ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌లో ఎన్ఇఆర్‌సిఆర్ ఎంఎస్ ప్రమేయం - డిఒఎన్ఇఆర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ సొసైటీ
Posted On:
17 MAR 2022 12:08PM by PIB Hyderabad
శ్రీ షిహా మోగ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని బొర్దుమ్సా పరిధిలోని బిజయ్‌పూర్ -III గ్రామానికి చెందినవాడు. ఎన్ఇఆర్‌సిఆర్ ఎంఎస్ జోక్యానికి ముందు, అతడు వివాహం అయిన తర్వాత కుటుంబానికి దూరమై, ఎటువంటి ఉపాధి, తోడ్పాటు లేకుండా ఉన్నాడు. అతడు పని కోసం వేరొక రాష్ట్రానికి వలసవెళ్ళినప్పటికీ, తన కుటుంబాన్ని పోషించడానికి అవసరమైనంత డబ్బు ఇచ్చే పనిని వెతుక్కోవడంలో విఫలమయ్యాడు. తర్వాత అతడు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి, తన తండ్రి వాటా భూమిలో పంటలను పండించడం తిరిగి ప్రారంభించాడు. అయితే, కేవలం వ్యవసాయం అతడి కుటుంబ అవసరాలను తీర్చలేకపోయింది.
కాగా, 2019వ సంవత్సరంలో గ్రామంలో ఎన్ఇఆర్‌సిఆర్ ఎంఎస్ వెలుగులోకి వచ్చినప్పుడు, ఒక ఎన్ఎఆర్ఎంజి సమావేశంలో అతడు తాను ఎంచుకున్న యూనిట్ ను ప్రతిపాదించగలిగాడు. తర్వాత దానిని ఎడబ్ల్యపిబి 2019-2020 ముందుంచి, ముంజూరు చేశారు. అతడు ఎన్ఇఆర్‌సిఆర్ ఎంఎస్ కింద ప్రాజెక్టు లబ్దిదారు అయ్యి, 2019 నుంచి ఎలక్ట్రికల్ కార్యకలాపాలు ప్రారంభించాడు. ప్రాజెక్టు నుంచి అతడు రూ. 25,000/- పొందాడు. తన వద్ద దాచుకున్న రూ.5,000లను చేర్చి అతడు గ్రామంలో ఎలక్ట్రికల్ షాపును ప్రారంభించాడు.
మొదట్లో, తన కుటుంబ పోషణార్ధం ఇళ్ళలో వైరింగ్ పనిని ప్రారంభించాడు. అనంతరం, అది అదనపు వృత్తి అయింది. ప్రాజెక్టు అతడి జీవితాన్ని మార్చివేసింది. అతడిని వ్యవసాయంపై ఆధారపడిన వ్యక్తి నుంచి, సాంకేతికంగా స్వతంత్ర వ్యక్తి పరివర్తనకు గురి చేసింది. నెలకు రూ. 12,000/- ను ఆర్జించడం ద్వారా అతడు ఆర్ధికంగా మరింత సురక్షితంగా ఉండటమే కాక, తన సాంకేతిక వృత్తిపై దృష్టిని కేటాయించగలిగాడు. ఈ చొరవ ఫలితంగా, తన కుటుంబం కోసం వార్షిక ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రాజెక్టు అవకాశం ఇచ్చింది.
***
(Release ID: 1807018)
Visitor Counter : 204