గా ఉండేది, మరి ఇప్పుడు, భారతదేశం 400 బిలియన్ డాలర్ స్థాయి కి చేరుకొంది. భారతదేశం లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ ప్రపంచవ్యాప్తం గా పెరుగుతోందని దీని కి అర్థం. అలాగే భారతదేశం సరఫరా గొలుసు రోజురోజు కు బలపడుతోందని కూడా దీని కి అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం సైతం ఉంది. కల ల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధి తో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారం అవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలల కంటే సంకల్పాలు, ప్రయత్లు పెద్దవి గా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.

సహచరులారా, దేశం లోని నలు మూలల నుంచి కొత్త ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి. అసమ్ లోని హైలాకండి నుంచి తోలు ఉత్పత్తులు కావచ్చు లేదా ఉస్మానాబాద్ నుంచి చేనేత ఉత్పత్తులు కావచ్చు, బీజాపుర్ నుంచి పండ్లు, కూరగాయలు కావచ్చు లేదా చందౌలీ కి చెందిన నల్ల బియ్యం కావచ్చు.. వాటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇప్పుడు లద్ధాఖ్‌ లోని ప్రపంచ ప్రసిద్ధ ఏప్రికోట్ దుబయి లో కూడా దొరుకుతుంది. తమిళ నాడు నుంచి పంపిన అరటి పండ్లు సౌదీ అరేబియా లో కూడా లభిస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త ఉత్పత్తుల ను కొత్త కొత్త దేశాల కు పంపడం గొప్ప విషయం. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌ లోని హిమాచల్‌ లో పండిన చిరుధాన్యాలు తొలి విడతగా డెన్మార్క్ కు ఎగుమతి అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌ లోని కృష్ణా, చిత్తూరు జిల్లా ల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లను దక్షిణ కొరియా కు ఎగుమతి చేశారు. త్రిపుర నుంచి తాజా పనసపండ్లను విమానం లో లండను కు ఎగుమతి చేశారు. నాగాలాండ్‌ కు చెందిన రాజా మిర్చ్ ను మొదటిసారి గా లండను కు పంపారు. అదేవిధం గా మొదటి దశలో భాలియా గోధుమలు గుజరాత్ నుంచి కెన్యా కు, శ్రీ లంక కు ఎగుమతి అయ్యాయి. అంటే ఇప్పుడు ఇతర దేశాల కు వెళ్లారంటే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు గతం లో కంటే ఎంతో ఎక్కువ గా కనిపిస్తాయన్నమాట.

 

సహచరులారా, ఈ జాబితా చాలా పొడవు గా ఉందో, అంతే పెద్దది గా మేక్ ఇన్ ఇండియా యొక్క శక్తి కూడా ఉందన్నమాట. భారతదేశం సామర్థ్యం విరాట్ గా ఉంది. దాని సామర్థ్యానికి ఆధారం మన రైతులు, మన చేతివృత్తుల వారు, మన నేత కార్మికులు, మన ఇంజీనియర్ లు, మన చిన్న నవపారిశ్రామికవేత్త లు, మన ఎమ్ఎస్ఎమ్ఇ రంగం, అనేక విభిన్న వృత్తుల కు చెందిన వ్యక్తులు. ఈ రంగాలు, ఈ వృత్తులు, ఈ రంగాల లోని వ్యక్తులు దేశాని కి నిజమైన బలం. వారి కృషి కారణం గా 400 బిలియన్ డాలర్ ఎగుమతి లక్ష్యం సాధ్యమైంది. భారతదేశం ప్రజల యొక్క ఈ శక్తి ఇప్పుడు ప్రపంచం లోని ప్రతి మూల లో కొత్త బజారుల ను చేరుకోవడం నాకు సంతోషం గా ఉంది. ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తుల కోసం నినదిస్తే మన స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. రండి.. స్థానికత ను ప్రపంచవ్యాప్తం చేద్దాం. మన ఉత్పత్తుల ప్రతిష్ఠ ను మరింత పెంచుదాం.

