రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
హైవేలపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ
Posted On:
16 MAR 2022 1:19PM by PIB Hyderabad
మోటారు వాహనాలు (సవరణ) చట్టం, 2019లోని ( మోటారు వాహనాల చట్టం , 1988లోని సెక్షన్ 136ఎ) అయిన సెక్షన్ 47ను 12 జులై, 2021న విడుదల చేసిన నోటిఫికేషన్ ఎస్ఒ 2806(ఇ)ని 15 జులై 2021 నుంచి అమలులోకి తెచ్చింది. ఒక మిలియన్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రధాన నగరాలలో కీలకమైన జంక్షన్లు, అత్యంత రద్దీ, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న జాతీయ హైవేలు, రాష్ట్ర హైవేలపై తగిన ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చేలా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చూడాలని, ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ, రహదారుల భద్రత అమలుకు 11 ఆగస్టు 2021న విడెదల చేసిన 575(ఇ) జిఎస్ఆర్ నోటిఫికేషన్ నిర్దేశిస్తుంది.
అత్యధికంగా రద్దీ ఉండే కారిడార్ల కోసం ఉద్దేశించిన అత్యాధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఎటిఎంఎంఎస్) లో సిసిటివి/ పాన్ టిల్ట్ జూమ్ (పిటిజెడ్) కెమెరాలు, వివిధ సందేశాత్మక సంకేతాలు, వాస్తవంగా వాహనం నడపవలసిన వేగాన్ని చూపే వ్యవస్థలు, ట్రాఫిక్‌ను లెక్కించే - వర్గీకరించే యాంత్రిక వ్యవస్థ, వీడియో ద్వారా ఘటనను గుర్తించే వ్యవస్థల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా హైవేల పై జరిగే ఘటనలను వేగవంతంగా గుర్తించడమే కాక, వాటిని ప్రభావవంతంగా పర్యవేక్షించవచ్చు.
రాయితీదారు పరిధిలో భాగంగా నెలవారీ పురోగతి వీడియో రికార్డింగ్ నిబంధనను జోడించడం జరిగింది. అంతేకాకుండా, రాయితీదారు పనిని అంచనా వేసేందుకు, పర్యవేక్షించే కన్సల్టెంట్ల సూచనా నియమాలు (టిఒఆర్) ప్రకారం నెట్ వర్క్ సర్వే వాహనం (ఎన్ఎస్‌వి), లేజర్ ప్రొఫైలోమీటర్, ఫాలింగ్ వెయిట్ రెఫ్లెక్టోమీటర్ (ఎఫ్ డబ్ల్యుడి), మొబైల్ బ్రిడ్జ్ ఇనస్పెక్షన్ యూనిట్ (ఎంబిఐయు), రెట్రో రిఫ్లెక్టోమీటర్ తప్పనిసరి.
జాతీయ హైవేలపై జరిగే ప్రమాదాల మొత్తం సంఖ్య, ఈ ప్రమాదాలలో మరణించిన, గాయపడిన వారి డాటాను, ఈ విషయంలో పోలీసులు ఇచ్చిన డాటా ఆధారంగా మంత్రిత్వ శాఖ సంకలనం చేసింది.
ఈ సమాచారాన్నికేంద్ర రహదారుల రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమర్పించిన జవాబులో వెల్లడించారు.
***
(Release ID: 1806675)
Visitor Counter : 205