ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు నిధుల డిమాండ్ పై చర్చలో పాల్గొన్న కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి
భద్రతా పరిస్థితిని మెరుగుపరచడానికి తీసుకున్న అనేక మైలురాయి కార్యక్రమాలను కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు, ఫలితంగా ఈ ప్రాంతంలో స్థిరత్వం, భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు కనెక్టివిటీ ప్రాజెక్టులు
ఈశాన్య ప్రాంతం లో భద్రతా పరిస్థితి, స్థిరత్వం, భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి , కనెక్టివిటీ ప్రాజెక్టులను మెరుగుపరచడానికి తీసుకున్న అనేక మైలురాయి కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి
Posted On:
16 MAR 2022 2:35PM by PIB Hyderabad
కీలక ముఖ్యాంశాలు:
*భారత దేశాన్ని, ఈశాన్య ప్రాంతాన్ని మార్చాలన్న ప్రధాన మంత్రి ఎజెండాకు ప్రాధాన్యత ఇచ్చినందున ఈశాన్య ప్రాంతంలో శాంతి , సౌభాగ్యాల కొత్త శకం ప్రారంభమైంది.
*పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధాన ప్రాజెక్టులు చేపడుతున్న కారణంగా ఈ ప్రాంతంలో
శాంతి , స్థిరత్వం నెలకొన్నాయి.
*ఈశాన్య ప్రాంతానికి 54 కేంద్ర మంత్రిత్వ శాఖల మొత్తం స్థూల బడ్జెట్ సాయం లో 76,040 కోట్ల మేర సుమారు 110% పెరుగుదల ఉంది,
*ఈ ప్రాంతంలో రైలు, రోడ్డు,విమాన ,నీరు, టెలికాం కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, తద్వారా ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం ,పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి
*2014-2021 లో రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి రూ.39,000 కోట్లు ఖర్చు చేశారు.
*ఈశాన్య ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు క్రమం తప్పకుండా సందర్శించడం వల్ల ఈశాన్య ప్రాంతంలో కేంద్ర రంగ, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో మార్పు తో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో రాజకీయ అనుసంధానం కూడా వస్తోంది.
రాజ్యసభలో ఈ రోజు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డోనర్) పనితీరుపై జరిగిన చర్చకు ఈశాన్య ప్రాంత అభివద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖలమంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమాధానమిస్తూ, ఈశాన్య ప్రాంతంలో శాంతి సౌభాగ్యాల కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు. దేశాన్ని మార్చాలన్న (ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా) ప్రధాన మంత్రి అజెండాలో భాగంగా ఈశాన్య ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
శాంతి, భద్రత అభివృద్ధికి ముందస్తు
అవసరాలని అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు..ఈ ప్రాంతం లో భద్రతా పరిస్థితిని, సుస్థిరత ను మెరుగుపరచడానికి , అనేక మైలురాయి కార్యక్రమాలు తీసుకోవడంతో, భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధాన (కనెక్టివిటీ) ప్రాజెక్టులు అమలు
జరుగుతున్నాయని చెప్పారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలో రోడ్డు దిగ్బంధాలు, నిరసనలు, కర్ఫ్యూ, కాల్పులు వంటి పరిస్థితులు లేవని ఆయన తెలిపారు.
తిరుగుబాటు, విద్రోహ సంబంధిత సంఘటనలు 2014 లో 824 నుండి 2020 లో 163 కు గణనీయంగా తగ్గాయని మంత్రి తెలిపారు. పౌరుల, భద్రతా దళాల మరణాలు కూడా మరణం గణనీయంగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో తిరుగుబాటు వర్గాలతో వారి పునరావాసం కోసం ఆర్థిక ప్యాకేజీల గ్రాంట్లతో పాటు శాంతి సుస్థిరతలను పునరుద్ధరించడానికి అనేక చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా ఆయన చెప్పారు.
భద్రతా వాతావరణం మెరుగుపడడంతో ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అంతర్జాతీయ , దేశీయ వ్యాపార సంస్థలు ఆసక్తి గా ఉన్నాయని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.
ఇంకా, అభివృద్ధి ప్రక్రియను మార్ కి mta వేగవంతం చేయడానికి ఈశాన్య ప్రాంతానికి బడ్జెట్ ను భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు.ఈశాన్య ప్రాంతానికి 54 కేంద్ర మంత్రిత్వ శాఖల మొత్తం స్థూల బడ్జెట్ మద్దతులో సుమారు 110% పెరుగుదల ఉందని, 2014 లో 36,108 కోట్ల నుండి 2022-23 లో 76,040 కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు. ఈశాన్య ప్రాంతానికి కొత్తగా ప్రకటించిన ‘ప్రధాన మంత్రి
డెవెలప్ మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్‘ పిఎం - డివైన్ కింద 1500 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్ధతు ఇవ్వడం ద్వారా, జీవనోప యోగ
కార్యకలాపాలకు వీలు కల్పించడం ద్వారా గతి శ క్తి స్ఫూర్తితో వృద్ధి వేగాన్ని మరింత శీఘ్రతరం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రోడ్డు, రైలు, విమాన అనుసంధానాన్ని పెంచే దిశగా ముందడుగు వేస్తున్నట్టు కూడా శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య ప్రాంతాన్ని దేశ వృద్ధి ఇంజిన్ గా మార్చెలా రైలు కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి భారీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..2014-2021 లో రైలు అనుసంధానాన్ని మెరుగు పరచ డనికి రూ.39,000 కోట్లు ఖర్చు చేయడం
జరిగిందని ఆయన తెలిపారు.