 

సహచరులారా, స్థానిక స్థాయి లో మన చిన్న వ్యాపారవేత్తల విజయం మనలో గర్వాన్ని నింపబోతోందని తెలుసుకొని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క శ్రోత లు సంతోషిస్తారు. ఈ రోజు న మన చిన్న నవ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ అంటే జిఇఎమ్ మాధ్యమం ద్వారా ప్రభుత్వ కొనుగోళ్ల లో పెద్ద పాత్ర ను పోషిస్తున్నారు. సాంకేతిక విజ్ఞ‌ానం ద్వారా చాలా పారదర్శకమైన వ్యవస్థ ను అభివృద్ధి చేయడమైంది. గత సంవత్సర కాలం లో జిఇఎమ్ పోర్టల్ మాధ్యమం ద్వారా ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువుల ను కొనుగోలు చేసింది. దేశం లోని నలు మూలల నుంచి దాదాపు 1.25 లక్షల మంది చిన్న వ్యాపారులు, చిన్న నవపారిశ్రామిక వేత్తలు, చిన్న దుకాణదారులు వారి వస్తువుల ను నేరు గా ప్రభుత్వాని కి విక్రయించారు. ఒకప్పుడు పెద్ద కంపెనీ లు మాత్రమే ప్రభుత్వానికి వస్తువుల ను విక్రయించేవి. కానీ ఇప్పుడు దేశం మారుతోంది- పాత వ్యవస్థ లు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చిన్న దుకాణదారు కూడా జిఇఎమ్ పోర్టల్‌ ద్వారా తన వస్తువుల ను ప్రభుత్వాని కి విక్రయించవచ్చును – ఇదే కదా న్యూ ఇండియా. ఇది పెద్దవైన కలల ను కనడం ఒక్కటే కాకుండా, ఇంతకు ముందు ఎవరూ చేరుకోనటువంటి లక్ష్యాన్ని చేరుకొనే సాహసాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఇదే సాహసం యొక్క బలం తో మన భారతీయులం అందరం కలసి స్వయం సమృద్ధి యుక్త భారతదేశం తాలూకు కల ను కూడాను నెరవేర్చి తీరుతాం.

 

నా ప్రియమైన దేశవాసులారా, మీరు ఇటీవల జరిగిన పద్మ పురస్కారాల ప్రదాన వేడుక లో బాబా శివానంద్ జీ ని తప్పక చూసి ఉంటారు. 126 ఏళ్ల పెద్దాయన లోని చురుకుతనాన్ని గమనించి, నా మాదిరి గానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యచకితులు అయి ఉంటారు. రెప్పపాటు లో ఆయన నంది ముద్ర లో నమస్కరించారు. నేను కూడా బాబా శివానంద్ జీ కి శిరసు వంచి పదే పదే నమస్కరించాను. 126 ఏళ్ల వయస్సు, మరి బాబా శివానంద్ యొక్క శరీర పాటవం- రెండూ కూడా, ప్రస్తుతం దేశం లో చర్చనీయ అంశాలు గా ఉన్నాయి. బాబా శివానంద్ వారి వయస్సు కంటే నాలుగు రెట్లు తక్కువ వయస్సు కన్నా కూడా ఎక్కువ ఫిట్ గా ఉన్నారు అంటూ సామాజిక మాధ్యమాల లో చాలా మంది వ్యాఖ్యానించడం నేను చూశాను. నిజాని కి బాబా శివానంద్ జీవనం మనందరి కి ప్రేరణ ను అందించేటటువంటిది. ఆయన కు దీర్ఘాయుష్షు కలగాలి అంటూ నేను ఆకాంక్షిస్తున్నాను. ఆయన లో యోగ అంటే ఒక ఉద్వేగం ఉంది మరి ఆయన చాలా ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి ని గడుపుతున్నారు.

