రైల్వే మంత్రిత్వ శాఖ

టైటిల్ ఛాంపియన్‌షిప్‌ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గోనున్న రైల్వేస్


భువనేశ్వర్‌లో 2022 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఛాంపియన్‌షిప్‌ పోటీలు

Posted On: 18 MAR 2022 3:19PM by PIB Hyderabad
సీనియర్ నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2022 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారత రైల్వేలకు చెందిన  రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు
( ఆర్ ఎస్ పి బి ) బలమైన జట్టు ను ఎంపిక చేసింది. సీనియర్ నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రైల్వే జట్టు వరుసగా గత నాలుగు సంవత్సరాలుగా విజేతగా నిలిచింది.  రైల్వే   కి చెందిన మహిళల బృందం గత రెండు సంవత్సరాలుగా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. 
దేశంలో అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందిన భారత రైల్వే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోంది. క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పిస్తోంది. క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో జహాన్ ఖేల్ వహన్ రైల్” నినాదంతో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు క్రీడలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించి క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభకు మెరుగులు దిద్దుతోంది. కేవలం రైల్వే కి చెందిన క్రీడాకారులకు మాత్రమే కాకుండా ఇతర క్రీడాకారులకు కూడా ఈ సౌకర్యాలను అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రస్తుతం రైల్వే లో దాదాపు 10000 మంది క్రీడాకారులు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో దాదాపు 3000 మంది వివిధ క్రీడాంశాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో పురుషులు మరియు మహిళా క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించిన సంస్థగా రైల్వే గుర్తింపు పొందింది. 
అంతర్జాతీయ క్రీడల పోటీల్లోదేశం సాధించిన విజయాల్లో భారతదేశం తరఫున పాల్గొన్న రైల్వేకి చెందిన క్రీడాకారులు  కీలక పాత్ర పోషించారు. కామన్వెల్త్ క్రీడలుఆసియా క్రీడలు లేదా ఒలింపిక్స్ పోటీల్లో భారతీయ రైల్వే కి చెందిన అనేక మంది   క్రీడాకారులు భారతదేశం బృందం సభ్యులుగా ఉన్నారు. 

2020 టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి రజత పతకాన్ని సాధించిన  శ్రీమతి ఎస్ మీరాబాయి చాను వంటి స్టార్ వెయిట్‌లిఫ్టర్‌లను రైల్వే తీర్చి దిద్దింది.  ఒలింపిక్స్‌లో దేశానికి  రజత పతకం సాధించిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టర్‌గా శ్రీమతి ఎస్ మీరాబాయి చాను   నిలిచింది.  శ్రీ సతీష్ శివలింగం, శ్రీమతి రేణు బాలశ్రీమతి సంజితా చాను వంటి అర్జున అవార్డు గ్రహీతలు రైల్వే ఉద్యోగాలుగా  

 



(Release ID: 1807197) Visitor Counter : 145