అత్యుత్తమ శాస్త్రీయ ,ఇంజనీరింగ్ ప్రమాణాలను అవలంబిస్తున్నామని, ఈ ప్రాంతం యొక్క కఠినమైన భూభాగం ,స్థలాకృతి కూడా ప్రభుత్వ ప్రయత్నాలను నిరోధించలేదని కేంద్ర మంత్రి అన్నారు.మణిపూర్ - జిరిబామ్ ఇంఫాల్ రైలు మార్గాన్ని ఇందుకు ఉదాహరణ గా పేర్కొంటూ, ఇది 141 మీటర్ల ఎత్తైన పైర్ వంతెన గా ప్రపంచ రికార్డు నమోదు చేసిందని చెప్పారు.
రాజధాని అనుసంధాన ప్రాజెక్టు ఈశాన్య ప్రాంత అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయాన్ని జోడిస్తుందని కూడా ఆయన స్ప ష్టం చేశారు.
2014 కు ముందు అస్సాం రాజధాని గౌహతి మాత్రమే అనుసంధానించబడి ఉందని, నేడు మూడు రాష్ట్రాలు ఇప్పటికే అనుసంధానించబడ్డాయని, మిగిలిన ఐదు క్యాపిటల్ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
రూ. 45016 కోట్ల వ్యయంతో కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ ప్రాంతం రహదారి -హైవే నెట్ వర్క్ కూడా మునుపెన్నడూ లేని స్థాయి లో బలోపేతం అవుతోందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం రూ.41,546 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. . ఉడాన్, కృషి ఉడాన్ ల ద్వారా విమాన అనుసంధానానికి గత కొన్ని సంవత్సరాలలో చాలా ప్రోత్సాహాన్ని పొందామని, దీని వల్ల ఈ ప్రాంతంలో
పర్యాటక , వాణిజ్యం, పెట్టుబడులకు ఉత్తం లభించిందని తెలిపారు. అంతేకాకుండా,
గత ఏడు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో టెలికాం కనెక్టివిటీని న పెంచడానికి 10% జిబిఎస్ కింద రూ.3466.10 కోట్లు ఖర్చు చేసినట్టు శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు.
"యాక్ట్ ఈస్ట్ విధానం" లో భాగం గా అగర్తలా - బంగ్లాదేశ్ తో అఖూరా రైల్ లింక్, మయన్మార్ తో కలదాన్ మల్టీమోడల్ ప్రాజెక్ట్ ,భారతదేశం-మయన్మార్-థాయ్ లాండ్ త్రిముఖ రహదారి వంటి ఈశాన్య ప్రాంతంతో ముఖ్యమైన అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ను మంత్రి నొక్కి చెప్పారు.
2014 నుండి 10,000 కోట్లకు పైగా వ్యయంతో విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేసిందని, ఇది విద్యుత్ అనుసంధానాన్ని ప్రోత్సహించడంలో పనిచేసిందని, ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామికీకరణకు దోహదపడుతుందని శ్రీ రెడ్డి అన్నారు.
జాతీయ జలమార్గం-2 (బ్రహ్మపుత్ర నది, 891 కి.మీ) సాదియా నుండి బంగ్లాదేశ్ సరిహద్దు మరియు జాతీయ జలమార్గం-16 (రివర్ బారక్, 121 కి.మీ) భాంగా-లఖిపూర్ విస్తరణ ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ (ఐబిపి) మార్గంతో సహా ఎన్ఈఆర్ లో ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.
ఎఫ్ సిఐ కోసం 200 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకువెళుతున్న ఎంవి లాల్ బహదూర్ శాస్త్రి కార్గో నౌక బంగ్లాదేశ్ మీదుగా గౌహతిలోని పండూకు చేరుకుందని, ఇది ఈశాన్య ప్రాంతం అభివృద్ధి గాధలో లో ఒక మైలురాయి ఘటన అని శ్రీ రెడ్డి పేర్కొన్నారు.
ఈశాన్య ప్రాంతానికి వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియచేస్తూ, 2021-22 నుండి 2025-26 వరకు వంట నూనెలు - -ఆయిల్ పామ్ (ఎన్ ఎంఇఒ-ఒపి) పై ఆమోదించిన జాతీయ మిషన్ - మొత్తం రూ.11,040 కోట్ల వ్యయంలో 50% కంటే ఎక్కువ తో ప్రస్తుతం ఉన్న 38,000 హెక్టార్లకు మించి ఎన్ఈఆర్ లో 3.38 లక్షల హెక్టార్లను కవర్ చేయాలనే లక్ష్యం నిర్దేశించిందని చెప్పారు.
యువత ఆకాంక్షలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాముఖ్యతపై కూడా మంత్రి మాట్లాడారు. క్రీడలలో యువత సామర్థ్యాన్ని గుర్తిస్తూ, మణిపూర్ లో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రూ.643 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 2014-15 నుంచి ఆరోగ్య రంగంలో రూ.25589.72 కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో డోనర్ మంత్రిత్వ శాఖ రూ.548.32 కోట్ల ను ఈశాన్య ప్రాంతం లో
ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యంగా ఇటీవల కోవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు వెచ్చించిందని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. గువాహతి లో 1,123 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఎయిమ్స్ గురించి (2022లో పూర్తి కానుంది) కూడా మంత్రి ప్రస్తావించారు.
భారతదేశం అభివృద్ధి కి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి కీలకమని స్పష్టం చేస్తూ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి దిశగా సభ్యులందరూ సమిష్టిగా పనిచేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
****
(Release ID: 1806683)
Visitor Counter : 237