జీవేమ శరదః శతమ్|

మన సంస్కృతి లో ప్రతి ఒక్కరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా జీవించాలి అంటూ శుభకామన ను ఇవ్వడం జరుగుతుంటుంది. మనం ఏప్రిల్ 7వ తేదీ న ‘ప్రపంచ ఆరోగ్య దినం' ను జరుపుకొంటాం. ఇప్పుడు ప్రపంచం అంతటా ఆరోగ్యం విషయం లో భారతీయ చింతన.. అది యోగ కావచ్చు, లేదా ఆయుర్వేదం కావచ్చు.. వాటి పట్ల మొగ్గు పెరుగుతూ పోతోంది. గత వారం కతర్‌ లో యోగ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మీరు చూసే ఉంటారు. ఇందులో 114 దేశాల పౌరులు పాలుపంచుకొని, ఒక సరికొత్త ప్రపంచ రికార్డు ను సృష్టించారు. అదేవిధం గా ఆయుష్ పరిశ్రమ యొక్క బజారు కూడా అదే పని గా పెరుగుతున్నది. 6 సంవత్సరాల క్రితం ఆయుర్వేదాని కి సంబంధించిన మందుల బజారు విలువ దాదాపు గా 22 వేల కోట్ల రూపాయలు ఉంది. ప్రస్తుతం ఆయుష్ తయారీ పరిశ్రమ సుమారు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయల కు చేరుకుంటున్నది. అంటే, ఈ రంగం లో అవకాశాలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. స్టార్ట్ -అప్ జగతి లో కూడాను, ఆయుష్ అనేది ఆకర్షణీయమైనటువంటి విషయం గా మారుతున్నది.

 

సహచరులారా, ఆరోగ్య రంగం లోని ఇతర స్టార్ట్ -అప్ ల గురించి నేను ఇంతకు ముందు చాలా సార్లు మాట్లాడాను. కానీ ఈసారి ప్రత్యేకం గా ఆయుష్ స్టార్ట్-అప్‌ ల గురించి మీతో మాట్లాడుతాను. ఇందులో ఒక స్టార్ట్ -అప్ ‘కపివా’. దాని అర్థం దాని పేరు లోనే ఇమిడి ఉంది. ఇందులో క అంటే కఫాన్ని సూచిస్తుంది; ఇక పి అంటే పిత్తం, వా అంటే వాతం అని సూచ్యార్థాలు. ఈ స్టార్ట్-అప్‌ మన సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యకరమైన భోజ్య అలవాటుల పైన ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద హెల్థ్ కేర్ ఇకోసిస్టమ్‌ లో ఒక ప్రత్యేకమైన భావన అయినటువంటి నిరోగ్- స్ట్రీట్ అనే మరో స్టార్ట్- అప్‌ కూడా ఉంది. దీని సాంకేతిక విజ్ఞ‌ానం ఆధారితమైన ప్లాట్ ఫార్మ్ , ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ఆయుర్వేద వైద్యుల ను నేరు గా ప్రజల తో జోడిస్తుంది. 50 వేల మంది కి పైగా అభ్యాసకులు ఈ స్టార్ట్- అప్‌ తో జతపడి ఉన్నారు. అదేవిధం గా, సంపూర్ణ ఆరోగ్య రంగంలో ఆత్రేయ ఇన్నోవేశన్స్ అనే మరో హెల్థ్ కేర్ టెక్నాలజీ స్టార్టప్‌ కూడా పనిచేస్తోంది. ఇగ్జోరియల్ (Ixoreal) ఒక్క అశ్వగంధ ను వాడడాన్ని గురించిన అవగాహన ను విస్తరింపచేయడమే కాక, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తి ప్రక్రియ పైన కూడా భారీ మొత్తాన్ని పెట్టుబడి గా పెట్టింది. క్యూర్ వేద అయితే మూలిక ల తాలూకు ఆధునిక పరిశోధన మరియు సంప్రదాయ జ్ఞానాల మేళనం ద్వారా సంపూర్ణ జీవనానికై ఆహార అనుబంధ పదార్ధాల ను రూపొందించింది.

