అంతరిక్ష విభాగం
అంతరిక్షంలో భారతీయ ప్రయోజనాల పరిరక్షణ
Posted On:
23 MAR 2022 1:12PM by PIB Hyderabad
అంతరిక్ష రవాణా, మౌలిక సదుపాయాలు, అప్లికేషన్ల రంగంలో సమగ్ర సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకుంటూ అంతరిక్షంలో భారత్ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు అంతరిక్ష విభాగం ద్వారా భారత ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తోంది.
అంతేకాకుండా, భారతీయ ఉపగ్రహాలను, కక్ష్యలో ఉన్న ఇతర పరికరాల పరిరక్షణ కోసం, అంతరిక్ష దీర్ఘకాలిక సుస్థిరత కోసం అంతరిక్ష వ్యర్ధాల పెరుగుదలను నియంత్రించేందుకు సమగ్ర అంతర్జాతీయ కృషిలో ఇస్రో చురుకుగా పాలుపంచుకుంటోంది.
అంతరిక్ష వ్యర్ధాల అధ్యయనం, అంతరిక్ష పరిస్థితుల అవగాహనకు దోహదం చేసే అన్ని అంతర్జాతీయ సంస్థలు అయిన ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (ఐడిఎసి), ఐఎఎఫ్ స్పేస్ డెబ్రిస్ వర్కింగ్ గ్రూప్, ఐఎఎ స్పేస్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్, ఐఎస్ఒ స్పేస్ డెబ్రిస్ వర్కింగ్ గ్రూప్, యుఎన్‌సిఒపియుఒఎస్ లాంగ్‌టర్మ్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ లలో ఇస్రో క్రియాశీలక సభ్యునిగా వ్యవహరిస్తోంది.
ఈ సమాచారాన్ని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు &పింఛన్లు, ప్రధానమంత్రిత్వ కార్యాలయ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బుధవారం లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1808824)
Visitor Counter : 191