ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశంలోని మొక్కల ఆధారిత ఆహార పర్యావరణ వ్యవస్థను ప్రారంభించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను కలిసిన ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (PBFIA) ప్రతినిధి బృందం


భారతీయ మొక్కల ఆధారిత ఆహార రంగం గణనీయ వృద్ధి'కి సిద్ధంగా ఉంది: శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ చెప్పారు

Posted On: 16 MAR 2022 2:16PM by PIB Hyderabad

కొత్తగా ఏర్పడిన మొక్కల ఆధారిత ఆహార `రంగం (PBFIA) ప్రతినిధి బృందం న్యూ ఢిల్లీలో ఆహార శుద్ధి  పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను కలిసింది.

అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ సంజయ్ సేథీ నేతృత్వంలోని PBFIA ప్రతినిధి బృందం, భారతదేశంలో ప్రారంభమై  వేగంగా విస్తరిస్తున్న మొక్కల ఆధారిత ఆహార రంగం స్థితిని కేంద్ర మంత్రికి వివరించింది. ఈ రంగం విస్ఫోటన  వృద్ధికి సిద్ధంగా ఉందని పేర్కొంటూ, విధానపరమైన మార్పులు, సామర్థ్య పెంపుదల, వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఇతర జోక్యాల ద్వారా దేశీయ ప్రపంచ మార్కెట్‌లకు అందించే ప్రధాన పరిశ్రమగా మార్చడానికి శ్రీ సేథి కేంద్ర మంత్రి మార్గదర్శకత్వం, మద్దతు కోరారు. మొక్కల  ఆధారిత ఆహార మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా  2025 నాటికి 77.8 బిలియన్ అమెరికన్  డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

 ఆహార శుద్ధి  పరిశ్రమల సహాయ  మంత్రి, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ గురించి చర్చించడానికి, పరిశ్రమ కోసం ప్రధాన నగరాల మధ్య రోజువారీ పార్శిల్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఏమి చేయాలో అన్వేషించడానికి మంత్రిత్వ శాఖతో ప్రత్యేక సమావేశం కావాలని PBFIAని కోరారు. ఈ సమావేశానికి హాజరైన ఇన్వెస్ట్ ఇండియా, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గౌరవ్ సిషోడియాను  PBFIA కి చెందిన వివిధ కార్యక్రమాలకు సహకరించవలసిందిగా శ్రీ పటేల్ కోరారు.

మొక్కల ఆధారిత పర్యావరణ వ్యవస్థలో భారతీయ భాగస్వాములు  అందరూ పాల్గొనే రెండు ప్రధాన  కార్యక్రమాలను నిర్వహించడానికి మంత్రి పిబిఎఫ్‌ఐఎ సహాయాన్ని కోరినందుకు తాను సంతోషిస్తున్నానని శ్రీ సేథి అన్నారు, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు అర్థం చేసుకోవడానికి, ప్రసంగించడానికి ఈ రంగానికి చెందిన అంతర్జాతీయ భాగస్వాములను ను కూడా ఆహ్వానించారు. . PBFIA ప్రతినిధి బృందం యువశక్తి, ఉత్సాహాన్ని కూడా మంత్రి ప్రశంసించారు.

*****



(Release ID: 1807986) Visitor Counter : 145