సహచరులారా, ఇప్పటివరకు కొన్ని పేర్లను మాత్రమే నేను వల్లించాను. ఈ జాబితా చాలా పెద్దది గా ఉంది. ఇది భారతదేశం లోని యువ నవపారిశ్రామికవేత్తల కు, భారతదేశం లో ఏర్పడుతున్న కొత్త అవకాశాల కు ప్రతీక గా ఉంది. ఆరోగ్య రంగం లోని స్టార్ట్-అప్‌ స్, ముఖ్యం గా ఆయుష్ స్టార్ట్-అప్‌ స్ ను ఒక విషయం కోరుతున్నాను. మీరు ఆన్ లైన్‌ లో ఏ పోర్టల్‌ ను తయారు చేసినా, ఏ కంటెంట్‌ ను సృష్టించినా దానిని ఐక్య రాజ్య సమితి గుర్తించిన అన్ని భాషల లోను రూపొందించడానికి ప్రయత్నించండి. ఇంగ్లిషు అంతగా మాట్లాడని, ఇంగ్లిషు భాష అర్థం కాని దేశాలు ప్రపంచం లో చాలా ఉన్నాయి. అటువంటి దేశాల ను కూడా దృష్టి లో పెట్టుకొని మీ సమాచారాన్ని ప్రచారం చేయండి. భారతదేశం నుంచి మెరుగైన నాణ్యమైన ఉత్పత్తుల తో ఆయుష్ స్టార్ట్-అప్‌ స్ త్వరలో ప్రపంచం అంతటా విస్తరించగలవని నేను ఖచ్చితం గా అనుకుంటున్నాను.

సహచరులారా, ఆరోగ్యానికి నేరు గా పరిశుభ్రత తోనూ ప్రత్యక్ష సంబంధం ఉంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో పరిశుభ్రత కోసం కృషి చేసే వారి ప్రయత్నాలను మనం ఎప్పుడూ ప్రస్తావించుకొంటున్నాం. అటువంటి స్వచ్ఛాగ్రహుల లో ఒకరు చంద్రకిశోర్ పాటిల్ గారు. ఆయన మహారాష్ట్ర లోని నాసిక్‌ లో నివసిస్తున్నారు. పరిశుభ్రత విషయం లో చంద్రకిశోర్ గారి సంకల్పం చాలా లోతైంది. గోదావరి నది పక్కనే ఉంటూ నది లో చెత్త వేయకుండా ప్రజల ను ఆయన నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా నది లో చెత్త వేస్తుంటే గనక వెంటనే ఆపుతారు. చంద్రకిశోర్ జీ ఈ పని లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నది లో విసిరేందుకు ప్రజలు తెచ్చిన అటువంటి వస్తువులన్నీ సాయంత్రానికి ఆయన దగ్గర కు చేరుతాయి. చంద్రకిశోర్ గారు చేసిన ఈ ప్రయత్నం అవగాహనను కూడా పెంచుతుంది. స్ఫూర్తి ని కూడా ఇస్తుంది. అదేవిధం గా, మరొక స్వచ్ఛాగ్రహి – ఒడిశా లో పురీ కి చెందిన రాహుల్ మహారాణా గారు. రాహుల్ గారు ప్రతి ఆదివారం తెల్లవారుజాము న పురీ లోని పుణ్యక్షేత్రాల కు వెళ్లి అక్కడ ప్లాస్టిక్ చెత్త ను శుభ్రం చేస్తుంటారు. ఇప్పటి వరకు వందల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల ను, మురికి ని శుభ్రం చేశారు. పురీ లో రాహుల్ గారు అయినా, నాసిక్‌ కి చెందిన చంద్రకిశోర్ గారు అయినా మనకు చాలా నేర్పుతారు. పరిశుభ్రత, పోషకాహారం లేదా టీకాకరణ - ఇలా సందర్భం ఏదైనా పౌరులు గా మనం మన విధుల ను నిర్వహించాలి. ఈ ప్రయత్నాలు అన్నీ ఆరోగ్యం గా ఉండడానికి మనకు సహాయపడతాయి.

 

నా ప్రియమైన దేశవాసులారా, కేరళ కు చెందిన ముపట్టమ్ శ్రీ నారాయణన్ గారి ని గురించి మాట్లాడుకొందాం. ఆయన ఒక పథకాన్ని ఆరంభించారు. ఆ ప్రాజెక్టు పేరు ‘జీవించేందుకు అవసరం అయ్యే నీటి కోసం కుండలు’. ఆ పథకాన్ని గురించి మీకు తెలిస్తే, ఇది ఎంత అద్భుతమైన పనో కదా అని మీరు అనుకొంటారు.

