అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్

Posted On: 16 MAR 2022 3:51PM by PIB Hyderabad

 టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ (టిఎంసి) ముంబై అన్న‌ది భార‌త ప్ర‌భుత్వ అణు ఇంథ‌న విభాగం ఆద్వ‌ర్యంలోని గ్రాంట్ -ఇన్‌- ఎయిడ్ సంస్థ‌. దీనికి ప‌లు చోట్ల కేంద్రాలు ఉన్నాయి. అవి - 
టాటా మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌, ముంబై
కాన్స‌ర్ చికిత్స‌, ప‌రిశోధ‌న, విద్య‌పై అత్యాధునిక కేంద్రం (ఎసిటిఆర్ ఇసి), ఖ‌ర్గార్, న‌వీ ముంబై
మ‌హామ‌న పండిట్ మ‌ద‌న్ మోహ‌న్ మాలవీయా కాన్స‌ర్ సెంట‌ర్ (ఎంపిఎంఎంఎంసిసి), వార‌ణాసి, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌
హోమీ భాభా కాన్స‌ర్ హాస్పిట‌ల్‌, వార‌ణాసి, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌
హోమీ భాభా కాన్స‌ర్ హాస్పిట‌ల్‌, ప‌రిశోధ‌న కేంద్రం (హెచ్‌బిసిహెచ్ & ఆర్‌సి), సంగ్రూర్ పంజాబ్‌
హోమీ భాభా కాన్స‌ర్ హాస్పిట‌ల్‌, ప‌రిశోధ‌న కేంద్రం (హెచ్‌బిసిహెచ్ & ఆర్‌సి), ముల్లాన్పూర్‌, పంజాబ్
హోమీ భాభా కాన్స‌ర్ హాస్పిట‌ల్‌, ప‌రిశోధ‌న కేంద్రం (హెచ్‌బిసిహెచ్ & ఆర్‌సి), విశాఖ‌ప‌ట్నం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
డాక్ట‌ర్ బి.జ బొరూహ్ కాన్స‌ర్ ఇనిస్టిట్యూట్ (బిబిసిఐ) గువాహ‌తి, అస్సాం
హోమీ భాభా కాన్స‌ర్ హాస్పిట‌ల్‌, ప‌రిశోధ‌న కేంద్రం (హెచ్‌బిసిహెచ్ & ఆర్‌సి), ముజాఫ‌ర్‌పూర్‌, బీహార్‌
టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ 40ః 60 నిష్ప‌త్తిలో చికిత్స‌ను అందిస్తుంది. ఇందులో 60%పూర్తిగా జ‌న‌ర‌ల్ కేట‌గిరీ రోగుల‌కు ఉద్దేశించింది. నిరుపేద కాన్స‌ర్ రోగుల‌కు ఉచితంగా లేక అత్యంత చ‌వుక‌గా చికిత్స‌ను ఇక్క‌డ అందిస్తున్నారు. 
టాటా ట్ర‌స్ట్ తోడ్పాటుతో అణు ఇంథ‌న విభాగం, టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ క‌లిసి 350వ పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ సూచ‌న‌ల మేర‌కు ప‌లు ప్రాంతాల‌లో అద‌న‌పు యూనిట్ల‌ను (హ‌బ్ అండ్ స్పోక్‌)ను ఏర్పాటు చేస్తున్నారు. 
కాన్స‌ర్ చికిత్స కోసం భార‌త‌దేశ వ్యాప్తంగా ఉన్న 250 స‌భ్య కేంద్రాలు క‌లిగిన జాతీయ కాన్స‌ర్ గ్రిడ్ ద్వారా టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ సేవ‌ల‌ను అందిస్తోంది. ఇందులో ప్రాంతీయ కాన్స‌ర్ సెంట‌ర్లు (ఎంఒహెచ్ఎఫ్ డ‌బ్ల్యు ప‌రిధిలోకి వ‌చ్చేవి), దేశ‌వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌తో పాటుగా ప్రైవేటు ఆసుప‌త్రుల స‌హ‌కారం కూడా ఉంటుంది. ఇందుకు అద‌నంగా, త‌మ త‌మ రాష్ట్రాల‌లో కాన్స‌ర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు లేదా అభివృద్ధి చేసేందుకు అవ‌స‌ర‌మైన సాంకేతిక స‌హాయాన్ని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అందించింది.
ఈ స‌మాచారాన్ని సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జి) డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ నేడు లోక్‌స‌భ‌లో ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో వెల్ల‌డించారు. 

***




(Release ID: 1806680) Visitor Counter : 214


Read this release in: English , Urdu , Marathi