ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

బ్రిక్స్ వ్యాక్సిన్ ఆర్ అండ్ డి సెంటర్ ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

వ్యాక్సినేషన్ వనరుల పటిష్టత, అందరికీ సమానంగా సురక్షితమైన సమర్థవంతమైన కోవిడ్-19 వ్యాక్సిన్ల లభ్యత లో కీలక పాత్ర పోషించనున్న ఆర్ అండ్ డి సెంటర్

"ప్రపంచ మహమ్మారి ప్రతిస్పందన దిశగా బ్రిక్స్ దేశాల నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం"

బ్రిక్స్, ఇతర దేశాలకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి బలమైన వ్యాక్సిన్ తయారీ పరిశ్రమను అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

‘‘2022 మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70% మందికి కోవిడ్-19 వ్యాక్సిన్లు వేయాలన్న డబ్ల్యూహెచ్ఓ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలి.‘‘

Posted On: 22 MAR 2022 5:37PM by PIB Hyderabad

150కి పైగా దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా తో, 65-70 శాతం వరకు డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ అవసరాలను తీరుస్తూ ప్రపంచంలోనే  అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ పరిశ్రమల్లో ఒకటి గా ఉన్న భారత్  ప్రపంచం తో పాటు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దక్షిణాఫ్రికా) దేశాలకు

వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం లో బలమైన వ్యాక్సిన్ తయారీ పరిశ్రమను అందించడానికి సిద్ధంగా ఉంది.‘‘ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం ఢిల్లీ లో వాక్సిన్ సహకారం పై బ్రిక్స్ వ్యాక్సిన్ ఆర్ అండ్ డి సెంటర్ ను , వర్క్ షాప్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ . విషయం తెలిపారు.

 

వ్యాక్సిన్ పరిశోధన , అభివృద్ధిలో బ్రిక్స్ దేశాల అనుబంధ ప్రయోజనాలను సమీకరించడానికి , అంటువ్యాధులను నివారించడానికి , నియంత్రించడానికి, అవసరమైన ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు సకాలంలో సహాయం అందించడానికి బ్రిక్స్ దేశాల సామర్థ్యాన్ని పెంచడంలో  కేంద్రం సహాయపడుతుందని డాక్టర్ మాండవీయ తెలిపారు. ఇది ప్రాథమిక ఆర్ అండ్ డి ప్రీక్లినికల్ , క్లినికల్ అధ్యయనాలను కలిగి ఉంటుంది . టీకా కాండీడెట్లను పరీక్షించడానికి , పరీక్షలను అభివృద్ధి చేయడానికి , ప్రమాణీకరించడానికి బ్రిక్స్ దేశాల ప్రయోగశాల సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని చెప్పారు. వ్యాక్సినేషన్ వనరుల పటిష్టత, అందరికీ సమానంగా సురక్షితమైన సమర్థవంతమైన కోవిడ్-19 వ్యాక్సిన్ల  లభ్యత లో ఆర్ అండ్ డి సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

 

బ్రిక్స్ వ్యాక్సిన్ ఆర్ అండ్ డి సెంటర్ ఏర్పాటు దేశాలతో సహకరించడానికి, అనుభవాలను పంచుకోవడానికి, పరస్పర ప్రయోజనాల కోసం భాగస్వామ్యాలు నిర్మించడానికి , ప్రజారోగ్య ప్రాముఖ్యత కలిగిన వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి స్వాగతించదగిన చొరవ అని కేంద్ర ఆరోగ్య మంత్రి నొక్కిచెప్పారు.

ప్రాణాలను, జీవనోపాధిని కాపాడడానికి ఇద్ దోహదపడుతుంది. బ్రిక్స్ దేశాల పౌరులు, ప్రపంచ ప్రజల కోసం  ఆర్థిక రికవరీ దిశగా ముందుకు తీసుకు వెడుతుంది.

 

వర్చువల్ లాంచ్ సందర్భంగా, డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వ్యాక్సిన్ల పరిశోధన , అభివృద్ధి కోసం సమిష్టి గా శాస్త్రీయ ప్రయత్నాలను చేపట్టినందుకు బ్రిక్స్ దేశాలకు కృతజ్ఞత , ప్రశంసలను తెలియజేశారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఒక మహమ్మారి మధ్య, కేంద్రాన్ని ప్రారంభించడాన్ని సమన్వయ పరచినందుకు బ్రిక్స్ ప్రెసిడెన్సీ నీ నేను అభినందిస్తున్నాను. ప్రపంచ మహమ్మారి ప్రతిస్పందన పట్ల బ్రిక్స్ దేశాల నిబద్ధతకు ఇది నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికి కృషి చేసిన వారందరినీ కేంద్ర ఆరోగ్య మంత్రి అభినందించారు. "మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆరోగ్య వ్యవస్థ ,వ్యాక్సిన్ అభివృద్ధికి వెన్నెముకగా పనిచేసిన ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఔషధ నియంత్రణ అధికారులు ,స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా విధాన రూపకర్తల అలుపెరగని కృషికి నేను నా కృతజ్ఞత ప్రశంసలను తెలియజేయాలనుకుంటున్నాను" అన్నారు. కోవిడ్-19 వైరస్ ఉద్భవించిన ఒక సంవత్సరం కంటే తక్కువ కాలంలోనే కోవిడ్-19 కోసం సురక్షితమైన , సమర్థవంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ,ఆమోదించడం నమ్మశక్యం కాని శాస్త్రీయ విజయం అని, భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధిలో ఏమి సాధ్యమో వైరస్ మనకు చూపించిందని ఆయన పేర్కొన్నారు.