 

సహచరులారా, ముపట్టమ్ శ్రీ నారాయణన్ గారు ఎండ కాలం లో పశు పక్ష్యాదుల కు నీటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండడానికి గాను మట్టి కుండల ను పంపిణీ చేసేందుకు ప్రచార ఉద్యమాన్ని నడుపుతున్నారు. వేసవి లో జంతువులు, పక్షుల సమస్య ను చూసి ఆయన కలత చెందారు. అలాంటప్పుడు ఆ కుండల లో నీళ్ల ను నింపే పని ఒక్కటే ఇతరుల కు ఉండేటట్టు స్వయంగా మట్టి కుండల పంపిణీ ఎందుకు ప్రారంభించకూడదు? అని ఆయన తలచారు. నారాయణన్ గారు పంచిపెట్టిన పాత్ర ల సంఖ్య లక్ష దాటబోతోంది అంటే మీరు ఆశ్చర్యచకితులు అవుతారు. ఆయన తన ప్రచార ఉద్యమం లో భాగం గా లక్షవ పాత్ర ను గాంధీజీ స్థాపించిన సాబర్ మతీ ఆశ్రమానికి విరాళం గా ఇవ్వనున్నారు. ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది అంటే నారాయణన్ గారు చేస్తున్న ఈ పని తప్పక మనందరికీ స్ఫూర్తిని ఇచ్చేటటువంటిదే. ఈ ఎండ కాలం లో మనం సైతం మన పశు - పక్షి మిత్రుల కోసం కూడా నీటి ని ఏర్పాటు చేద్దాం.

 

సహచరులారా, మన సంకల్పాల ను తిరిగి గుర్తు తెచ్చుకోవలసింది గా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క శ్రోతల ను నేను కోరుతున్నాను. ప్రతి నీటి చుక్క ను పొదుపు చేసేందుకు మనం చేయగలిగే పని ని చేయాలి. ఇది కాకుండా నీటి రీసైక్లింగ్‌ కు మనం సమాన ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉండాలి. ఇంట్లో వినియోగించిన నీటి ని కుండీల లో వాడుకోవచ్చు. తోటపని లో వాడుకోవచ్చు. ఆ నీటి ని మళ్లీ ఉపయోగించాలి. కొంచెం ప్రయత్నం చేస్తే మీరు మీ ఇంటి లో అటువంటి ఏర్పాటుల ను చేయవచ్చునను. రహీందాస్ గారు శతాబ్దాల కిందట ‘రహిమన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్’ అని చెప్పారు. ఈ నీటి పొదుపు పని లో నేను పిల్లల పైన చాలా ఆశల ను పెట్టుకొన్నాను. మన బాలలు పరిశుభ్రత ను ఒక ఉద్యమం లా చేసినట్టే వారు ‘వాటర్ వారియర్’గా మారి నీటి ఆదా లో సహకరించగలుగుతారు.

సహచరులారా, మన దేశం లో జల సంరక్షణ, జల వనరుల పరిరక్షణ, శతాబ్దాలు గా సమాజ స్వభావం లో భాగం అయిపోయింది. దేశం లో చాలా మంది ప్రజలు నీటి సంరక్షణ ను జీవిత లక్ష్యంగా మార్చుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అలా చెన్నై నివాసి అరుణ్ కృష్ణమూర్తి గారు ఓ సహచరుడు. ఆయన తన ప్రాంతం లోని చెరువుల ను, సరస్సుల ను శుభ్రం చేసే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. 150 కి పైగా చెరువుల ను, సరస్సులను శుద్ధి చేసే బాధ్యత ను తీసుకొని విజయవంతం గా పూర్తి చేశారు. అదేవిధం గా మహారాష్ట్ర కు చెందిన రోహన్ కాలే గారు కూడా కృషి చేస్తున్నారు. రోహన్ గారు వృత్తిరీత్యా హెచ్‌ఆర్ ప్రొఫెశనల్. మహారాష్ట్ర లోని వందల కొద్దీ దిగుడు బావుల ను పరిరక్షించేందుకు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మెట్ల బావులు చాలా వందల సంవత్సరాల నాటి వి. అవి మన వారసత్వం లో భాగం అయ్యాయి. సికింద్రాబాద్‌ లోని బన్సీలాల్ పేట లో ఉన్న బావి కూడా అలాంటి దిగుడుబావుల లో ఒకటి గా ఉంది. ఏళ్ల తరబడి పట్టించుకోక పోవడం తో ఈ మెట్ల బావి మట్టి తో, చెత్త తో నిండిపోయింది. అయితే ఇప్పుడు ఈ దిగుడుబావి ని పునరుద్ధరించాలనే ఉద్యమం ప్రజల భాగస్వామ్యం తో మొదలైంది.

