గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పట్టణాలకు వలస వచ్చినవారు/ పేదలు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవకాశం కల్పించే సరసమైన అద్దె గృహ సముదాయాలు ప్రారంభించిన కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ

Posted On: 21 MAR 2022 1:23PM by PIB Hyderabad

పట్టణాలకు వలస వచ్చినవారు/ పేదలు గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించే  సరసమైన అద్దె గృహ సముదాయాల  (ఏఆర్ హెచ్ సీ)నిర్మాణాన్ని   ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎంఏవై-యూ) పథకంలో భాగంగా కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పనిచేస్తున్న ప్రాంతాలకు సమీపంలో వసతి అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం రెండు నమూనాలలో  అమలు జరుగుతుంది. 

నమూనా-1: 1.    జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జెఎన్ఎన్ యుఆర్ఎంమరియు రాజీవ్ ఆవాస్ యోజన (రే కింద నిర్మించిన ప్రభుత్వ నిధులతో నిర్మించి ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా లేదా ప్రభుత్వ సంస్థల  ద్వారా ఏఆర్ హెచ్ సీ గా మార్చడం. 

నమూనా 02: తమకు చెందిన సొంత స్థలంలో ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలు ఏఆర్ హెచ్ సీ లు నిర్మించినిర్వహించడం . 

ఇంతవరకునమూనా-1లో ప్రభుత్వ నిధులతో నిర్మాణం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న 5,478 ఇళ్ళను ఏఆర్ హెచ్ సీ లుగా మార్చడం జరిగింది.  మరో 7,483 యూనిట్లను ఏఆర్ హెచ్ సీ మార్చే కార్యక్రమం వివిధ దశల్లో ఉంది. పనిచేస్తున్న ప్రాంతాలకు  సమీపంలో పట్టణ వలసదారులు/పేదలకు వసతి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు జరుగుతుంది.వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఏఆర్ హెచ్ సీ గా అభివృద్ధి చేయనున్న  జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జెఎన్ఎన్ యుఆర్ఎం మరియు రాజీవ్ ఆవాస్ యోజన (రే కింద నిర్మించిన ఏఆర్ హెచ్ సీ ఇళ్ల వివరాలు అనుబంధంలో పొందుపరచబడ్డాయి. నమూనా -2లో 78,885 నూతన  ఏఆర్ హెచ్ సీ ల నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. రాష్ట్రాల వారీ వివరాలు అనుబంధం లో పొందుపరచడం జరిగింది. 

ఇళ్లకు పథకం మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థలు అద్దె మొత్తాన్ని నిర్ణయిస్తాయి. 

నమూనా-కింద వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జెఎన్ఎన్ యుఆర్ఎం మరియు రే కింద ప్రభుత్వ నిధులతో నిర్మించబడి ఖాళీగా ఉన్న ఇళ్లలో ఏ ఆర్ హెచ్ సీ లు గా మారే ఇళ్ల వివరాలు:

 

 

క్ర.స

రాష్ట్రాలు/యూటీల పేరు 

ప్రభుత్వ సంఖ్య. నిధులతో నిర్మించి ఖాళీగా  ఇళ్ల సంఖ్య

ఏఆర్ హెచ్ సీలుగా మార్చబడిన ఇళ్ల సంఖ్య 

        1 

అరుణాచల్ ప్రదేశ్  

            752 

                  -   

        2 

చండీగఢ్ 

        2,195 

              2,195 

        3 

ఢిల్లీ 

      29,112 

                  -   

        4 

గుజరాత్  

        4,414 

              2,467 

        5 

హర్యానా  

        2,545 

-

        6 

హిమాచల్ ప్రదేశ్  

            314 

                  -   

        7

మధ్యప్రదేశ్  

            364 

                  -   

        8 

మహారాష్ట్ర 

      32,345 

                  -   

        9 

నాగాలాండ్  

            664 

                  -   

      10 

రాజస్థాన్  

        4,884 

                480 

      11 

ఉత్తర ప్రదేశ్  

        5,232 

                  -   

      12 

ఉత్తరాఖండ్  

            377 

                  -   

      13 

జమ్మూ & కాశ్మీర్

          336

                336 

మొత్తం  

      83,534 

    5,478 

 

నమూనా -2 కింద వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పబ్లిక్/ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్మాణం కోసం మంజూరు చేయబడిన ఏఆర్ హెచ్ సీ యూనిట్ల వివరాలు:

 

S. No.

నగరం/రాష్ట్రం పేరు

సంస్థ పేరు

మొత్తం యూనిట్లు 

1

శ్రీపెరంబుదూర్తమిళనాడు

ఎస్పీఆర్ సిటీ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్

18,112

2

శ్రీపెరంబుదూర్తమిళనాడు

ఎస్పీఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్

3,969

3

హోసూరుతమిళనాడు

టాటా ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్

11,500

4

చెన్నైతమిళనాడు

స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు

18,720

5

చెన్నైతమిళనాడు

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

1,040

6

రాయ్‌పూర్ఛత్తీస్‌గఢ్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

2,222

7

కంపూర్ టౌన్అస్సాం

గౌహతి రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

2,222

8

ప్రయాగ్‌రాజ్ఉత్తరప్రదేశ్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

1,112

9

సూరత్గుజరాత్

మిత్సుమి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 

453

10

చెన్నైతమిళనాడు

ఎస్పీఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్

5,045

11

నిజాంపేట్తెలంగాణ

 

శివాని ఇన్‌ఫ్రా  ప్రైవేట్   లిమిటెడ్

14,490

మొత్తం

78,885

 

 

కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***(Release ID: 1807704) Visitor Counter : 203


Read this release in: Urdu , English , Bengali