 

డబ్ల్యూహెచ్ఓ పరిశోధన - అభివృద్ధి బ్లూప్రింట్ , అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు సెంటర్ కు మార్గదర్శక సూత్రాలుగా ఉండాలని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు . "2022 మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70% మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్లతో టీకాలు వేయాలనే డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి ఏసీటీ-, కోవాక్స్, సిఇపిఐ వంటి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలి‘‘" అని సూచించారు. ‘‘మహమ్మారి , ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో పాటు, ఎయిడ్స్, టి బి వంటి ప్రస్తుతం వాక్సిన్లు అందుబాటు లో లేని అధిక ప్రబలత, ప్రాణాంతక వ్యాధులలో

నియంత్రించ గల అవకాశం ఉన్న వాటికి వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరించుకోవడానికి

దేశాలకు విస్తృత పరిధి ఉంది‘‘ అని ఆయన అన్నారు.

 

ప్రపంచంలోని అతిపెద్ద కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ లో దేశం సామర్థ్యాలు ,విజయం గురించి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, భారతదేశం ఇప్పటివరకు 1.81 బిలియన్లకు పైగా వ్యాక్సినేషన్ మోతాదులను ఇచ్చిందని చెప్పారు. దేశంలో వ్యాక్సిన్ ఆర్ అండ్ డి కి సంబంధించి బలమైన ,అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు.

‘‘కోవిడ్-19 అత్యవసర వినియోగం కోసం భారత్ ఇప్పటివరకు 9 వ్యాక్సిన్లను ఆమోదించింది, వీటిలో 5 స్వదేశీ వ్యాక్సిన్లు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన, డబ్ల్యూహెచ్ఓ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ వెలుపల ఉత్పత్తి అయిన ఎం-ఆర్ఎన్ఎ వ్యాక్సిన్ జెన్నోవా యొక్క ప్రపంచంలోని మొట్టమొదటి రకం ఎం-ఆర్ఎన్ఎ వ్యాక్సిన్ ను  కూడా కలిగి ఉంది.‘‘ భారతదేశంలో వ్యాక్సిన్ పరిశ్రమ డీ-నోవో ప్రొడక్ట్ అభివృద్ధి- అంటే దేశం లోపల , స్థానిక- అంతర్జాతీయ  భాగస్వామ్యం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం అనే ద్వంద్వ విధానంలో పని చేస్తోందని ఆయన అన్నారు. "స్థానిక , ప్రపంచ సంబంధిత వ్యాధుల కోసం వ్యాక్సిన్ పరిశోధన , అభివృద్ధి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము కాబట్టి భారతదేశంతో సహకరించాలని‘‘ వాటాదారులను ఆయన ఆహ్వానించారు.

 

వివిధ రంగాలలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతతో, వ్యాక్సిన్ పరిశోధన ,అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. మేరకు 2018లో జోహన్నెస్ బర్గ్ డిక్లరేషన్ లో బ్రిక్స్ వ్యాక్సిన్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సంవత్సరాలుగా ముఖ్యంగా మహమ్మారి సమయం.అంతటా, ప్రక్రియ ను వేగవంతం చేశారు. చివరికి న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆఫ్ పన్నెండో బ్రిక్స్ సమ్మిట్ లో, వర్చువల్ ఫార్మాట్ లో బ్రిక్స్ వ్యాక్సిన్ ఆర్ అండ్ డి సెంటర్ ను త్వరగా ప్రారంభించడానికి తమ నిబద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు.

 

బ్రిక్స్ ప్రభుత్వాల మద్దతుతో, ప్రతి బ్రిక్స్ దేశం కూడా తమ జాతీయ కేంద్రాలను గుర్తించింది, అవి ఓస్వాల్డో క్రజ్ ఫౌండేషన్ (ఫియోక్రజ్), స్మోరోడింట్సేవ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్లూయెజా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్), సినోవాక్ లైఫ్ సైన్సెస్ కంపెనీ లిమిటెడ్, సౌత్ ఆఫ్రికా మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్.

 

కార్యక్రమానికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్వాంగ్ జిగాంగ్ అధ్యక్షత వహించారు, వ్యాక్సిన్ల నిష్పాక్షికమైన సమానమైన పంపిణీని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని , కేంద్రం ఏర్పాటు, అటువంటి ఇతర కార్యక్రమాల ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించాలని కోరారు. వ్యాక్సిన్ ఆర్ అండ్ డిలో సహకారం, కోవిడ్-19 నిర్వహణలో వారి అనుభవాలతో పాటు, బ్రిక్స్ దేశాల మధ్య భవిష్యత్

మహమ్మారులను  సమన్వయంతో ఎదుర్కోవడానికి అనుసరించవలసిన వ్యూహాలపై ప్యానెల్ చర్చించింది.

 

సమావేశానికి శ్రీ మార్సెలో క్వైరోగా (బ్రెజిల్ ఆరోగ్య మంత్రి), శ్రీ మిఖాయిల్ మురాష్కో (ఆరోగ్య మంత్రి, రష్యా), డాక్టర్ బ్లేడ్ న్జిమాండే (ఉన్నత విద్య, విజ్ఞానం , ఆవిష్కరణ శాఖ మంత్రి, దక్షిణాఫ్రికా),l ఇంకా  బ్రిక్స్ దేశాలకు చెందిన ప్రతినిధులు, సీనియర్ ప్రతినిధులు, పరిశోధన నిపుణులు హాజరయ్యారు.

 

****(Release ID: 1808526) Visitor Counter : 173