 

సహచరులారా, ఎప్పుడూ నీటి ఎద్దడి ఉండే రాష్ట్రం నుంచి నేను వచ్చాను. గుజరాత్‌ లో ఈ దిగుడు బావుల ను వావ్ అంటారు. గుజరాత్ లాంటి రాష్ట్రం లో వావ్ ది ప్రధానమైనటువంటి భూమిక. ఈ దిగుడు బావులు లేదా మెట్ల బావుల పరిరక్షణ లో ‘జల్ మందిర్ యోజన’ ప్రముఖ పాత్ర ను పోషించింది. గుజరాత్ అంతటా అనేక మెట్ల బావుల ను పునరుద్ధరించడం జరిగింది. ఈ ప్రాంతాల లో నీటి మట్టం పెరగడానికి ఇది చాలా వరకు దోహదపడింది. ఇటువంటి ఉద్యమాలనే మీరు స్థానికం గా కూడాను నిర్వహించవచ్చును. చెక్ డ్యాము లు కానివ్వండి, లేదా వాన నీటి సంరక్షణ కానివ్వండి.. వీటిలో వ్యక్తిగత ప్రయత్నాలు కూడా ముఖ్యమైనవే. సామూహిక కృషి కూడా అవసరం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో మన దేశం లోని ప్రతి జిల్లా లో కనీసం 75 అమృత సరోవరాల ను తయారు చేయవచ్చు. కొన్ని పాత సరస్సుల ను బాగు చేయవచ్చు. కొన్ని కొత్త వాటిని నిర్మించవచ్చు. ఈ దిశ లో మీరు తప్పక కొంత ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను.

 

నా ప్రియమైన దేశవాసులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క విశిష్టత, సౌందర్యం ఏమిటి అంటే మీ సందేశాలు అనేక భాషల లో, అనేక మాండలికాల లో నాకు అందుతాయి. చాలా మంది మై గవ్ లో ఆడియో సందేశాల ను కూడా పంపుతారు. భారతదేశం యొక్క సంస్కృతి, మన భాష లు, మన మాండలికాలు, మన జీవన విధానం, మన ఆహార పానీయాల విస్తరణ- ఈ వైవిధ్యాలు అన్నీ మనకు గొప్ప బలం. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఈ వైవిధ్యం భారతదేశాన్ని ఏకం చేస్తుంది. ‘ ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్ ’ గా మారుస్తుంది. ఇందులో కూడా మన చారిత్రిక ప్రదేశాలు, పురాణాలు - చాలా దోహదపడతాయి. నేను ఇప్పుడే మీతో ఈ విషయం ఎందుకు చెబుతున్నానని మీరు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కారణం ‘మాధవ్‌పుర్ మేళా’. మాధవ్ పుర్ మేళా ఎక్కడ జరుగుతుంది?, ఎందుకు జరుగుతుంది?, భారతదేశం వైవిధ్యం తో ఆ మేళా కు ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకోవడం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క శ్రోతల కు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

 

సహచరులారా, ‘మాధవ్‌ పుర్ జాతర’ గుజరాత్‌ లోని పోర్‌బందర్‌ లో సముద్రానికి సమీపం లోని మాధవ్ పుర్ గ్రామం లో జరుగుతుంది. కానీ ఇది భారతదేశం తూర్పు చివర తో కూడా కలుపుతుంది. ఇది ఎలా సాధ్యం ? అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. దీనికి సమాధానం కూడా ఒక పౌరాణిక కథ ద్వారా తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈశాన్య ప్రాంత రాజకుమారి రుక్మిణి ని వివాహమాడినట్లు చెబుతారు. ఈ కళ్యాణం పోర్ బందర్‌ లోని మాధవ్ పుర్‌ లో జరిగింది. ఆ పెళ్ళి కి గుర్తుగా ఈ రోజు కు కూడా అక్కడ మాధవ్ పుర్ జాతర జరుగుతుంది. తూర్పు, పడమర ల మధ్య ఉన్న ఈ గాఢమైన బంధం మన వారసత్వం. కాలం తో పాటు ఇప్పుడు ప్రజల కృషి తో మాధవ్ పుర్ మేళా కు కొత్తదనం కూడా తోడు అవుతున్నది. వధువు వైపు వారి ని ఘరాతీ అని పిలుస్తారు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల నుంచి చాలా మంది ఘరాతీ లు ఈ జాతర కు రావడం మొదలుపెట్టారు. వారం రోజుల పాటు జరిగే మాధవ్ పుర్ జాతర కు ఈశాన్య రాష్ట్రాల నుంచి కళాకారులు చేరుకొంటారు. హస్తకళ కు సంబంధించిన కళాకారులు వస్తారు. నలుగురు చంద్రుల వెన్నెల లాగా ఈ జాతర అందాలు సంతరించుకొంటుంది. ఒక వారం రోజుల పాటు భారతదేశ తూర్పు, పశ్చిమ సంస్కృతుల సమ్మేళనం అయిన ఈ మాధవ్ పుర్ జాతర ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్‌ కు చాలా అందమైన ఉదాహరణ ను సృష్టిస్తోంది. ఈ జాతర ను గురించి చదివి తెలుసుకోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.

 

నా ప్రియమైన దేశవాసులారా, దేశం లో ఆజాదీ కా అమృత్ మహోత్సవం, ఇప్పుడు ప్రజల భాగస్వామ్యాని కి కొత్త ఉదాహరణ గా నిలుస్తోంది. కొద్ది రోజుల కిందట, అంటే మార్చి నెల 23 న శహీద్ దివస్ (అమరవీరుల దినం) ను పురస్కరించుకొని దేశం లోని వివిధ ప్రాంతాల లో అనేక వేడుక లు జరిగాయి. స్వాతంత్ర్యం సాధించిన వీరుల ను, వీరవనితల ను దేశం భక్తి శ్రద్ధలతో స్మరించుకొంది. అదే రోజు కోల్‌కాతా లోని విక్టోరియా మెమోరియల్‌ లో బిప్లొబీ భారత్ గేలరీ ని ప్రారంభించే అవకాశం కూడా నాకు లభించింది. భారతదేశం లోని క్రాంతి వీరులకు శ్రద్ధాంజలి ని ఘటించేందుకు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి చిత్రశాల. అవకాశం దొరికితే ఈ గేలరీ ని తప్పక సందర్శించండి.

 

సహచరులారా, ఏప్రిల్ లో మనం ఇద్దరు మహానుభావుల జయంతి ని కూడా జరుపుకొంటాం. వీరు ఇరువురూ భారతీయ సమాజం పై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఈ మహనీయులు మహాత్మ ఫులే, బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్. ఏప్రిల్ 11న మహాత్మ ఫులే జయంతి ని, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ జయంతి ని పాటిస్తాం. ఈ మహానుభావులు ఇద్దరూ వివక్ష కు, అసమానతల కు వ్యతిరేకం గా గొప్ప పోరాటాన్ని చేశారు. మహాత్మ ఫులే ఆ కాలం లో ఆడపిల్లల కోసం పాఠశాలల ను తెరిచారు. ఆడ శిశు హత్యల కు వ్యతిరేకం గా గళమెత్తారు. నీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తు న ఉద్యమాల ను కూడా నడిపారు.

 

సహచరులారా, మహాత్మ ఫులే ను గురించిన ఈ చర్చ లో సావిత్రీబాయి ఫులే గారి ప్రస్తావన కూడా అంతే ముఖ్యమైంది. అనేక సామాజిక సంస్థ ల ఏర్పాటు లో సావిత్రీబాయి ఫులే ప్రముఖ పాత్ర ను పోషించారు. ఉపాధ్యాయురాలు గా, సామాజిక సంస్కరణ వాది గా సంఘాని కి అవగాహన ను కల్పించి ప్రోత్సహించారు. వారు ఇద్దరూ కలిసి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ప్రజల సశక్తీకరణ కోసం కృషి చేశారు. బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ రచనల లో మహాత్మ ఫులే ప్రభావాన్ని మనం స్పష్టం గా చూడవచ్చును. సమాజం అభివృద్ధిని ఆ సమాజం లో మహిళల స్థితిగతుల ను బట్టి అంచనా వేయవచ్చు అని కూడా ఆయన చెప్పే వారు. మహాత్మ ఫూలే, సావిత్రీబాయి ఫులే, బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ల జీవనం నుంచి ప్రేరణ ను తీసుకొని తల్లితండ్రులు, సంరక్షకులు అందరూ వారి కుమార్తెల ను చదివించాలి అని కోరుతున్నాను. అమ్మాయిల ను బడి లో చేర్పించడం కోసం కొద్దిరోజుల క్రితమే కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్‌ కూడా ప్రారంభం అయింది. కొన్ని కారణాల వల్ల చదువు కు దూరమైన ఆడపిల్లల ను మళ్లీ బడి కి తీసుకు రావడంపైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.

 

సహచరులారా, బాబాసాహెబ్‌ తో అనుబంధం ఉన్న పంచ తీర్థం కోసం పని చేసే అవకాశం కూడా లభించడం మనందరి అదృష్టం. మహూ లోని ఆయన జన్మస్థలం అయినా, ముంబయి లోని చైత్యభూమి అయినా, లండన్‌ లోని ఆయన నివాసం అయినా, నాగ్‌పుర్‌ దీక్షా భూమి అయినా, దిల్లీ లోని బాబాసాహెబ్‌ మహాపరినిర్వాణస్థలం అయినా- అన్ని ప్రదేశాల ను, అన్ని తీర్థాల ను సందర్శించే భాగ్యం నాకు లభించింది. మహాత్మ ఫులే, సావిత్రీబాయి ఫులే, బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్‌ లకు సంబంధించిన ప్రదేశాల ను సందర్శించాలి అని నేను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల ను కోరుతున్నాను. అక్కడ మీరు చాలా విషయాల ను నేర్చుకోవచ్చును.

 

నా ప్రియమైన దేశవాసులారా, ఈ సారి కూడా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం అనేక అంశాల పై మాట్లాడుకొన్నాం. వచ్చే నెల లో చాలా పండుగ లు వస్తున్నాయి. కొన్ని రోజుల తరువాత నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రుల లో మనం ఉపవాసాలు చేస్తాం. శక్తి సాధన చేస్తాం. శక్తి ని ఆరాధిస్తాం. అంటే మన సంప్రదాయాలు మనకు ఆనందాన్ని ఇవ్వడం తో పాటు గా నిగ్రహాన్ని నేర్పుతాయి. సంయమనం, పట్టుదల కూడా మనకు పర్వాలే. కాబట్టి నవరాత్రులు ఎప్పుడూ మనందరికీ చాలా ప్రత్యేకమైనవి. నవరాత్రుల లో ఒకటో రోజు న గుడీ పడ్ వా పండుగ కూడా ఉంది. ఏప్రిల్‌ లో ఈస్టర్ కూడా వస్తుంది. రంజాన్ పవిత్ర దినాలు కూడాను ప్రారంభం అవుతాయి. మనం అందరిని కలుపుకొని మన పండుగల ను జరుపుకొందాం. భారతదేశం యొక్క వివిధత్వాన్ని బలోపేతం చేద్దాం. అందరిదీ ఇదే అభిలాష. ఈ సారి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో విషయాలు ఇవే. వచ్చే నెల లో మీతో కొత్త విషయాల తో మళ్లీ భేటీ ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు.

 

***

 



(Release ID: 1810354) Visitor Counter : 254